ఖమ్మం

భద్రాద్రిలో భక్తులకు రక్షిత మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 15: శ్రీరామదివ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు ఇచ్చేందుకు రూ.40లక్షల వ్యయంతో వాటర్ ట్యాంకులు, వాటర్ ప్లాంట్లను నిర్మిస్తున్నట్లు మహబూబ్‌బాద్ ఎంపి సీతారామ్‌నాయక్ వెల్లడించారు. శ్రీసీతారామచంద్రస్వామిని శనివారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. సీతానిలయం, రామానిలయం, తానీషా కల్యాణ మండపాల వద్ద వీటి నిర్మాణం జరగుతుందన్నారు. ఇందుకు ఎంపి ల్యాడ్స్ నిధుల నుండి రూ.20లక్షలు కేటాయించానని, మిగిలిన రూ.20లక్షలు దేవాదాయ, ధర్మాదాయశాఖ భరిస్తుందని వివరించారు. కొత్తగూడెం - నల్గొండ మధ్యలో 230 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి తాను చేసిన ప్రతిపాదనలకు సానుకూల సంకేతాలందాయన్నారు. భద్రాచలం-ఏటూరునాగారాన్ని కలుపుతూ మరో జాతీయరహదారికి కూడా ప్రతిపాదనలు వెళ్లాయని వెల్లడించారు. పాండురంగాపురం-సారపాక మధ్య రైల్వే లైను కోసం తెలంగాణ సర్కారు ఇప్పటికే కేంద్ర రైల్వేశాఖకు లేఖ రాసిందన్నారు. కేంద్రం బిఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఇంటింటికి నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ఎఫ్‌టిటిహెచ్(ఫైబర్ టెక్నాలజీ టు ద హౌస్) అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని, రూ.420లకే అందుబాటులోకి తెస్తుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక నేటి వరకు నూతన జిల్లాలు రాలేదని, తెలంగాణ సర్కారు 21 జిల్లాల ఏర్పాటు తెలంగాణ అభివృద్ధికి మైలురాయి అని అభివర్ణించారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు నియామకం జిల్లాకు మేలు చేస్తుందని అన్నారు. గిరిజన మారుమూల గ్రామాలపై అవగాహన ఉన్న అధికారిగా వారికి కావాల్సిన అవసరాలను గుర్తిస్తారని అన్నారు.