ఖమ్మం

టిఎన్‌జివో 70 వసంతాల సంబురాలను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 18: తెలంగాణ నాన్‌గెజిటేడ్ ఉద్యోగుల సంఘం 70 వసంతాల సంబురాలను ఈ నెల 20వ తేదిన ఖమ్మంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు తెలిపారు. మంగళవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఉద్యోగ సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగ సంఘం అవిర్భావించి 70సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. సంఘం వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహించాలని కేంద్ర కమిటీ సూచన మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. టిఎన్‌జివో ఉద్యమ ప్రస్థానంలో అనేక చారిత్రక ఘట్టాలు నిలిచిపోయాయన్నారు. 1952లో జరిగిన ముల్కి ఉద్యమం నాందిపలికిందని గుర్తుచేశారు. ఆనాటి నుండి నేటి వరకు ఉద్యోగ సమస్యలపై అనేక పోరాటం నిర్వహించి ఫలితాలు రాబాట్టమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర కీలకమన్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న సంబురాలనువిజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి రాజారావు, నాయకులు వెంకటేశ్వరరావు, ప్రసాద్‌రావు, వల్లాజి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు

హరితహారంపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
* భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆర్‌జి హనుమంతు
కొత్తగూడెం, అక్టోబర్ 18: హరితహారం లక్ష్యాలను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయ సమావేశమందిరంలో హరితహారంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2016 సంవత్సరంలో కోటి 53లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా రూపొందించుకుని ఒకకోటి 66లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. 2017వ సంవత్సరంలో ఒకకోటి 80లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. అటవీశాఖ ద్వారా 40లక్షల మొక్కలు, జిల్లా గ్రామీణాభిశాఖ ద్వార 25లక్షలు, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 18లక్షలు, ఉద్యానవనశాఖ ద్వార 4లక్షలు, సింగరేణి ఆధ్వర్యంలో 15లక్షలు, మున్సిపాలిటీలలో 7లక్షల మొక్కలు, భద్రాచలం ఐటిసి ఆధ్వర్యంలో 45లక్షల మొక్కలు హరితహారంలోనాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. హరితహారంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, టేకు, కరివేపాకు, జామా, మునగ, పాపయ, ఉసిరి, సీతాఫలం, గోరింటాకు తదితర మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందన్నారు. మొక్కల పంపిణిని గరిమెళ్ళపాడు నుండి మండల సమాఖ్యలకు రవాణాకు అయ్యే ఖర్చులు ఐటిడిఎ ద్వార వెచ్చించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పి జగత్‌కుమార్‌రెడ్డి సహాయ గ్రామీణాభివృద్ధి అధికారి విజయచంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి ముకుందరెడ్డి, సింగరేణి ఫారెస్ట్ సెక్షన్ డిఎం హరినారాయణ, ఐటిసి భద్రాచలం ప్రొడక్షన్ ఇన్‌చార్జ్ విశ్వకర్మ, జిల్లా ఉద్యానవనశాఖాధికారి మరియన్న, ఐటిడి ఎఎపిఓ, ఎపిడిలు మల్లీశ్వరి, పాల్వంచ, మణుగూరు మున్సిపల్ కమీషనర్లు రాజిరెడ్డి, సంపత్‌కుమార్, ఐకెపిఎన్‌ఎం లు జయశ్రీ, అనురాధ, మహాత్మగాంధీవన అధికారి ఎం వి రత్నం, గరిమెళ్లపాడు హెచ్‌ఇఓ జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.