ఖమ్మం

సింగరేణిలో విఆర్‌ఎఎస్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, నవంబర్ 4: సుదీర్ఘకాలం అనంతరం సింగరేణి సంస్థలో విఆర్‌ఎస్ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతోప్రస్తుత కార్మికుల్లో ఉత్సాహం నెలకొనగా, మాజీ కార్మికుల్లో నిరుత్సాహం ఏర్పడింది. విఆర్‌ఎస్ కోసం ఏడాదిన్నరగా పోరు సాగిస్తున్న నిరుద్యోగులు డీలా పడ్డారు. 2009లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(విఆర్‌ఎస్) పథకాన్ని సింగరేణి యాజమాన్యం నిలిపివేసింది. అనేక సంవత్సరాలుగా మైన్‌లో పనిచేస్తున్న కార్మికులు మూడేళ్ళ ముందుగా పదవీ విరమణ పొందితే వారి స్థానంలో కార్మికుడి కుటుంబానికి చెందిన పెద్దకొడుకుకి ఉద్యోగం ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఆ పథకాన్ని యాజమాన్యం నిలిపివేయడంతో అప్పటి నుండి విఆర్‌ఎస్ పునరుద్ధరణ కోసం కార్మిక సంఘాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో విఆర్‌ఎస్ పథకాన్ని పునరుద్ధరించేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా వెలువడిన సమాచారం మేరకు అక్టోబర్ 11నుండి విఆర్‌ఎస్ పథకం అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన విధి, విధానాలు తెలియాల్సి ఉంది. ఏడాది పాటు కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా కార్మికసంఘాలు భావిస్తున్నాయి. కాగా విఆర్‌ఎస్ పథకం పునరుద్ధరణ కారణంగా ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న 10వేల మందికి పైగా కార్మికులకు వర్తించే అవకాశాలు ఉన్నాయని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 35ఏళ్ళ వయస్సు మధ్యలో ఉన్న కార్మిక కుటుంబంలోని నిరుద్యోగికి మాత్రమే విఆర్‌ఎస్ పథకం ద్వారా సింగరేణి సంస్థలో ఉద్యోగం లభించనుంది. దీంతో రెండేళ్ళ సర్వీస్ ఉండగానే సదరు కార్మిడుకు తన పదవికి విరమణ పొందాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం విఆర్‌ఎస్ పథకాన్ని అమలు చేయనున్నందున 10వేల కార్మిక కుటుంబాల్లో ఆనందం నిండుతుంది. ఇదిలా ఉండగా 2009నుండి గత ఏడాది వరకు ముందస్తుగా పదవీ విరమణ చేసిన కార్మిక కుటుంబాల నిరుద్యోగులకు ఈ పథకం వర్తించదని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సింగరేణి వ్యాపితంగా మాజీ కార్మిక కుటుంబాలకు చెందిన మూడువేల మందికి పైగా నిరుద్యోగులు విఆర్‌ఎస్ పథకాన్ని పునఃప్రారంభించి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు జిల్లాల పరిధిలోని కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ఏడాది పాటు నిరాహార దీక్షలను సైతం కొనసాగించారు. వారెవ్వరికి ప్రస్తుత విఆర్‌ఎస్ విధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ముందస్తు పదవీ విరమణ సందర్భంగానే సంస్థ నుండి డబ్బును తీసుకోవడం వలన విఆర్‌ఎస్ పథకం వర్తించే అవకాశం లేకుండా పోయిందని పలు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అయితే 103మంది కార్మికులు ముందస్తు పదవీ విరమణ చేసి డబ్బులు తీసుకోనందున వారి కుటుంబాలకు విఆర్‌ఎస్ పథకం వర్తించనుంది. ఆయా కుటుంబాలలోని యాబైమంది నిరుద్యోగ యువకులకు వయో పరిమితి దాటిపోయినందున అర్హత కోల్పోనున్నారు. మిగిలిన 53మందికి కొత్త విఆర్‌ఎస్ పునరుద్ధరణ విధానం ద్వారా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. త్వరలో సింగరేణి సంస్థలో కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న తరుణంలో విఆర్‌ఎస్ పథకం పునరుద్ధరణ కారణంగా ప్రస్తుత గుర్తింపు సంఘానికి లబ్ధిజరిగే అవకాశాలు ఉన్నాయి. పథకం కోసం పోరాటాలు చేసిన మాజీ కార్మికుల నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.