ఖమ్మం

భక్త రామదాసు ప్రాజెక్టు పనులు గడువు లోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 27: జిల్లాలో చేపడుతున్న భక్త రామదాసు ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో భక్తరామదాసు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భక్త రామదాసు ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. అదే విధంగా శ్రీరాంసాగర్ డిబిఎం 60 బ్యాలెన్స్ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఖమ్మం-కోదాడ, ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణ సర్వే ప్రక్రియను ప్రారంభించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ధంసలాపురం వద్ద నిర్మించనున్న ఆర్‌ఓబి భూ సేకరణకు సంబంధించిన సర్వే పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్‌ఆర్‌ఎస్‌పి ఇఇ శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము పాల్గొన్నారు.
డంపింగ్ యార్డులో అధునాతన
పద్ధతులు అవలంబించాలి
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 27: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డంపింగ్ యార్డులో అధునాతన పద్ధతులు అవలంబించి వ్యర్థాలతో కంపోస్ట్ ఏరువులు తయారుచేయాలని నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అన్నారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో అధికారులు, కార్పొరేటర్లతో డంపింగ్ యార్డుపై సమీక్షించారు. నగరంలో నిత్యం సేకరిస్తున్న వ్యర్థాలను పొడి, తడి చెత్తగా వేరుచేసి వాటిని సేంద్రీయ ఎరువులుగా తయారుచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డంపింగ్ యార్డులో సంభవించిన మంటలను రెండు జెసిబిలు, రెండు ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్, దాదాపు 50 మంది వర్కర్ల సాయంతో అదుపులోకి తెచ్చామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తడి, పొడి చెత్త సేకరణ, నిరంతర వార్మికంపోస్ట్ ఎరువుల తయారీ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో తగినన్ని షెడ్లు ఉన్నా నిర్వహణ లేక ఎక్కడికక్కడ చెత్తను కుప్పలుగా పోయడం వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జెసిబిలతో రోడ్లను శుభ్రం చేసి చెత్త వాహనాలు షెడ్ల వరకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ బి శ్రీనివాస్, ఎఇ రంగారావు, మేనేజర్ రాజారం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.