ఖమ్మం

రాములోరి పెళ్లికి భద్రగిరి ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 5: ఈ నెల 15న జరిగే శ్రీసీతారాముల కల్యాణం శ్రీరామనవమి కోసం భద్రగిరి ముస్తాబవుతోంది. పట్టణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకాధికారి ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి నేతృత్వంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. చలువ పందిళ్ల నిర్మాణం జరుగుతోంది. మిథిలా స్టేడియంతో పాటు భక్తులకు వసతి కోసం అదనంగా 1.50 లక్షల చదరపు అడుగుల్లో పందిళ్లు నిర్మిస్తున్నారు. తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి రహదారి డివైడర్స్‌కు రంగులు అద్దుతున్నారు. చర్ల మార్గంలో దెబ్బతిన్న జాతీయ రహదారికి మరమ్మత్తులు ప్రారంభించారు. ఇప్పటికే ఐటీడీఏ పీఓ అన్ని శాఖల అధికారులతో ప్రతీ రోజూ సమీక్షలు నిర్వహించి పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. స్వయంగా ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఏఎస్పీ భాస్కరన్, సీఐ సారంగపాణిలు భద్రతతో పాటు బారికేడింగ్ గురించి ప్రణాళికలు రచిస్తున్నారు. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు ఈఈ దయాకర్‌రెడ్డి, డీఈ రవీందర్‌ల ఆధ్వర్యంలో ఆలయం సుందరీకరణ, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఈసారి మొబైల్ తాగునీరు, ప్రసాదాల పంపిణీకి దేవస్థానం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తలంబ్రాల పంపిణీ వద్ద ఎంపీడీఓ స్థాయి అధికారులను నియమించేందుకు పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన భక్తులు సంతృప్తిగా కల్యాణం తిలకించి, తలంబ్రాలతో సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రణాళిలు సిద్ధం చేశారు. అమలు చేస్తున్నారు. ఉభయదాతల టిక్కెట్ల విక్రయం దేవస్థానం ఇప్పటికే ప్రారంభించింది. రూ.5వేల ధరతో కూడిన ఈ టిక్కెట్‌పై దంపతులతో పాటు వారి ఇద్దరి పిల్లలకు అవకాశం కల్పిస్తారు. వారి గోత్రాల పేరుతో కల్యాణం నిర్వహించి స్వామి శేషవస్త్రాలు, శేషమాలికలు, ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు ఉచితంగా ఇస్తారు.