ఖమ్మం

చట్టాలను నిర్వీర్యం చేస్తున్న పాలకులను ప్రతిఘటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, డిసెంబర్ 26: కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్న పాలకులపై ప్రతిఘటించాలని సిపిఐ పాలేరు డివిజన్ కార్యదర్శి దండి సురేష్ పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టులు కార్మిక వర్గాన్ని సంఘటిత పరచి అనేక ఆందోళనలు నిర్వహించిన ఫలితంగానే కార్మికులకు అవసరమైన చట్టాలు వచ్చాయన్నారు. కార్మికుల హక్కులు కాపాడుకోవాలంటే సమస్యలపై ఉద్యమించాలన్నారు. దునే్నవాడికే భూమి కావాలని, వెట్టి చాకిరీని నిర్మూలించాలని, భూస్వామి వ్యవస్థ పతనం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు వచ్చే విధంగా పోరాడిన ఘనత కమ్యూనిస్టులదేనని ఆయన గుర్తు చేశారు. ఈ పోరాటంలో సుమారు నాలుగువేల మంది పోరాట యోధులు బలిదానం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏదులాపురం గ్రామానికి చెందిన జూశెట్టి నవక్రాంత్, జూశెట్టి వెంకటేశ్వర్లు దండి సురేష్, మిడకంటి వెంకటరెడ్డిల సమక్షంలో సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీలో చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు మిడకంటి చిన వెంకటరెడ్డి, శాఖ కార్యదర్శి వెంపటి సురేందర్, గణపారపు వీరన్న, వెంపటి శ్రీను, యేబు, రాయల అప్పయ్య, సుదర్శన్‌రెడ్డి, వెన్నం భాస్కర్, క్రిష్ణమూర్తి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బౌద్ధస్థూపాన్ని సందర్శించిన ఎన్నికల ప్రత్యేక అధికారి
నేలకొండపల్లి, డిసెంబర్ 26: దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన బౌద్ధస్థూపాన్ని శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీవాస్తవ సందర్శించారు. నేలకొండపల్లిలోని బౌద్ధస్థూపం చూట్టూ పరిశీలించి చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌వో వెంకటేశ్వరరావు, కారేపల్లి ఎంఆర్‌వో మంగీలాల్, ఖమ్మం రూరల్ ఎస్‌ఐ గోపి, నేలకొండపల్లి ఎస్‌ఐ దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు సర్వం సిద్ధం

ఖానాపురం హవేలి, డిసెంబర్ 26: ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం బ్యాలెట్ పేపర్లను పరిశీలించి ఆయా డివిజన్ కేంద్రాల్లో పో లింగ్ కేంద్రాల్లో నియమించిన సిబ్బందికి అందించారు. ఎన్నికల సిబ్బందికి ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చి వారిని ఎన్నికల సామాగ్రితో సహా ప్రత్యేక వాహనాల్లో పోలీస్ ఎస్కార్ట్‌తో పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ నుంచి కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వాటిని తరలించారు. నాలుగు పోలింగ్ కేంద్రాల్లోనూ తహశీల్దార్లు ఎన్నికల అధికారిగానూ, డిప్యూటీ తహశీల్దార్లు ఉప ఎన్నికల అధికారులుగా, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు ఎన్నికల సిబ్బందిగా పని చేయనున్నారు. కాగా బ్యాంక్ అధికారులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించారు. పోలింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ విధించటమే కాకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో 17మంది జడ్పీటిసిలు, 268మంది ఎంపిటిసిలు, 39 మంది వార్డు సభ్యులు, మధిర, సత్తుపల్లి ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయా శిబిరాల్లో ఉన్న తమ మద్దతుదారులను అభ్యర్థులు నేరుగా పోలింగ్ బూత్‌లకే తీసుకురానున్న నేపథ్యంలో అందరు ఒకేసారి వస్తే వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు గాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెంలలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌కు నివేదించినప్పటికీ అనుమతి రాలేదు.

ఐటీడీఏ పీవో ఆకస్మిక పర్యటన

వెంకటాపురం, డిసెంబర్ 26: ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు శనివారం వెంకటాపురం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ముందస్తు సమాచారం లేకుండా రావడంతో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో అనేక అవకతవకలు, లోపాలతో పట్టుబడ్డారు. స్థానిక చిరుతపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 219 మంది విద్యార్థులకు 119 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు 16 మందికి ముగ్గురే విధుల్లో ఉండటాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే సెలవుల కారణంగా ఇళ్లకు వెళ్లిపోయారని హెచ్‌ఎం సరస్వతి పీవోకు వివరించారు. విద్యార్థులకు అందే మెనూ, పాఠ్యాంశాలను స్వయంగా అడిగి తెలుసుకుని బ్లాక్ బోర్డుపై అనేక లెక్కలను, పాఠ్యాంశాలను రాసి విద్యార్థుల నుంచి జవాబులు రాబట్టారు. అనంతరం స్థానిక గిరిజన బాలుర హాస్టల్‌ను తనిఖీ చేశారు. 60 మంది విద్యార్థులకు గాను 16 మంది విద్యార్థులు మాత్రమే హాస్టల్‌లో ఉన్నారు. మిగతా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని సహచర విద్యార్థులు పీవో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే రిజిస్టర్‌లో కూడా హాస్టల్‌లో లేని విద్యార్థులకు అటెండెన్స్ వేస్తున్నారని, రికార్డులను పీవో స్వాధీనం చేసుకున్నారు. వార్డెన్ హాస్టల్‌లో లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. డిగ్రీ చదివే ఒక విద్యార్థి తాను తిరిగి హాస్టల్‌కు వచ్చే వరకు విద్యార్థులను చూసుకోవాలని చెప్పారని చెప్పారు. రికార్డులను స్వాధీనం చేసుకుని ఏటీడబ్య్లూవో ద్వారా విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

భార్యపై దాడి చేసిన ఘటనలో భర్తపై కేసు నమోదు
బూర్గంపాడు, డిసెంబర్ 26: సారపాకలో ఈనెల 19న భార్యపై దాడి చేసిన ఘటనలో శనివారం బూర్గంపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. సారపాకకు చెందిన జి.మోహన్‌రావు ఐటీసీ పీఎస్‌పీడీవో కార్మికునిగా పని చేస్తున్నాడు. ఇటీవల భార్య రమాదేవిపై అనుమానంతో తరుచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 19న ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. సహనం కోల్పోయిన మోహన్‌రావు కర్రతో భార్యను తీవ్రంగా కొట్టాడు. రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు.