ఖమ్మం

నారాయణపురంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, అక్టోబర్ 9: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో దోమందుల చినముత్తయ్య, వెంకటకృష్ణ, కృష్ణవర్ధన్ జ్ఞాపకార్థం నిర్వహించే మండల స్థాయి కబడ్డీ పోటీలను ఎస్‌ఐ జె ఆంజనేయులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాజ్యోతిని ప్రారంభించి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మన జాతీయ క్రీడ అయిన కబడ్డీని గ్రామాల్లో నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమని, క్రీడలను, క్రీడలుగానే చూడాలని, గెలుపోటములను సమానంగా భావించాలన్నారు. ఇటువంటి క్రీడలు శారీరక వ్యాయామానికి తోడ్పడతాయన్నారు. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసానికి ఇటువంటి క్రీడల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. కమిటీ వారు ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా సమర్థవంతంగా, సామరస్యంగా నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామ ఎంపిటిసి దోమందుల ఎల్జిబెత్తు రాణి, గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలకు 24టీమ్‌లు పాల్గొన్నాయి. ఆదివారం, సోమవారం జరిగే పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానాన్ని ఎస్‌ఐ జె ఆంజనేయులు ద్వారా ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దోమందుల సామేలు, వెంకటరామిరెడ్డి, గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు.