ఖమ్మం

నోట్ల రద్దు వెనక బిజెపి రాజకీయ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దు వెనక బిజెపి రాజకీయ లబ్ధి ఉన్నదని, నోట్ల రద్దుకు సంబంధించిన ప్రకటనకు ముందే బిజెపి నేతల ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో ప్రారంభమైన సిపిఐ ఖమ్మం జిల్లా నిర్మాణ సభల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల ఏ ధనవంతుడు ఏడవటం లేదని, పేదలు మాత్రం నానా కష్టాలు పడుతున్నారన్నారు. కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికితీయకుండా నోట్లను రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొద్దిరోజుల్లోనే ప్రజల ముందు మోడీ దోషిగా నిలబడక తప్పదన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూడా రోజురోజుకు నిర్భందం పెరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోదండరాంపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో కెసిఆర్ కుటుంబం కోట్లాది రూపాయలు దోచుకుంటుందన్నారు. కెసిఆర్‌కు వాస్తు, డబ్బు పిచ్చి పట్టిందని, వాస్తు పేరుతో భవనాలను కూలకొట్టే ప్రయత్నం చేస్తూ ఉద్యమాల తెలంగాణను నిర్భంధ తెలంగాణ, ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారన్నారు. యాగాలు, ముక్కు పుడకల ద్వారా సామాన్యులకు లాభం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో గడిల పాలన కొనసాగుతున్నదని, అవసరమైతే మరో ఉద్యమానికి సిపిఐ సన్నద్ధమవుతుందన్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కమ్యూనిస్టుల అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని వెల్లడించారు. మతోన్మాద చర్యలు వేగం పుంజుకోవడమే కాకుండా, కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారని పేర్కొంటూ ప్రజా ఉద్యమలకు శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 28నుంచి 30వరకు హన్మకొండలో జరిగే రాష్ట్ర మహాసభల్లో ప్రభుత్వాల విధానాలపై భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, పాకలపాటి వెంకటేశ్వరరావు, టివి చౌదరి, కళావతి, జనార్థన్‌రావు తదితరులు పాల్గొనగా జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు కార్యదర్శి నివేదికను, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

నోట్ల రద్దుతో ఆర్థిక సంక్షోభం
* తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకం
* ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి

ఖమ్మం, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో దేశం ఆర్థిక సంక్షోభంలో పడిందని, చిన్ననోట్లు లభించక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ 500,1000 రూపాయల నోట్లను రద్దు చేయడం పట్ల యావత్తు దేశం ఆందోళన చెందుతోందన్నారు. బ్లాక్ మనీ వెలికితీయడాన్ని స్వాగతిస్తూనే ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశాల నుండి నల్లడబ్బును తీసుకొచ్చి పేదల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పెద్దనోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభినం అయిందన్నారు. 500,1000నోట్లను రద్దు చేస్తూనే 2000నోట్లను విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చిల్లర కోసం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. ఇందుకు నైతిక బాధ్యత ప్రధానే వహించాలన్నారు. ప్లాస్టీక్ మనీపై అందరికి అవగాహన లేదని, వాటిని ఎలా వాడాలో కూడా తెలియని వారి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంట తరుణంలో నోట్ల రద్దుతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను జాతీయికరణ చేసి ప్రజా సంక్షేమాన్ని ప్రకటిస్తే నేడు నరేంద్రమోడీ బ్యాంకుల ఎదుట క్యూలు కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి సమస్య మరింత జఠిలం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు కట్ల రంగారావు, మనోహర్‌నాయుడు, ఎండి ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రికి త్వరలో ఎస్సీ, ఎస్టీ కోర్టు
* ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులు
* హైకోర్టు న్యాయమూర్తి సునీల్‌చౌదరి

