ఖమ్మం

మిరప తోటలకు తెగుళ్ల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, డిసెంబర్ 26: ఈఏడాది వాతావరణం మిరప పంట సాగుకు ప్రతికూలంగా మారింది. గత రెండేళ్ల నుంచి ప్రకృతి సహకరించటంతో పాటు మార్కెట్‌లో కూడా ధర కొంత మేర అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మండలంలో సుమారు 3500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతాంగం మిరప పంటను సాగు చేసింది. అయితే మిరప నారు మడులు పోసి మొక్కలను నాటేందుకు సాగు తొలి దశలోనే వర్షం అనుకూలించక పోవటంతో రైతులు నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఆతర్వాత ఒక్క సారి కూడా సరైన వర్షం పడకపోవటంతో పాటు వాతావరణం అనుకూలించక తోటలకు తెగుళ్ల ఉధృతి అధికమైంది. పంటను కాపాడుకునేందుకు రైతులు తెగుళ్ల నివారణా రసాయనాలను విరివిగా పంటలకు పిచికారీ చేస్తుండటంతో పెట్టుబడులు అధికమవతున్నాయి. అయినా ఫలితం కనిపించక పోగా చెట్ల ఆకులు గిడసబారిపోవటం, రంగు మారి ఎండిపోవటం, పూత పిందె రాలిపోవటం, చెట్ల ఎదుగుదల లోపించిటం, కాయలు కూడా తక్కువ పరిమాణంలో ఉంటుండటంతో మిరప తోటల పరిస్థితిని చూసి తట్టుకోలేక రైతులు తోటలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో ఎకరానికి రైతులు రు.50వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోలేకనే తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు సిద్ధవౌతున్నామని రైతులు వాపోతున్నారు. జూలూరుపాడు, వినోభానగర్, పాపకొల్లు, గుండెపుడి, అనంతారం, బేతాళపాడు, పడమట నర్సాపురం, మాచినేనిపేట తండా, మాచినేనిపేట, కరివారిగూడెం ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో మిరప పంటను సాగు చేయగా, జూలూరుపాడు, పాపకొల్లు, వినోభానగర్, గుండెపుడి ప్రాంతాల్లో సమారు 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తోటలను ఇప్పటికే తొలగించారు. మిరప పంటను సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా రైతు చైతన్య సదస్సులు నిర్వహించి సలహాలు ఇవ్వాలని పలువురు రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

సింగరేణిలో నలుగురు
డిజిఎంల బదిలీలు
కొత్తగూడెం, డిసెంబర్ 26: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న నలుగురు డెప్యూటీ జనరల్ మేనేజర్లను బదిలీచేస్తూ యాజమాన్యం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్‌లో డివైజిఎం (ఇఅండ్‌ఎం)గా పనిచేస్తున్న టి వెంకటేశ్వరరావును కొత్తగూడెం ఏరియా (ఇఅండ్‌ఎం) ఇంజనీర్‌గా బదిలీ చేశారు. కార్పొరేట్ సెంట్రల్ వర్క్‌షాప్‌లో డివైజిఎం (ఇఅండ్‌ఎం)గా పనిచేస్తున్న కిశోర్‌గంగాను భూపాలపల్లి ఏరియా (ఇఅండ్‌ఎం) ఇంజనీర్‌గా, బెల్లంపల్లి ఏరియాలో డివైజిఎం (ఇఅండ్‌ఎం)గా పనిచేస్తున్న కలగడ్డ ప్రసాదరావును కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్‌నకు, మణుగూరు పికెఓసిలో డివైజిఎం (ఇఅండ్‌ఎం)గా పనిచేస్తున్న మట్టా నర్సిరెడ్డిని బెల్లంపల్లి ఏరియాకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ అ పురుషోత్తపట్నంలో
రామయ్యకు రాపత్ సేవ

భద్రాచలం, డిసెంబర్ 26: ఆంధ్రాలోని విలీన మండలం నెల్లిపాకలోని పురుషోత్తపట్నంలో శనివారం రాత్రి శ్రీసీతారామచంద్రస్వామికి రాపత్ సేవ జరిగింది. కోదండ రామాలయానికి స్వామి ఊరేగింపుగా రామానుజాళ్వార్, నమ్మాళ్వార్‌లతో కలిసి రాపత్ సేవకు వెళ్లారు. తొలుత రామాలయం గర్భగుడిలో స్వామికి దర్బారు సేవ నిర్వహించారు. అనంతరం స్వామి కోలాటాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ పురుషోత్తపట్నానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశాక తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రామాయణం హరికథా కాలక్షేపం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.