ఖమ్మం

మద్యం మత్తులో ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, డిసెంబర్ 25: రెండేళ్ళ క్రితం భార్య చనిపోయింది. కూలీ పనే ఆధారం. మద్యానికి బానిసై బతుకు సాగిస్తున్న బి రామ్మోహన్‌రావు(54) మద్యం మత్తులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పరిధిలోని సుభాష్‌నగర్ ఏరియాలో నివాసముంటున్న రామ్మోహన్‌రావు నెలలో పదిరోజుల పాటు కూలీపని చేస్తుంటాడు. వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తున్నాడు. భార్య లేకపోవడం, తన ఆలన పాలన చూసేవారు లేకపోవడం వలన అతిగా మద్యం సేవిస్తూ మనోవేదన పడేవారు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తితో అతిగా మద్యం సేవించి అదే మత్తులో పొలిమేరలో ఉన్న రాజీవ్‌గృహకల్ప ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రిజర్వాయర్‌లోపడి మత్స్యకార్మికుడి మృతి
వైరా, డిసెంబర్ 25: రిజర్వాయర్‌లో కాలుజారి పడి మత్స్యకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రిజర్వాయర్‌కు కాపాలకాస్తున్న అంబర్లపుడి శాంతయ్య (48) ప్రమాదవశాత్తు కాలుజారి రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. మృతుడు ఎంతో నమ్మకంగా కొన్ని సంవత్సరాలుగా రిజర్వాయర్‌కు కాపలకాస్తున్నాడు. మృతుడు స్థానిక బ్రహ్మణపల్లిలో అంతర్భాగమైన మత్స్యవాడకు చెందిన వాసి. మత్స్యకార్మికులు రిజర్వాయర్ వద్దకు భారీగా చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌లో బయోమెట్రిక్ విధానం
నేలకొండపల్లి, డిసెంబర్ 25 : నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ నందు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంను ఎస్‌ఐ సుమన్ ప్రారంభించారు. ఆదివారం ఖమ్మం డివిజన్ పరిధిలో ఈ బయోమెట్రిక్ విధానంను నూతనంగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ఈ బయోమెట్రిక్ విధానంను ఎస్‌ఐ సుమన్ ప్రారంభించి మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం వల్ల పోలీస్‌ల పనితీరు అర్ధం అవుతుందన్నారు. ఈ బయోమెట్రిక్ విధానం జిల్లా అధికారులకు అనుసతదానం చేసి ఉంటుందన్నారు. ఈ బయోమెట్రిక్ విధానం ద్వార వేసిన అటెండెన్స్‌ను జిల్లా అధికారులు పరిశీలిస్తారన్నారు. ప్రతి పోలీస్ ఇకపై బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్‌ను వేయాలన్నారు. పోలీసుల సమయపాలన అర్ధం అవుతుందన్నారు. స్టేషన్‌కు వచ్చేముందు పోయే ముందు బయోమెట్రిక్ ద్వార వేలు ముద్రలు వేయాలనన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు నర్సింహరావు, రమేష్, శ్రీశైలం పాల్గొన్నారు.

వాడవాడలా క్రిస్మస్ వేడుకలు
వైరా, డిసెంబర్ 25: ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్రిస్మస్ పండుగను వాడవాడలా క్రైస్తవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం క్రిస్మస్‌ను పురస్కరించుకొని మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న చర్చిలన్నింటిని అలకంరించారు. వారం రోజుల ముందుగానే ప్రారంభమైన సెమిక్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రైస్తవ సోదరులు ఈసందర్భంగా వివిధ గ్రామాలలో ఆటల పోటీలు నిర్వహించారు. పండుగరోజు ఆయా ఆటలలో గెలుపొందిన వారికి బహుమతలు అందించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవసోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జీసస్ జన్మించిన రోజును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే ఈక్రిస్మస్ ప్రాధన్యతను ఆయా చర్చిలలో జీసస్ జీవితవిశేషాలను ఫాదర్‌లు వివరించారు. జీసస్ ఈమానవాళికి ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పకుండా ప్రతిమానవుడు పాటిస్తే మానవజన్మ సార్థకమవుతుందని అన్నారు. అనంతరం చర్చిలలో బైబిల్ పఠనం జరిగింది. క్రైస్తవసోదరులు ప్రార్థన అనంతరం జీసస్ జీవిత విశేషాలతో కూడిన పాటలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.