ఖమ్మం

డిసెంబర్‌లో భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 22: 60వేల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు ప్రాజెక్టును ఏడాది కాలంలోనే పూర్తి చేశామని, దీనిని వచ్చే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మంగళవారం కూసుమంచి మండలంలోని పాలేరులో నాలుగు లక్షల రూపాయలో నిర్మించిన ఈసేవ కేంద్రాన్ని, జుజుల్‌రావుపేట గ్రామంలో రెండు పడకగదుల గృహ నిర్మాణ పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుందన్నారు. వెనుకబడిన పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మంచినీరు, సాగునీటిని అందించేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించామన్నారు. కృష్ణానదిలో నీరు లేకపోయినా గోదావరి నది ద్వారా నీటిని ఈ ప్రాజెక్టుకు తరలించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిలువ నీడలేని నిరుపేదలందరికీ నివాస యోగ్యమైన ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా రెండు పడకగదుల గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5.50లక్షల ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లను మంజూరు చేసినట్టు, పాలేరు నియోజకవర్గాన్ని సుభిక్షంగా చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే పాలేరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. బలహీన వర్గాలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాలేరు నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు అత్యుత్తమ విద్యాకేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా బుజంగరెడ్డి చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన గోరీలపాడు తండాలో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. విద్యార్థులు ఆధునీకతను అందిపుచ్చుకొని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధునిక, సాంకేతికతను డిజిటల్ క్లాస్‌ల ద్వారా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

28 నుండి వరంగల్‌లో
సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు
* సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం
ఖమ్మం(జమ్మిబండ), నవంబర్ 22: సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఈ నెల 28నుండి 30వరకు మూడురోజుల పాటు వరంగల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. మంగళవారం మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా మహాసభలు విజయవంతంగా పూర్తిచేశామన్నారు. రాష్టస్థ్రాయిలో పార్టీ భవిష్యత్తుపై కార్యచరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు జాతీయ కార్యదర్శి డాక్టర్ కంకణాల నారాయణ హాజరు కానున్నట్లు తెలిపారు. 28,29 నిర్మాణ మహాసభల అనంతరం 30వ తేదీన బహిరంగ సభను హన్మకొండ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సభలలో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌తో పాటు అనేకమంది కళాకారులు పాల్గొని పలు నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగ్ నర్సింహరావు, ఎస్‌కె జానీమియా, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు ఏనుగు గాంధీ, గోవిందరావు, తెలంగాణ ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు దాసరి రాము తదితరులు పాల్గొన్నారు.