భద్రాచలం టౌన్, నవంబర్ 20: భద్రాద్రి రామయ్య కొలువై ఉన్న చోట న్యాయస్థానం ప్రారంభించడం పూర్వజన్మ సుకృతమని, భద్రాద్రి శ్రీరాముడి ఆశీస్సులతో త్వరలో భద్రాచలంనకు ఎస్సీ, ఎస్టీ కోర్టు వచ్చే అవకాశం ఉందని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి టి.సునీల్‌చౌదరి పేర్కొన్నారు. భద్రాచలంలో రూ.3.78కోట్లతో నిర్మించిన ప్రథమశ్రేణి న్యాయస్థానం భవనాన్ని ఆయన ప్రారంభించారు. భద్రాచలంలో కోర్టు భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. గిరిజన కొమ్ము నృత్యాల నడుమ ఆయనకు స్వాగతం పలికి నూతన కోర్టు వద్దకు తీసుకెళ్లారు. కోర్టు భవనంలో న్యాయమూర్తి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అవసరమైన సమయంలో భద్రాద్రిలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏర్పాటుకు తగు తోడ్పాటు అందిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్లు, న్యాయవాదులు కేసులు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కేసులను వాయిదా వేసే పద్ధతి మానుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల మనస్సు స్వచ్ఛమైందని, వారు అబద్ధం చెప్పరని, నిజాయితీగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా గతంలో తాను న్యాయమూర్తిగా వ్యవహరించిన సమయంలో ఒక గిరిజనుడి కేసును ఉదహరించారు. వైకుంఠ రాముడు కొలువై ఉన్న భద్రాద్రిలో నివసిస్తున్న ప్రజలంతా అదృష్టవంతులని, ఈ ప్రాంతం ఆర్థికంగా వెనుకబడినా ఇక్కడి వారి మనస్సు మాత్రం మంచిందన్నారు. ఎవరినీ పొగడాల్సిన అవసరం లేదని, మనస్సులో ఉన్న మాటను వ్యక్తం చేశానని చెప్పారు. ఈ ప్రాంతంలోని న్యాయవాదు సివిల్ ప్రాక్టీసు సమయంలో సబ్జెక్టుపై కొంత పట్టు పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయనకు భద్రాచలం ప్రథమ న్యాయస్థానం, బార్ అసోసియేషన్ తరుపున జ్ఞాపికను అందించారు. పలువురు న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి స్వయంగా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సెషన్స్ జడ్జి ఈ.తిరుమలాదేవి, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి బులికృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.వసంతరావు, న్యాయవాదులు పీవీ కృష్ణమాచారి, కొడాలి శ్రీనివాసన్, పడిసిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి పాతర
* పాలకులపై సిపిఎం రాష్ట్ర నాయకుడు సుదర్శన్ ఆరోపణ
గార్ల, నవంబర్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పూర్తిగా పాతరేసి స్వయ నిర్ణయాలు, నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకుడు పొతినేని సుదర్శన్ ఆరోపించారు. స్థానిక సమత హైస్కూల్‌లో ఆదివారం జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు నేడు అనుసరిస్తున్న చర్యలకు పొంతన లేకుండ పోయిందని, హామీలను నెరవేర్చటంలో ఘోరంగా విఫలం చెందాయన్నారు. నల్ల ధనం నివారిస్తామని ఐదువందలు, వెయ్యి రుపాయాల నోట్లను రద్దు చేసి సామాన్యులకు ప్రధానిమంత్రి మోదీ ఆందోళన కలిగిస్తున్నారని, రెక్యాడితే డొక్కాడని పేదలు నేడు బ్యాంకుల్లో దాచుకున్న కొద్ది పాటి ధనం కోసం, చిల్లర చేయించుకునేందు పడుతున్న వెతలు వర్ణాణాతీతంగా ఉన్నాయన్నారు. కార్పోరేటర్ సంస్థలకు మోదీ ప్రభుత్వం పెద్ద పీటవేసి సామాన్యులకు వైకుంఠం చూపుతుందని సుదర్శన్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు, బడా భూస్వాములు, కార్పోరేటర్ సంస్థలకు ప్రభుత్వం అందించే సహకారం పూర్తిగా నిలపాలని, నల్లకుబేరల భరతం పట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కాదన్నారు. కాగా రాష్ట్రంలో కెసిఅర్ నిజాం నవాబును మరపించే విధంగా పాలన సాగిస్తున్నారని, ప్రజాభిప్రాయాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు కార్యకర్తలు సన్నద్ధులు కావాలని సుదర్శన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాధులశ్రీనివాస్, మహబూబాబాద్ మున్సిపాలీటి వైస్ చైర్మన్ సోమయ్య, ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మాచర్ల భారతి, సిపిఎం జిల్లా నాయకులు రాజన్న, యాకయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శాంత, సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, నాయకులు వెంకటేశ్వర్లు, ఈశ్వరలింగం, గోపాలపురం సర్పంచ్ బుజ్జి, ఎంపిటిసి పద్మ, గార్ల సొసైటి వైస్ చైర్మన్ ఇమ్మడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురిని బలిగొన్న ఇసుకలారీ
* పినపాక మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
పినపాక, నవంబర్ 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. పినపాక మండల పరిధిలోని గడ్డంపల్లికి చెందిన పడిగ వీరభద్రం(28), తాళ్లపల్లి సమ్మయ్య(30), వారి సమీప బంధువు సూర్యపేట జిల్లాకు చెందిన తొట్టపర్తికి చెందిన బండారు వీరాస్వామి పెద్దరాజుపేట గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై స్వగ్రామం పయనమయ్యారు. ద్విచక్రవాహనంపై వస్తుండగా వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం వైపు వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఏడూళ్లబయ్యారం సీఐ నర్సయ్య సంఘటనస్ధలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు.

