ఖమ్మం

రెల్లి కులాల సంక్షేమం పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 4: పారిశుద్ధ్య వృత్తినే నమ్ముకుని సమాజాన్ని శుభ్రం చేస్తున్న రెల్లి కులాల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు భూపతి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం ముందు నుంచి పారిశుద్ధ్య పనికే తమ జీవితాలను పణంగా పెట్టినా ప్రభుత్వాలు వీరి సంక్షేమాన్ని మరిచాయని అన్నారు. భద్రాచలంలోని రెల్లి వీథిలో శుక్రవారం జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం పారిశుద్ధ్య పనుల్లో ఉన్న రెల్లి కులస్థులను ఊరికి దూరంగా ఉంచి అవమానిస్తున్నారని, ప్రభుత్వాలు కూడా పట్టనట్లు వ్యవహరించడంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలు వారి దరి చేరడం లేదన్నారు. రిజర్వేషన్లు కూడా అనుభవించలేక వారు అష్టకష్టాలు పడుతున్నారని, జనాభా ప్రాతిపదికన రెల్లి కులస్థులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రభుత్వాలు వారిని అభివృద్ధి చేయాలన్నారు. సంక్షేమ పథకాలతో పాటు కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎస్సీల్లో ఉన్న 57 కులాలకు సమన్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలన్నారు. అనంతరం జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వాసుపల్లి నాగేంద్రబాబును నియమిస్తూ ఉత్తర్వులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి అలవార రాజా, రమణయ్య, కనుకు శ్రీనివాస్, విద్యాసాగర్, వాసుపల్లి శ్రీనాథ్, నాగమణి, విజయ, పుష్పలత, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.