ఖమ్మం

నోట్ల రద్దుపై మోడీ వైఖరిని ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జనవరి 2: కార్పొరేట్ సంస్థల లాభం కోసమే నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దుచేసి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, మోడీ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్లరద్దు దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరలేనివన్నారు. నోట్లరద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైందని, 50రోజులలో సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన మోడీ చేసిందేమి లేదన్నారు. దేశంలో ఉన్న నల్లడబ్బును బయటకి తీస్తానని గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ నోట్లను రద్దుచేసి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. రైతాంగం, కార్మికవర్గాలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, సామాన్యుడు జీవనం సాగించేందుకు కూలిపని కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతలా మోడీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్దమన్నారు. పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీ చెప్పింది ఏది వాస్తవం కాదని, సమస్యను పరిష్కరించడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. నల్లధనం ఎక్కడ ఉందో ఎంత రాబట్టారో ఇప్పటికీ స్పష్టత లేదని, కార్పొరేట్ సంస్థల మేలు కోసమే నోట్లను రద్దు చేశారన్నారు. వ్యతిరేకించిన వారంతా దేశ ద్రోహలంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య వ్యాపారుల నుండి వ్యాపారాన్ని మాల్స్ మాఫియా చేతుల్లో పెట్టాడన్నారు. కార్పొరేట్ సంస్థలకు వ్యాపార రంగాన్ని అప్పజెప్పే పెద్దకుట్ర జరిగిందని, వాస్తవాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఖమ్మం ఇంచార్జ్ శ్రీ్ధర్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, నాయకులు వనమా వెంకటేశ్వరరావు, చరణ్‌రెడ్డి, తిలక్, మహిళా జిల్లా అధ్యక్షురాలు బండి మణి, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

13 వేల కోట్ల రూపాయల వ్యయంతో
సాగు, మంచినీటి సదుపాయాలు

కొత్తగూడెం, జనవరి 2: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీరు, తాగునీరు కోసం 13వేల కోట్లరూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తిశిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో సీతారామ ప్రాజెక్ట్ భూసర్వేపై జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 3.50లక్షల ఎకరాలతోపాటు అధనంగా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బృహుత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి రూ 7,926.147కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. సీతారామ ప్రాజెక్టుపై నాలుగు రిజర్వాయర్‌లు నిర్మిస్తున్నమని తెలిపారు. రోళ్లపాడువరకు సర్వే పూర్తిచేసి టెండర్లు పిలవడం జరిగిందని భూసేకరణ ఎంత త్వరగాచేస్తే ప్రాజెక్టుపనులు అంత త్వరగా పూర్తవుతాయని అన్నారు. భూసర్వే కోసం రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేయడంవల్ల అన్నిరకాల అనుమతులు మంజూరయ్యే అవకాశాలున్నాయని అన్నారు. ప్రధాన కాలువలకు మాత్రమే భూసర్వేలు జరుగుతున్నాయని, సాగు పంపిణీ వ్యవస్థపై చేపట్టే భూసర్వేలో అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ప్రాజెక్టుపనులు వేగవంతం చేసేందుకు అధికారులు సమగ్ర నివేదికను రూపొందించుకోవాలని అన్నారు. రెండు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయి నెలవతున్నా పనులు మొదలుపెట్టకపోవడం ఎలా అని ప్రశ్నించారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ వివరణిస్తూ ఏజెన్సీ ఏరియాల్లో 734 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇటువంటి వివాధాలు తెలత్తకుండా కృషి చేస్తున్నామని మంత్రికి వివరించారు. దీంతో మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు సంబంధించిన ఇబ్బందులుంటే తమకు సమాచారం అందిస్తే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు సంబంధించిన వివరాలను ప్రజాప్రతినిధులందరికి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు కార్యాలయం ఖమ్మం జిల్లాలో ఉండటంవల్ల సమీక్ష నిర్వహించడం ఇబ్బందికరంగా ఉందని వివరించారు. ఈసమావేశంలో మహబూబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాంనాయక్, ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, ఆశ్వారావుపేట, వైరా శాసన సభ్యులు జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, మధన్‌లాల్, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, డిఎఫ్‌ఓ గర్వసంద్ , సీతారాం ప్రాజెక్టు ఇఎన్‌సి నాగేశ్వరరావు, జడ్పీ వైస్‌చైర్మన్ బరపటి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.