ఖమ్మం

క్యూలలో బడాబాబులేరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేశాక నిత్యం బ్యాంకుల్లో రద్దీ, ఎటిఎంల వద్ద బారులు, సామాన్య, మధ్య తరగతి చిల్లర కష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమంగా వెనుకేసుకున్న బడాబాబులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో భయపడి వారు నల్లధనాన్ని వదులుకుంటున్నారా, దొడ్డిదారిన దర్జాగా మార్చుకుంటున్నారా అన్న ప్రశ్న జోరుగా సాగుతోంది. జిల్లాలో నేటికి పాతనోట్లు కానీ, కొత్తనోట్లు కానీ భారీ స్థాయిలో పట్టుబడిన దాఖలాలు లేవు. పోలీసుల విస్తృత తనిఖీలు, ఆదాయపు పన్నుశాఖ దాడులు లేనేలేవు. చాలా బ్యాంకుల ఏటిఎంలు ఇప్పటి వరకు తెరుచుకోనూ లేదు. బ్యాంక్ సిబ్బందే కొందరు నల్లధనాన్ని మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా స్పందించిన వారు లేరు. ఆయా బ్యాంకులకు వచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఏ ఖాతాలో ఎంత డబ్బులు జమ చేశారో వివరాలు ఇవ్వాలని ఐటిశాఖ వివరాలు కోరినా బ్యాంకర్లు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దనోట్లు రద్దయి నెలరోజులు కావస్తున్నప్పటికీ మార్పు కానరావడం లేదు. ఆర్‌బిఐ ఆంక్షలతో తల్లడిల్లుతున్న సాధారణ జనానికి బ్యాంకర్లు సైతం పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. రద్దయిన పెద్దనోట్లు బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉండటంతో నల్ల కుబేరులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయా బ్యాంక్ ఖాతాల వివరాలు విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నేటికి బ్యాంకుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బ్యాంక్ అధికారులు, దళారులు కమిషన్ పద్ధతిలో పాత డబ్బులను మార్చి కొత్త డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. సహకార బ్యాంకుల్లో పాతనోట్లు తీసుకోకపోవడంతో అక్కడ అకౌంట్లు ఉన్న వారంతా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి తమ దగ్గర ఉన్న నగదును మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం, భద్రాచలం జిల్లాల పరిధిలోని ఉద్యోగులు, వ్యాపార వర్గాల లావాదేవీలపై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే ప్రత్యేకమైన జాబితాను తయారు చేశారు. మరోవైపు పోలీస్, ఆదాయపన్ను శాఖాధికారులు కొన్ని బ్యాంకుల సహకారంతో పెద్ద ఖాతాదారుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక మొత్తం డిపాజిట్‌గా ఉన్న వారందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే జన్‌ధన్ ఖాతాలో యాబైవేల కంటే ఎక్కువ ఉంటే నోటీసు ఇస్తున్నారు. దీంతో బడాబాబులు ఇప్పటి వరకు తమ డబ్బులు మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను విరమించుకొని కమిషన్ పద్దతిలో వాటిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా దీనికి కొందరు బ్యాంక్ సిబ్బందే సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంబేద్కర్ ఆశయాలే ఆదర్శం
* 60వ వర్ధంతి కార్యక్రమాల్లో ఘన నివాళులు
ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌కు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఆయన 60వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్‌ఎస్‌లు తమ పార్టీ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బేగ్, నాయకులు నల్లమల, మురళీ, రమేష్, కాంగ్రెస్ నాయకులు కొత్తా సీతారాములు, ఫజల్, సిపిఎం జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, నున్నా, సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు, పోటు ప్రసాద్, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరు బ్రహ్మయ్య, నాయకులు జీవన్, స్వర్ణకుమారి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్, నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్ తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఖమ్మం టిటిడిసి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అలాగే టిఎన్జీఓస్, కెవిపిఎస్, నంగారాభేరి, బిసి సంక్షేమసంఘం, దళిత, యువజన సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే భారతదేశాన్ని ప్రపంచంలో నిలబెట్టిందన్నారు. నాడు ఆయన రూపొందించిన విధానాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శి అని, ఆయన చూపిన విధానాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.