ఖమ్మం

బ్యాంకుల వద్ద కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జనవరి 6: ఈ నెల 1వ తేదీ నుండి కల్లూరులో ఏ బ్యాంకులో చూసినా ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం బ్యాంకులు తెరవక ముందే బ్యాంకు గేటు వద్ద క్యూలో నిల్చొని నగదు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కల్లూరులో ఎక్కడా ఎటిఎంలు పనిచేయక పోవటంతో బ్యాంకులకే జనం పరిమితమవుతున్నారు. నోట్లు రద్దై రెండు నెలలు కావస్తున్నా తమ నగదు తాము తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఖాతాదారులు మండిపడుతన్నారు. బ్యాంకు అధికారులు ఖాతాదారుల రద్దీని గమనించి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయక పోవటంతో పూటల తరబడి బ్యాంకుల్లోనే వేచి ఉండాల్సి వస్తుందని మహిళలు, వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా తమ వరకు వచ్చే సరికి బ్యాంకుల్లో సరిపడ డబ్బు చెల్లించటం లేదని క్యాష్ అయిపోయిందంటూ సమాధానమిస్తున్నారని ఖాతాదారులు అంటున్నారు. ఇంకెన్నాళ్లు ఈ అవస్థలు పడాలంటూ ఆవేదన చెందుతున్నారు. కూలీ పనులు నిర్వహించుకోవాల్సిన తాము బ్యాంకుల చుట్టూ తిరాగాల్సి వస్తుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి నగదు పొందేందుకు ఎటిఎంలు తెరవాలని, బ్యాంకుల్లో రద్దీని బట్టి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి ఖాతాదారుల పనులను వెంటనే పూర్తి చేసి పంపివేయాలని కోరుతున్నారు

కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై
అసెంబ్లీలో మాట్లాడకపోవడం దారుణం

కొత్తగూడెం, జనవరి 6: అసెంబ్లీ సమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై మాట్లాడకపోవడం దారుణమని ఐఎఫ్‌టియు నాయకులు అన్నారు. శుక్రవారం దీనికి నిరసనగా బస్టాండ్ సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కాంట్రాక్టు కార్యికుల సమస్యలపై మాట్లాడకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను వెంటనే పెర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను విస్మరించారని విమర్శించారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని ఏరియాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు పి సతీష్, ఎం చంద్రశేఖర్, దయావతి, నాగేశ్వరరావు, అరుణ, రామకృష్ణ, కన్నమ్మ, రాధ, విజయ్, నాగమ్మ పాల్గొన్నారు.

భక్తులకు అభయమిచ్చిన బలరాముడు
* కన్నుల పండువగా స్వామి దర్శనం
* పోటెత్తిన భక్తులు
భద్రాచలం, జనవరి 6: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల వేళ తన సన్నిధికి వచ్చిన భక్తులకు బలరాముడు అభయమిచ్చాడు. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు బలరామావతారంలో దర్శనమిచ్చాడు. తమ కష్టాలను కడతేర్చి సకల సౌఖ్యాలు కల్పించాలని భక్తులు వేడుకున్న తీరుతో ఉత్సవాల్లో స్వామి దర్శనమిచ్చి వారందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. ముందుగా స్వామికి గర్భగుడిలో ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి సుప్రభాత సేవను చేశారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజలు చేశాక లక్ష కుంకుమార్చన జరిపారు. పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. గర్భగుడిలో రామయ్యకు బాలభోగం నైవేద్యంగా పెట్టి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా బేలమండపానికి తీసుకెళ్లారు. బలరామావతారంలో స్వామిని అలంకరించి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశారు. నైవేద్యం పెట్టారు. తర్వాత బలరామావతార రామయ్య దర్శనం కన్నుల పండువగా, వేడుకగా చేశారు. జేగంటలు మ్రోగిస్తూ భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామి దర్శనంతో భక్తులు పులకించి పోయారు. ఈ సందర్భంగా రుత్విక్కులు, వేదపండితులు ముందుగా ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుప్పావై గోష్టిని చేపట్టారు. గోదాదేవి రచించిన పాశురాలను పారాయణం చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా చతుర్వేదాలు, ద్రవిడ దివ్యప్రబంధాలు, శ్రీ్భష్యం, శ్రీమద్రామాయణం పారాయణం చేశారు. మధ్యాహ్నం సేవాకాలం చేసి రాజభోగం సమర్పించారు. సాయంత్రం వేళ స్వామిని ఊరేగింపుగా పల్లకీలో మిథిలా ప్రాంగణానికి తీసుకెళ్లారు. అక్కడ మేళతాళలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ భక్తులకు స్వామి దర్శనం ఇచ్చారు. వేదిక వద్ద హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. శ్రీసీతారామ కల్యాణం హరికథా కాలక్షేపం, బహువేషధారణ, కూచిపూడి, శాస్ర్తియ నృత్యాలు, పేరిణి నృత్యాలు జరిగాయి. అనంతరం స్వామి తిరువీధి సేవకు బయలుదేరారు. రాజవీధి గుండా స్వామి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని పూజలందుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

