ఖమ్మం

పరవళ్లు తొక్కుతున్న సాగర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, నవంబర్ 6: ఇటీవల సాగర్ కాల్వకు నీటిని విడుదల చేయడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సాగర్ నీరు ఉవ్వెత్తున పరవళ్లు తొక్కుతూ ప్రహిస్తుండడంతో కాల్వకు నిండుదనం సంతరించుకుంది. ఉధృతంగా వస్తున్న నీటి ధాటికి మండలంలోని తెల్దారుపల్లి వద్ద కాల్వ కట్ట నుంచి పలుచోట్ల నీరు వెలుస్తుండడంతో కాల్వకు బుంగ పడుతుందేమోననని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి పైభాగంలో సుమారు 50 అడుగుల లోతులో డీప్‌కట్ ఉండగా, గ్రామం సమీపంలో మాత్రం పోతమట్టితో కాల్వను నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు. కాల్వ పై భాగంలో, గ్రామం కొంతమేర లోతట్టుగా ఉండడంతో కాల్వ కట్ట నుంచి అక్కడక్కడా నీరు వెలుస్తోంది. గత పది పదిహేనేళ్ళ క్రితం కాల్వ కట్టకు బుంగ పడిందని, ప్రస్తుతం కూడా అటువంటి సంఘటన ఏమైనా సంభవిస్తుందేమోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కాల్వకట్టను పరిశీలించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.