ఖమ్మం

పారదర్శకంగా సేవలందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 15: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీని అవినీతి రహిత మార్కెట్‌గా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుస్తానని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గుండాల కృష్ణ పేర్కొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా శనివారం మధ్యాహ్నం 2.55నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు వైస్‌చైర్మన్ మందడపు నర్సింహరావు, ఎనిమిది మంది డైరెక్టర్లు కూడా పదవీ ప్రమాణం చేశారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌లు సంతకాలు చేసి తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు కృష్ణతో పాటు పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఖమ్మం ఒకటని, ఇక్కడ రైతులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారని, వాటన్నింటిని పరిష్కరించాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉందన్నారు. మార్కెట్ నిధులను అన్ని రకాల అభివృద్ధి పనులకు వెచ్చించే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కెసిఆర్ ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అధికారులు, కమిటీ సభ్యులను సమన్వయం చేస్తూ సవాళ్ళను అదిగమిస్తామన్నారు. తన తండ్రి ఇదే మార్కెట్‌లో పనిచేశారని, రైతుల కష్టసుఖాలు తెలుసని, వాటన్నింటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. మయూరిసెంటర్‌లో ఉన్న అమరవీరుల స్థూపానిక్ణి కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డైరెక్టర్లు నంద్య, సంజీవయ్య, మాదవరెడ్డి, సైదులు, రఫీయుద్దీన్, బడేసాహేబ్, రమేష్, వెంకటేశ్వర్లు, కార్యదర్శి ప్రసాద్‌రావు, కృష్ణ సతీమణి కవిత పాల్గొన్నారు.