ఖమ్మం

పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వణికిపోతున్న జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 2: భద్రాచలం మన్యంలో చలి వణికిస్తోంది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఉత్తర, వాయువ్య దిశ నుంచి పొడి గాలులు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు సగానికి సగం పడిపోవడంతో ప్రజానీకం అవస్థలు పడుతున్నారు. పగటిపూట 28 డిగ్రీల నుంచి 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత కనీసం 10 డిగ్రీలకు మించడం లేదు. మన్యంలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాయంత్రం ఆరు గంటల నుంచే చలి పంజా విసురుతోంది. చలితో పాటు మంచు తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు అడుగు పెట్టడం లేదు. ఉదయం 9 గంటల వరకు మంచు తీవ్రత ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతతో అడుగడుగునా బోగిమంటలను తలపించేలా మంటలు వేసుకుంటూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

నోట్ల రద్దుపై దేశవ్యాప్త ఆందోళనలు

ఖమ్మం, జనవరి 2: నోట్లరద్దు భారీ కుంభకోణమని, ప్రధాని అనాలోచిత నిర్ణయం పెద్దనోట్ల రద్దుతో యావత్ భారతదేశం సంక్షోభంలో పడిందని ఎఐసిసి పరిశీలకుడు విష్ణునాధ్, టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే నరేంద్రమోడి ఏకపక్ష నిర్ణయంతో పెద్దనోట్లను రద్దు చేశారని ఆరోపించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని, సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు.
నోట్ల రద్దుతో ఎంత నల్లధనాన్ని బయటికి తీశారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా నోట్లరద్దు ప్రక్రియను ప్రధాని చేపట్టారని విమర్శించారు. 50 రోజుల్లో నల్లధనాన్ని నల్లధనాన్ని బయటకు తీస్తానని చెప్పిన మోడి 115 మంది అమాయక ప్రజలను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్లరద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు రోజువారి కూలీలు గత 60 రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మోడి చోద్యం చూస్తున్నారన్నారు.
నోట్ల మార్పిడిపై రోజుకొక ప్రకటన చేస్తూ దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నోట్లరద్దు ప్రక్రియలో స్పష్టత లోపించడం తగుప్రణాళికలు లేకపోవడంతో రిజర్వ్‌బ్యాంక్ 50 రోజుల్లో 126సార్లు రూల్సు మార్చిందన్నారు. నరేంద్రమోడి బిజెపి పాలిత రాష్ట్రాలు తన అనునాయులకు నోట్లరద్దు విషయం ముందే వెల్లడించి డబ్బు కూడకట్టుకున్నారన్నారు. నోట్ల రద్దుకు ముందు రోజున బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు భాగస్వామ్య పక్షాలు బ్యాంక్‌ల్లో జమచేసిన డబ్బులు చూస్తుంటే ప్రధాని పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని తెలుస్తోందన్నారు. నోట్లరద్దుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఈ నెల 7న ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో జిల్లా ఇంచార్జి శ్రీ్ధర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు వనమా వెంకటేశ్వరరావు, చరణ్‌రెడ్డి, తిలక్, ఆజ్మతుల్లా, బండి మణి తదితరులు పాల్గొన్నారు.