ఖమ్మం

వైభవంగా అయ్యప్పల ఇరుముడి కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, డిసెంబర్ 4: శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానానికి తరలివెళ్లే అయ్యప్ప మాలాధారులకు ఆదివారం స్థానిక లడక్‌బజార్‌లోని అయ్యప్ప స్వామి అలయం నందు అత్యంత వైభవంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్పమాల ధరించిన 41 రోజుల పాటు అత్యంత కఠిన దీక్షలు చేబూని ప్రతిరోజూ పూజలు నిర్వహించిన సుమారు 30 మంది అయ్యప్పలు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణఘోష చేస్తూ భక్తి పారవశ్యం నడము వైభవంగా యిరుముడి కార్యక్రమాన్ని కొనిసాగించారు. అనంతరం అయ్యప్ప మాలాధారులు అలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు స్వామి ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు విశాఖన్ నంబూద్రి గురుస్వామి ఇరుముడులు కట్టారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదములు అందజేశారు. ఈ సంవత్సరం శబరిమలైలోని అయ్యప్ప సన్నధానంతో పాటు ప్రత్యేకంగా తమిళనాడు,కేరళలలో పలు పుణ్యక్షేత్రాలను సందర్శించే విధంగా ఈ అయ్యప్ప స్వాములువారం రోజుల పాటు బస్సు యాత్ర ద్వారా బయిలుదేరారు. కార్యక్రమంలో స్వాములు చెరుపల్లి శ్రీ్ధర్, తాళ్ళారి అప్పారావు, అరిగె శ్రీవివాసరావు, వలిశెట్టి శ్రీనివాసరావు, బహటం శ్రీనివాసరాజు, దాసరి చక్రవర్తి, సంగు సైదుబాబు, జంగిలి సాంబ, సంగు కృష్ణ, అయ్యప్పలు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో...
సత్తుపల్లి: డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అయ్యప్ప మాలధారణ చేసి మండల దీక్ష పూర్తి చేసి ఆదివారం స్థానిక హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయంలో ఇరుముడులు కట్టుకొని శబరిమలై యాత్రకు బయల్దేరారు. 41 రోజుల పాటు కఠోర దీక్షలు చేసి దీక్ష పూర్తి అయిన అనంతరం తొమ్మిది మంది స్వాములతో కలిసి ఆయన ఇరుముడి కట్టుకున్నారు. గురుస్వాములు ఉప్పల ప్రవీణ్‌శాస్ర్తీ, రామడుగు ప్రసాదాచార్యులు, మెకానిక్ శ్రీనుస్వామిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఇరుముడి కట్టారు. స్వామియే శరణం అయ్యప్ప అనే భక్తుల శరణాల మద్య స్వాములు శబరిమలై బయల్దేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో గద్దె వాసు, ఇమ్మనేని కిరణ్, ఇమ్మనేని శ్రీనివాసరావు, గుత్తా నరేష్, కటకం శంకరశర్మ, పోలిశెట్టి శివకుమార్, మామిళ్లపల్లి హరిబాబులతో పాటు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

సభ్యత్వాన్ని తీసుకుని
పార్టీని బలోపేతం చేయాలి
* ఎమ్మెల్యే సండ్ర పిలుపు
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 4: తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని పార్టీని పటిష్ఠపరచాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఆదివారం నగరంలో 6వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి డివిజన్‌లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు వల్ల కార్యకర్తలకు ఉపయోగపడే లాభాలపై కూడ అవగాహన కల్పించాలన్నారు. తెలగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీని మరింత బలపరిచేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తెలుగుదేశం పార్టీనే ప్రత్యామ్నాయమని అన్నారు. కొంతమంది పార్టీని వీడినా కార్యకర్తలు అందరూ పార్టీ వెన్నంటి ఉన్నారని ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు పార్టీ సంక్షేమ నిధి ద్వారా సహయం అందిస్తామని, కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల లింగయ్య, అత్కూరి నరేష్, బుడిగి శ్రీను, పల్లపు గొవిందు, సుంకర అంజయ్య, పి భూపతి, చింత్రాల సత్యం, జిల్లా బిసిసెల్ అధ్యక్షుడు గొడ్డేటి మాధవరావు, కార్యదర్శి తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, గొల్లపూడి హరికృష్ణ, కెతినేని హరిష్ తదితరులు పాల్గొన్నారు.