ఖమ్మం

ఖమ్మంపై ‘ఐ’టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 3: ఖమ్మం జిల్లాలో నిత్యం కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. అనేక మంది బడా కాంట్రాక్టర్లు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రానైట్, సింగరేణి, నవభారత్, కెటిపిఎస్, బిపిఎల్‌లలో ఎంతోమంది కాంట్రాక్టర్లు నిత్యం తమ లావాదేవీ జరిపేవారు. వీరికి తోడు ఖమ్మం, కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో పెద్దపెద్ద దుకాణ సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దుతో వీరంతా ఇబ్బంది పడతారని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తమ వద్ద నగదు ఉన్నట్లుగా వెల్లడించలేదు. అదే సమయంలో ఎవ్వరూ డబ్బుల కోసం ఇబ్బందులు పడ్డ దాఖలాలు కూడా లేవు. వీరంతా తమ వద్ద ఉన్న నగదును ఇతర రూపాల్లో మార్చుకున్నారా, బ్యాంక్ ఉద్యోగులతో కుమ్మక్కై తమ నగదును కొత్త నగదుగా మార్చుకున్నారా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి ఆదాయ పన్ను శాఖాధికారులు కూడా రంగంలోకి దిగారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కొందరు వ్యాపారులు, ప్రముఖులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. నిత్యం కోట్ల రూపాయల్లో టర్నోవర్ జరిపే వీరంతా ఒక్కసారిగా నెమ్మదించడానికి గల కారణాలు అనే్వషిస్తున్నారు. ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా వచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకొని సదరు ప్రముఖులు, వ్యాపారుల ఇండ్లపై ఏకకాలంలోనే దాడులు చేస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. అలాగే నిత్యం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చురుకుగా ఉండే ప్రముఖుల వివరాలను కూడా సేకరించినట్లు తెలిసింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖుడు తన వద్ద ఉన్న డబ్బులను తన సిబ్బంది అకౌంట్లలో వేసి వారి వద్ద నుంచి నోట్లు రాయించుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన ఆరోపణలు, తమ వద్ద గతం నుంచి ఉన్న వారి రికార్డులను పరిశీలించి వారిపై దాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు బ్యాంకుల్లో ఉన్న లాకర్లపై కూడా దాడులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది తమ లాకర్లను ఖాళీ చేస్తున్నారని ఓ బ్యాంకు ఉద్యోగి వెల్లడించారు. గత రెండేళ్ళుగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలులాంటి వాటిని ఆధారంగా చేసుకొని త్వరలోనే ఐటి శాఖాధికారులు దాడులు చేయనున్నట్లు సమాచారం.

అందని ద్రాక్షలా సంక్షేమ పథకాలు
* గుండా మల్లేష్ ఆరోపణ
ఖమ్మం(జమ్మిబండ), జనవరి 3: ప్రత్యేక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మిగిలాయని సిపిఐ మాజీ శాసన సభ పక్ష నాయకులు, దళిత హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ గుండా మల్లేష్ ఆరోపించారు. మంగళవారం గిరిప్రసాద్ భవన్‌లో తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని, మొక్కుబడిగా దానిని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనగారిన వర్గాలను మాయమాటలతో మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ పథకం వర్తింపు విషయంలో కూడా దళితులపై కపట ప్రేమను కనబరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, దళితవాడల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. తాగునీరు, రోడ్లు, ఇంటి స్థలాలు, ఇండ్ల నిర్మాణం తదితర వసతుల కల్పనలో దళిత వాడలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 119అసెంబ్లీ స్థానాలకు గానూ గడిచిన ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు 31మంది మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. పదవుల పంపకంలో కూడా కెసిఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. దళితుల పక్షాన ఎనిమిదిన్నర దశాబ్ధాలుగా కమ్యూనిస్టు పార్టీ పోరాటం సాగిస్తున్నదని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు మాట్లాడుతూ దళితులు రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని, వారు చేసే ప్రతి పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ఈ సభలో సంఘ నాయకులు క్లైమెంట్, సాయిలు, ఆనందరావు, నర్సయ్య, లలిత, గురుమూర్తి, వెంకటేశ్వర్లు, రాము, ఏసు తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ ప్రక్రియను సత్వరమే ప్రారంభించాలి
* కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 3: జిల్లాకు మంజురైన జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను సత్వరమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను అదేశించారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఖమ్మం-కోదాడ, ఖమ్మం-సూర్యపేట జాతీయ రహదారుల భూసేకరణపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులను పరిశీలించి రూట్ మ్యాప్, సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీరాంసాగర్ డిబిఎం బ్యాలెన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధంసలాపురం ఆర్‌ఓబి భూసేకరణ సంబంధించిన సర్వే పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెసి టి వినయ్‌కృష్ణరెడ్డి, హైవేస్ పిడి శైలజా, ఖమ్మం ఆర్‌డివో పూర్ణచందర్‌రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి, తహశీల్దార్ వెంకారెడ్డి, సైదులు, రూరల్ తహశీల్దార్ నర్సింహరావు, డిటి మీనన్ తదితరులు పాల్గొన్నారు.