ఖమ్మం

సింగరేణి కార్మికులకు త్వరలో వారసత్వ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 1: సింగరేణి కార్మికుల చిరకాల కోరికైన వారసత్వ ఉద్యోగాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాలకోసం దరఖాస్తులు స్వీకరించేందుకు స్వీకారం చుట్టింది. సింగరేణి కార్మికులు వారసులను అదేకంపెనీలో ఉద్యోగాలు ఇప్పించుకునే సాంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఉన్న సింగరేణి కార్మికుల వారసుల ఉద్యోగాలకు దరఖాస్తులను జనవరి 1వ తేదీనుండి స్వీకరించాలని నిర్ణయించినప్పటికి 1వతేది ఆదివారం కావడంతో సోమవారం నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు కార్మికులు సన్నద్ధమవుతున్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభమైతే రానున్న 10సంవత్సరాల్లో సింగరేణి 30వేలమంది వారసులకు ఉద్యోగాలు లభిస్తాయి. జనవరి 1వ తేదీనుంచి మార్చ్ 31వ తేదీవరకు వారసత్వ ఉద్యోగాలకోరకు దరఖాస్తులు చేసుకునే అవకాశముంది. ఈ ఏడాది సింగరేణిలో 3వేలమంది కార్మికులు పదవీవిరమణ చేయనున్న నేపధ్యంలో వారి వారసులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించడంతో కార్మికులు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాల్లో కుమారులతోపాటు అల్లుడుకి, తమ్ముడికి అవకాశం ఇవ్వడంతో కూతుళ్లు తమ భర్తలకు అవకాశం ఇవ్వాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఏది ఏమైన సింగరేణిలో గత 20సంవత్సరాల క్రితం రద్దయిన వారసత్వ ఉద్యోగాలు నూతన సంవత్సరంనుండి ప్రారంభమవుతుండటంతో సింగరేణి కార్మికుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఖమ్మం(ఖిల్లా), జనవరి 1: నూతన సంవత్సరం 2017 వేడుకలను నగరంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సెలవుదినం అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి నూతన సంవత్సర కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసీం నూతన సంవత్సరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మాట్లాడుకున్నారు. ఉద్యోగులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. నగరంలో ఉన్న పలు వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో 2017 సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొప్పు నరేష్‌కుమార్ కేక్ కట్ చేసి తోటి వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం నాటి సమస్యలు పునారావృతం కాకుండా నూతన సంవత్సరంలో వ్యాపార రంగం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా వ్యాపారాభివృద్ధి కూడా అదే విధంగా జరగాలని ఆకాంక్షించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆయా శాఖల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని అభినందించుకున్నారు. నూతన సంవత్సరం-2017ను పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మేయర్ పాపాలాల్‌తో కలసి కేక్ కట్ చేసి నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. మరింత అభివృద్ధిని సాధించి, స్వచ్ఛతలో మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటి మేయర్ బత్తుల మురళీ, కమిషనర్ బొనగిరి శ్రీనివాస్, ఎఎంసి చైర్మన్ జి కృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో యువతీ, యువకులు, చిన్నారులు గ్రీటింగ్‌లు పంచుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మతాలకు అతీతంగా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకుని నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్లయాలపై చర్చించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని అన్ని దేవలాయాల్లో విశిష్ట పూజలు చేశారు. మసీదు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రానున్న రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.