ఖమ్మం

విజయవంతంగా కమర్షియల్ ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 2: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండవ యూనిట్‌లో శుక్రవారం సాయంత్రం కమర్షియల్ ఆపరేషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో 12వందల మెగావాట్ల సింగరేణి థర్మల్‌విద్యుత్ కేంద్రంలో చివరి మైలురాయి కూడా విజయవంతమైంది. దీనిపై సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ హర్షాన్ని వ్యక్తంచేసారు. బంగారుతెలంగాణ నిర్మాణానికి సింగరేణినుండి 12వందల మెగావాట్ల విద్యుత్‌ను అందించడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్లాంట్ నిర్మాణం వేగంగా పూర్తికావడానికి, విద్యుత్ అందుబాటులోకి రావడానికి తమకు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు నడిపించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్టవ్రిద్యుత్ అవసరాలు తీర్చడంలో భాగం కావడమేకాకుండా ఇతరుల విద్యుత్‌తో పోల్చిచూస్తే తక్కువ ధరకే తాము విద్యుత్‌ను అందిస్తున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండవ యూనిట్‌లో 72 గంటల కమర్షియల్ ఆపరేషన్ ట్రైల్న్‌న్రు నవంబర్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5గంటలకు సింగరేణి, తెలంగాణ విద్యుత్‌సంస్థలకు చెందిన అధికారుల సమక్షంలో ప్రారంభించారు. 6వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈప్లాంటులో సిఓడి ప్రక్రియలో పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఇదేవిధంగా విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ కొనసాగడంతో కమర్షియల్ ఆపరేషన్ విజయవంతమైనట్లు ఇరుపక్షాలు ప్రకటించి డిక్లరేషన్ సంతకాలు చేసారు. కాగా మొదటి యూనిట్ సిఓడికి, రెండవ యూనిట్ సిఓడికి మధ్య రెండునెలల సమయం మాత్రమే పట్టడం రికార్డుగా పేర్కొనవచ్చు. ఈకార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (ఇఅండ్‌ఎం) పి రమేష్‌బాబు, ఇడి (ఎన్‌టిపిపి) సంజయ్‌సూర్, జిఎం (ఎన్‌టిపిపి) సుధాకర్‌రెడ్డి, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ జెఎన్ సింగ్, తెలంగాణ విద్యుత్ సంస్థలైన సదరన్ డిస్కంనుండి సిజిఎం (కమర్షియల్) కె సాయిబాబా, నార్తరన్ డిస్కంనుండి సిజిఎం (ఐపిసి అండ్ ఆర్‌ఎసి) టి మధుసూధన్, ట్రాన్స్‌కో డిఇ జి ఆంజనేయులు, డిఇ (విజిలెన్స్) ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈప్రక్రియ పూర్తికావడంతో అధికారికంగా సింగరేణి థర్మల్‌విద్యుత్ కేంద్రంనుండి ఒప్పందం మేరకు విద్యుత్ స్వీకారానికి టిఎస్ ట్రాన్స్‌కో ఆమోదించినట్లయింది.