ఖమ్మం

కవ్వింపులు...చొరబాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 4: పిఎల్‌జిఏ వారోత్సవాలు మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. భద్రతా బలగాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చొరబాట్ల ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్, ఏఓబిల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో భారీగా నష్టపోయిన మావోయిస్టులు తమ శ్రేణుల్లో, దళాల్లో ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపేందుకు ఆంధ్రా-తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్నారు. ఈ క్రమంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కరపత్రాలు, బ్యానర్లు పెట్టి వాటి కింది ప్రెషర్‌బాంబులను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ,్ఛత్తీస్‌గఢ్‌ల్లో వరుసగా మూడు రోజుల పాటు ఇలా చేయడంతో పౌరులు, జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఆదివారం కూడా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా ఛోటేబేఠియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెచాఘాట్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని మందుపాతరను పేల్చారు. ఈఘటనలో జవాన్లు తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
బస్సుల అడ్డగింత...
ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు శబరి-చర్ల ఏరియా కమిటీలు సంయుక్తగా బస్సులను అడ్డగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రాలో విలీనమైన చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి-చింతూరు మార్గంలో రాత్రి వేళలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, బ్యానర్లు వదిలారు. దారిపొడవునా ప్రెషర్‌బాంబులు పెట్టడంతో బయటకు వెళ్లాలంటేనే భయం భయంగా ఉంటోందని సరిహద్దు గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు మావోయిస్టులు తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఆపరేషన్ గ్రీన్‌హంట్ ద్వారా ప్రజా యుద్దాన్ని అణిచివేసేందుకు మిలటరీని దించాయని, గగనతలం ద్వారా దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నారు. యువతీ,యువకులు మావోయిస్టు పార్టీకి అండగా నిలవాలని, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలువరించాలని పిలుపునిస్తున్నారు. అయితే పిఎల్‌జిఏ వారోత్సవాల వేళ పోలీసులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వారి కవ్వింపులకు ఏ మాత్రం బుట్టలో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సమన్వయం...సంయమనం
ఆంధ్రా-తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దు కేంద్రమైన దండకారణ్యంలో మావోయిస్టుల ఎత్తుగడలకు విరుగుడు వ్యూహాలను రచిస్తూ పోలీసు బలగాలు ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టులు ఎన్ని కవ్వింపులకు పాల్పడినా కూడా సంయమనం పాటిస్తూ సరిహద్దు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమన్వయంతో సమాచార మార్పిడి చేసుకుంటూ వారి చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. కూంబింగ్ బలగాల ద్వారా డామినేషన్ చేస్తూ, నిఘా వర్గాల ద్వారా వారి గుట్టును రట్టు చేస్తూ పిఎల్‌జిఏ వారోత్సవాలను అడ్డుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఆర్టీసీ సర్వీసులను మారుమూల ప్రాంతాలకు పంపని అధికారులు పగటి వేళల్లోనే వాటిని భద్రత నడుమ నడుపుతున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.
ముప్పేటగా ఒత్తిడి
భద్రతా బలగాలు సైతం మావోయిస్టుల కవ్వింపులకు విరుగుడుగా ముప్పేటా దాడులకు దిగుతున్నారు. అంబుష్‌లు ఏర్పాటు చేసి మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతంలో కట్టడి చేస్తున్నారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సిఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో ఆకస్మింగా వాహనాలతో పాటుగా ఆర్టీసీ బస్టాండ్లు, లాడ్జీల్లో తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘాను పెంచి పడవల ద్వారా దాటుతున్న వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మావోయిస్టు యాక్షన్ టీంలు తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా షాడో టీంలను రంగంలోకి దించారు. గతానికి భిన్నంగా పిఎల్‌జిఏ వారోత్సవాలను నిలువరిస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టుల ఆధిపత్యానికి బ్రేక్ వేయాలనే లక్ష్యంతో పోలీసు బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. దీంతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో యుద్దవాతావరణం నెలకొంది. బూట్ల చప్పుళ్లతో అడవి దద్దరిల్లుతోంది.