ఖమ్మం

రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 3: రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి మహిళపై అత్యచారం జరిగింది. 1టౌన్ పోలీసుల కథనం ప్రకారం పాల్వంచ పట్టణ సమీపంలో వెంగళరావు కాలనీకి చెందిన (55) సంవత్సరాల మహిళ సికింద్రాబాద్ వెళ్ళేందుకు కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు వచ్చింది. సికింద్రాబాద్ వెళ్ళే రైలు కోసం వేచిచూస్తూ బహిర్భూమికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి ఆ మహిళ పై అత్యచారం చేసి పరారయ్యాడు. మహిళ ఫిర్యాదుతో జి ఆర్‌పి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి 1టౌన్ పోలీసులకు కేసును బదిలీ చేశారు. మహిళను వైద్యచికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1టౌన్ ఇన్‌చార్జ్ సిఐ శ్రీనివాసరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఖేల్ ఇండియా క్రీడాకారుల ఎంపిక
ఎర్రుపాలెం, జనవరి 3: ఈ నెల 5న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి ఖేల్ ఇండియా క్రీడల్లో పాల్గొనేందుకు మంగళవారం ఎర్రుపాలెం మండల క్రీడాకారులను ఎండిఓ విజయ ఎంపిక చేశారు. ఈ క్రీడల్లో అండర్-14 విభాగంలో ఖోఖో, వాలీబాల్ విభాగాల్లో బాల, బాలికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మండలంలోని ఎనిమిది గ్రామాల నుండి క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ మురళీమోహన్‌రావు, పిఇటి శ్రీహరి, జమలయ్య, సాంబిరెడ్డి, దుర్గాదేవి, రమేష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఫ్లెక్సీల వాడకంపై ఐదువేల జరిమానా
ఖమ్మం(ఖిల్లా), జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుండి నిషేదించిన బ్యానర్ల తొలగింపును నగరంలో పటిష్టంగా అమలు చేస్తున్నారు. దీనిపై నగరంలో మైకుల ద్వారా, పేపర్ ప్రకటనలు, ర్యాలీల ద్వారా ప్రజలకు, వ్యాపార వర్గాలకు వివిధ రూపాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం మున్సిపల్ అధికారులు నగరంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి షాపుల ముందు అమర్చిన ఫ్లెక్సీలను తీసివేయించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వైరారోడ్డులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన రిలయన్స్ ట్రెండ్స్ యాజమాన్యానికి ఐదువేల రూపాయలను జరిమానాగా విదించారు. ఈ కార్యక్రమంలో ఎసిబి రామచందర్, టిపిఓ ప్రకాష్‌రెడ్డి, టిపిఎస్ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.