ప్రజా ఉద్యమాలకు సన్నద్ధం కావాలి

* సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభల్లో నేతల పిలుపు
ఖమ్మం(జమ్మిబండ), నవంబర్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యితిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు సన్నద్ధం కావాలని సిపిఐ నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్థానిక రామకృష్ణ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ప్రారంభమైన ఖమ్మం జిల్లా నిర్మాణ మహాసభల్లో సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడటంలో కమ్యూనిస్టులదే అగ్రస్థానం అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మళిదశ ఉద్యమం వరకు సిపిఐ పాత్ర కీలకమైందన్నారు. అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తిరిగి గడీల పాలన ప్రారంభమైందని, దీనిని అడ్డుకునేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత సిపిఐ కార్యకర్తల మీదే ఉందన్నారు. ఈ సందర్భంగా హేమంతరావు గడిచిన ఏడాది కాలంలో పార్టీ చేపట్టిన ఉద్యమాలు, ఇతర పార్టీలతో కలిసి చేసిన ఆందోళనలు, ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్యం చేసిన విధానంపై ప్రత్యేక నివేదికను సమర్పించారు.
కాగా సభలకు హాజరైన పార్టీ శ్రేణుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. సమావేశానికి ముందు రాష్ట్ర నాయకులు పాకాలపాటి వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
నేడు జిల్లాల కార్యదర్శుల ఎన్నిక
ఇటీవల ఖమ్మం జిల్లా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో రెండు జిల్లాలకు జిల్లా కార్యదర్శుల ఎంపిక నేడు చేయనున్నారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సమక్షంలో జిల్లాల వారిగా సభ్యత్వం, ప్రతినిధుల విభజన, నూతన జిల్లా కౌన్సిళ్ళ ఏర్పాటు, నూతన జిల్లాల కౌన్సిల్ సమావేశాలు నిర్వసించనున్నారు. అలాగే కార్యదర్శివర్గం ఎన్నిక, కార్యదర్శి ఎన్నిక జరపనున్నారు.

ఈ లెర్నింగ్ ద్వారా
అపార విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
* ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 20: ఈ లెర్నింగ్ ద్వారా విద్యార్ధులు అపార విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఖమ్మం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రతి మనిషికి విజ్ఞానం చాలా అవసరమని సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు ఈ గ్రంథాలయాల్లో లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పోటీ పరిక్షలకు హజరయ్యే విద్యార్ధులు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్ధులు తమ సమయాన్ని వృదా చేయకుండా గ్రంథాలయాలలో పుస్తక పఠనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరిక్షలకు సన్నద్దమయ్యేందుకు విద్యార్ధిని, విద్యార్ధులు శాఖా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించటానికి అవసరమైన జనరల్ నాలెడ్జ్, సైన్స్ పుస్తకాలు నగరంలోని గ్రంథాలయాలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తన సిడిపి నిధుల నుండి నియోజక వర్గంలోని గ్రంథాలయాలలో అవసరమైన చోట నిధులు కేటాయిస్తానని తెలిపారు. అనంతతరం పోటీ పరిక్షలలో విజేతలకు బహమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి కె శ్రీనివాసరెడ్డి, జిల్లా పౌర సంబధాల అధికారి ఎం శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి వి రవికుమార్ పాల్గొన్నారు.

