ఖమ్మం

మాయచేస్తున్న సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), అక్టోబర్ 15: మాటల గారడితో కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, కాలం కలిసిరాక నకిలీ విత్తనాలతో నష్టపోయి రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం అన్నదాత ఆక్రందన యాత్ర పేరుతో జమలాపురం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఖమ్మం వరకు సాగిన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. శనివారం రాత్రి ఖమ్మం చేరుకున్న యాత్రను ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ సాగర్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయినా నేటికి స్పందించలేదన్నారు. శాస్ర్తియత లేకుండా జిల్లాల విభజన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నుంచి అనేక సంక్షేమ పథకాలు మాటలకే పరిమితమవుతున్నాయని, ప్రజలను మాయ చేసేందుకు ఏదో ఒక సంఘటనను తీసుకొనివచ్చి పాలన సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పాలనను, నాయకుల తీరును గమనిస్తున్నారని, దీనికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. యాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎర్రుపాలెం, మధిర, వైరా, కొణిజర్ల, రఘునాధపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల గుండా ఖమ్మం నగరానికి చేరుకున్న యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో వాహనాలు ర్యాలీలో పాల్గొన్నాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందులో పాల్గొనడం గమనార్హం.
ఇదిలా ఉండగా యాత్ర జమలాపురం నుంచి ప్రారంభం అవుతుందనే సమాచారాన్ని అందుకొని అనేక మంది కాంగ్రెస్ నేతలు ఖమ్మం నగరంలోని ధర్నాచౌక్‌కు (మిగతా 6లో)
చేరుకున్నారు. మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు రాఘవతో పాటు అనేక మంది నేతలు ఖమ్మంకు చేరుకొని అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో సమాచారం తెలుసుకొని తిరిగి యాత్రలో పాలుపంచుకునేందుకు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం, వడ్డెబోయిన నర్సింహరావు, బండి మణి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.