ఖమ్మం

పనుల నిర్వహణ ఇలాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, డిసెంబర్ 2: మధిర రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులపై దక్షిణ మధ్య డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశిష్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర రైల్వే స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రైల్వే క్రాసింగ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మధిర 1వ నెంబరు, 2వ నెంబరు ప్లాట్‌ఫారాలపై పారిశుద్ధ్య పనులు ఎంత మంది చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిసి కెమెరాల నిర్వహణ సరిగా లేనందుకు 2000 పారిశుద్ధ్య పనులు చేపట్టనందుకు 4000 కాంట్రాక్టర్‌లకు జరిమానగా విధించారు. మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న క్వార్టర్‌లను పరిశీలించి మొత్తం ఎన్ని క్వార్టర్లు వున్నాయి, ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ రూమ్‌లోని రికార్డులను పరిశీలించి రికార్డుల నిర్వహణలోని లోపాలను గుర్తించి అధికారులపై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. డిఆర్‌యం వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అధికారులు స్టేషన్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతోపాటు త్రాగునీటి నల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు స్టేషన్ మాస్టర్ గది వద్ద వీల్ చైర్‌ను ఏర్పాటు చేయటం గమనార్హం. డిఆర్‌ఎం వెంట రైల్వే అధికారులు ఉన్నారు.