ఖమ్మం

మిషన్ కాకతీయ పథకం దేశానికే తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారేపల్లి, మార్చి 31: తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకం ఆచరణ సాధ్యమైనదేనని జాతీయ సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ రాఘవులు అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని పెద్ద చెరువు మిషన్ కాకతీయ పనులను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ పథకం దేశానికే తలమానికం కానుందని, నాటి కాకతీయుల స్ఫూర్తిని ప్రపంచానికి మరోమారు తెలియజెప్పటానికి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నం, అమలు తీరు అనేక రాష్ట్రాలకు ఆదర్శం కానుందన్నారు. గ్రామాల్లోని రైతులు కాంట్రాక్టర్ల ప్రలోభాలకు గురికాకుండా నిఘా ద్వారా ఈ పథకాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఏదైనా లోపం జరిగిందంటే అది రైతుల సహకారం లభించకపోవటం వల్లనేనన్నారు. చెరువు లోతట్టు రివిట్‌మెంట్, తూములకు వచ్చే అప్రోచ్‌మెంట్ కెనాల్స్, మత్తడి వద్ద నిర్మించే కాంక్రీట్ నిర్మాణాలు సరిగ్గా లేకపోతే ఆ తరువాత రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. పెద్ద చెరువులో పునరుద్ధరణ పనులు గత సంవత్సరం అసంపూర్తిగా జరిగినా, ఈ ఏడాది నీరు ఇంకా నిలువ ఉందంటే, పూర్తి స్థాయిలో పనులు జరిగితే కారేపల్లి గ్రామంలో భూగర్భ జలాలకు ఢోకా ఉండదన్నారు.
ఎమ్మెల్యే కృషి అభినందనీయం
జిల్లాలో మంజూరైన వాటిలో అత్యధిక చెరువులు కారేపల్లి మండలంలో నిర్మించటానికి కృషి చేస్తున్న వైరా శాసన సభ్యులు బాణోత్ మదన్‌లాల్ కృషిని కొనియాడారు. స్థానిక మండల కేంద్రంలో ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా, మండలంలోని మిగతా గ్రామాల చెరువులను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దటానికి ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు అవసరమైన సహకారం అందించాలని ఆయన సూచించారు.

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం
వైరా, మార్చి 31: ఆయకట్టు రైతాంగానికి ప్రజలకు సాగు, త్రాగునీరు అందించకపోతే ఊరుకోనని రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకాచౌదరి అన్నారు. స్థానిక నీటి పారుదలశాఖ కార్యాలయం ఎదుట మండల అఖిలపక్ష అధ్యర్యంలో గత 11రోజులుగా చేపట్టిన రిలేనిరహార దీక్షలు గురువారం నాటికి 11రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న రేణుకా రైతుల దీక్షకు తన పూర్తి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నమన్నా కెసిఆర్ ప్రభుత్వం గోప్పలే తప్పితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. సంక్షేమ పథకాలన్ని నీరుగారి పోతున్నాయన్నారు. ఇతర రాష్టల్ర నుండి నీటిని రాష్టన్రికి రప్పిస్తున్నని చెపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న నీటిని రిజర్వయర్‌కు తీసుకురాలేకపోతున్నారని ఏద్దేవ చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం అయనకు పట్టదన్నారు. అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో గత 11రోజులుగా ధీక్షలు జరుగుతున్నప్పటికి జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఏమీ చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పటికప్పుడే ధీక్షల ప్రదేశానికి నీటి పారుదలశాఖ ఎఇ రాణిని అధికారులు ఏమి చేస్తున్నారు, రైతుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించకపోతే అఖిలపక్షం పార్టీల అధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నాయకులు గొంతు రాంబాబు, శీలం వెంకటనర్సిరెడ్డి, షేక్ ఆశా, అప్జల్, మోహన్‌రావు, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేసి ప్రాణదాతలు అవండి
ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 31: యువకులు, ఆరోగ్యవంతులు రక్తదానం చేసి ప్రమాదబారిన పడిన వారికి ప్రాణదాతలు అవ్వాలని ఖమ్మం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ గుగులోత్ పాపాలాల్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం ఆర్టీసి బస్టాండ్‌లో ఆర్టీసి ఆసుపత్రి, ఆర్టీవో సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగిచారు. వాహనదారులు రోడ్లపై వేగాన్ని మించి వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారినపడి ప్రాణాలను కోల్పోతున్నారని, వీరిలో అధికశాతం మంది రక్తం అధికంగా పోవడం, సమయానికి రక్తం అందకపోవడం ద్వారానే మరణిస్తున్నారన్నారు. ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి జీవితకాలంలో 58 సార్లు రక్తం దానం చేయవచ్చన్నారు. అనంతరం ఆర్టీసి సీనియర్ డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ రవాణ మంత్రి సూచనల మేరకు బస్టాండ్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి దాతలను ప్రొత్సహించనున్నట్లు తెలిపారు. రక్తం మానవశరీరంలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని, దీనిని మిషన్ల ద్వారా తయారు చేయలేమన్నారు. కావున ప్రతి ఒక్కరు రక్తం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రక్తదాతలను ప్రొత్సహించేందుకు ప్రచారం నిర్వహించాలని ఆయన అన్నారు. కాగా సంకల్పవాలంటరీ ఆర్గనైజేషన్ సభ్యులు ఈ శిబిరంలో రక్తదానం చేసి వారి సంకల్పాన్ని తెలియజేశారు. 50 మందిపైగా యువకులు, పెద్దలు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యమ్రంలో డెప్యూటి మేయర్ బత్తుల మురళీప్రసాద్, ఆర్టీసి రీజియన్ మేనేజర్ ఎన్ శివకుమార్, డిపో మేనేజర్ సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తెగిపడ్డ చేయి
* ఇద్దరికి తీవ్ర గాయాలు
కల్లూరు, మార్చి 31: స్థానిక మెయిన్ సెంటర్‌లో రాష్ట్రీయ ప్రధాన రహదారిపై లారీ రోడ్డు పైకి వాలి ఉన్న చెట్టు కొమ్మను ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఒకరి చేయి తెగి కింద పడింది. ఈ విషయమై స్థానిక రెండవ ఎస్సై ఫణి తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం నుండి చేపలు పట్టేందుకు కూలీలను లారీలో ఎక్కించుకొని వరంగల్ జిల్లా తొర్రూర్‌కు వెళుతున్నారు. కూలీలలో పడవల్లి ఆప్పలరాజు, లంకా లీలయ్య డ్రైవర్ పక్కన క్యాబిలో కూర్చున్నారు. గురువారం ఉదయం లారీ కల్లూరు మెయిన్ సెంటర్‌లో రోడ్డుపైకి వాలి ఉన్న పెద్ద చెట్టును డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం ద్వారా ఢీ కొట్టినట్లు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో డోర్ పక్కన చేయి పెట్టి నిద్రిస్తున్న అప్పలరాజు ఎడమ చేయి మోచేతి పై వరకు పూర్తిగా విరిగి కింద పడగా లీలయ్యకు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రగంగా గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కల్లూరులో రోడ్డు అభివృద్ధి పనులు జరుపుతూ ఒక పక్క రోడ్డుపై గోతులు తీసి ఉండటంతో వాహనాలు ఎడమ వైపుగా వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా మెయిన్ సెంటర్‌లో చెట్టు రోడ్డుపైకి వాలి ప్రమాదకరంగా ఉందని వెంటనే దాన్ని తొలగించాలని కోరుతున్నారు.