ఆంగ్ల భాషా బోధనలో
నేలకొండపల్లికి మొదటి స్థానం
నేలకొండపల్లి, నవంబర్ 20 : రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల భాష బోధన అమలు చేయటంలో నేలకొండపల్లి మండలం మొదటి స్థానం సాధించిందని ఎస్‌ఎస్‌ఏ పిడి భాస్కర్‌రావు వెల్లడించారు. సీతారామా ఫంక్షన్ హాల్ నందు జరిగిన బాలల సందడి కార్యక్రలో పాల్గొని మాట్లాడుతూ ఆంగ్లం ప్రభుత్వ పాఠశాలలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకటవ తరగతిలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాభబోధన చేయటం వల్ల ప్రయివేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని అన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల శాతం పెరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులచే పలు రకాలు ఆటల, పాటల పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈకార్యక్రమంలో మధుకాన్ షుగర్స్ హోల్ టైమ్ డైరక్టర్ మందలపు శ్రీనివాసరావు, రాష్ట్ర రీసోర్స్ గ్రూప్ సభ్యుడు మల్లిఖర్జున్‌రావు, రాష్ట్ర పరిశీలకుడు వెంకటరెడ్డి, డిఇఒ బస్వారావు, ఉపేందర్‌రెడ్డి, కిషన్‌రావు, కవితరాణి, గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, ఎంఈఒ పురుషోత్తరావు, అర్వపల్లి రామరావు తదితరులు పాల్గొన్నారు.
రేపు తుమ్మల గార్ల పర్యటన
గార్ల, నవంబర్ 20: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈనెల 22న నిర్వహిస్తున్న గార్ల పర్యటనను విజయవంతం చేయాలని టిఅర్‌ఎస్ మండల కమిటి అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆదివారం కోరారు. ఐదు కోట్ల రుపాయాలతో నిర్మించనున్న గార్ల సివిల్ ఆసుపత్రి నూతన భవనానికి, చలివాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన, మండలం పరిధిలోని పోచారంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఆరోజు మధ్యాహ్నాం 2గంటల నుంచి జరిగే ఈపర్యటనలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

డాక్టర్ కనకరాజుకు మాతృవియోగం
కొత్తగూడెం టౌన్, నవంబర్ 20: ప్రముఖ వైద్యుడు డాక్టర్ గడిపల్లి కనకరాజు తల్లి గడిపల్లి లక్ష్మి(72) ఆదివారం మృతిచెందారు. లక్ష్మి భౌతికకాయానికి ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, టిఆర్‌ఎస్ నాయకులు మచ్చా శ్రీనివాసరావు, కంచర్ల చంద్రశేఖరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, పరుచూరి కృష్ణ మోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ, ప్రముఖ వైద్యులు విజేందరరావు, రమేష్ బాబు, కోటేశ్వరారు, వర్థన్‌రావు తదితరులు పూలమాలలువేసి నివాళి అర్పించారు. లక్ష్మీ తనయులు డాక్టర్ కనకరాజు కొత్తగూడెంలో వైద్యుడిగా సేవలందిస్తుండగా రెండవ కుమారుడు విజయరాజు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఇండియన్ ఆయిల్ జనరల్ మేనేజర్‌గా విదులు నిర్వహిస్తుండగా మూడవకుమారుడు గడిపల్లి కృష్ణప్రసాద్ కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సిఎంఒఎ) అధ్యక్షుడిగా పనిచేస్తుండగా కృష్ణప్రసాద్ భార్య గడిపెల్లి కవిత ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఆకునూరి కనకరాజులు లక్ష్మీకి స్వయాన తమ్ముళ్ళు. లక్ష్మీ మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించి సానుభూతి తెలిపారు.