పుస్తక పఠనంపై పిల్లల్లో ఆసక్తిని నింపాలి

ఖమ్మం(కల్చరల్), మార్చి 31: పుస్తక పఠనంపై పిల్లల్లో ఆసక్తిని నిపాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఖమ్మం కార్పోరేషన్ మేయర్ డాక్టర్ జి పాపాలాల్ పేర్కోన్నారు. గురువారం స్థానిక టిఎన్‌జివోస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఖమ్మం కథలు పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికత వల్ల పిల్లలు పుస్తకాలు చదవడం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఉపాద్యాయులు స్కూల్ వయస్సులోనే పిల్లలకు పుస్తకాలు, కధలు, కవితలు వంటి వాటిని చదవడం అలవాటు చేయాలన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల వాడకం పెరిగి పోవడంతో ఈ పరిస్ధితి దాపురించిందన్నారు. అందుకే ఉపాద్యాయులు పిల్లల్లో చిన్ననాటి నుండే కధలు చదవడం అలవాటు చేయడం వల్ల చరిత్ర తెలుసుకుంటారన్నారు. ప్రముఖ రచయిత, సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ కమ్మం కధలు జిల్లా సాహితీ చరిత్రను తవ్వితీసి రేపటి తరానికి మార్గ దర్శకమవుతుందన్నారు. జిల్లా అధికారులు స్పందించి ఈ పుస్తకాన్ని అన్ని పాఠశాలల్లో, గ్రంధాలయాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రచయితగా జ్వలిత తనుచేసిన ప్రయత్నం గొప్పదన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం అధికారులు చేయాలని విజ్ఞప్తి చేశారు. పుస్తక సమీక్షచేసిన కవి విమర్శకులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ 104 మంది కవులు రచించిన గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని 105 కథలుగా 675 పేజీలతో ఉన్న ఈ పుస్తకం మిగతా జిల్లా కంటే మిన్నగా ఉందన్నారు. ఖమ్మం కథలు సంపాదకురాలు జ్వలిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప మేయర్ బత్తుల మురళి, కవి విమర్శకులు, నాటక రచయిత, దర్శకులు దెంచనాల శ్రీనివాస్, టిఎన్‌జిఒ రాష్ట్ర నాయకులు కూరపాటి రంగరాజు, కవి, రచయిత డాక్టర్ దిలావర్, తుంగతుర్తి జనార్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.