నేడు శ్రీకృష్ణావతారం
భద్రాచలం, జనవరి 6: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో పగల్‌పత్తు ఉత్సవాలలో శ్రీసీతారామచంద్రస్వామి నేడు భక్తులకు శ్రీకృష్ణావతారంలో దర్శనం ఇవ్వనున్నారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునుడికి బోధించిన మానవ ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నానారాయణుడి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించాలి
* దేవస్థానం ఇవో, తాహశీల్దార్
భద్రాచలం, జనవరి 6: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో భాగంగా జరిగే తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని దేవస్థానం ఇవో టి.రమేష్‌బాబు, తాహశీల్దార్ రామకృష్ణ అన్నారు. శుక్రవారం సాయంత్రం గోదావరి పరీవాహక ప్రాంతంలో హంస వాహనం ట్రైల్ రన్‌లో వారు పాల్గొన్నారు. చిన్నచిన్న పొరపాట్లు గుర్తించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మరొకసారి ట్రైల్ రన్ నిర్వహించి ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఇంజనీరింగ్, ఇరిగేషనర్, దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలన్నారు. దేవస్థానం డిఇ రవీందర్, సీఐ శ్రీనివాసులు, ఇరిగేషన్, ఇంజనీరింగ్, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు
* షాపుల్లో తనిఖీ చేసిన అధికారులు
కొణిజర్ల,జనవరి 6: ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక తహశీల్దార్ పి సాంబశివరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించిన నేపధ్యంలో శుక్రవారం కొణిజర్లలోని పలు షాపుల్లో ఎంపిడిఓ, తహశీల్దార్, ఎస్‌ఐలు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కిరాణా షాపులో ఉన్న భోజనం ప్లేట్లను తగులబెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వాడకం వలన ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యవరణానికి తీవ్రమైన హాని కలుగుతుండటంతోప్రభుత్వం నిషేధించిదన్నారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ క్రాంతికుమార్, పంచాయతీ కార్యదర్శి పి శ్రీ్ధర్, వీఆర్వోలు పాల్గొన్నారు.

బాలికపై అత్యాచారం
గార్ల, జనవరి 6: ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పినా అది నమ్మని ఓ బాలిక అతన్ని తిరస్కరించిందనే కక్షతో ఆమెపై అత్యచారం జరిపిన సంఘటన గార్ల మండలం పుల్లూరు శివారు చిన్నబంజరలో శుక్రవారం చోటుచేసుకుంది. గార్ల పోలీసుల కథనం ప్రకారం చిన్నబంజరకు చెందిన భూక్య లక్ష్మణ్ గత మూడు మాసాలుగా అదే గ్రామానికి చెందిన బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలను బాలిక నమ్మలేదు. దీంతో కక్ష పెంచుకున్న లక్ష్మణ్ ఆమె ఇంటిలో ఎవరూ లేని సమయంలో చొరబడి ఆమెపై అత్యచారం చేసి ఈ విషయాన్ని ఎవరికైనా తెలిపితే చంపేస్తానని బెదిరించాడు.ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్‌పై నిర్భయ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గార్ల ఎస్‌ఐ సిహెచ్ వంశీధర్ తెలిపారు. నిందితుడు పారారిలో ఉన్నాడని తెలిపారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
పెనుబల్లి, జనవరి 6: మండలపరిధిలోని కొత్తలంకపల్లి గ్రామంలో అభయా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. పేద విద్యార్థులందరికి గతంలో యూనిఫాం, పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయటం జరిగిందని ఇదే విధంగా ఈ పాఠశాలలో చదువుతున్న 30 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసినట్లు వివరించారు. విద్యార్థులందరూ పాఠాలను నేర్చుకుంటూ ఉన్నతభావాలు పెం పొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, బైరెడ్డి రాఘవరెడ్డి, చలమాల నరసింహారావు, సుం కర సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

క్రీడలకు ప్రోత్సాహం కరవు
* డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి
కొణిజర్ల, జనవరి 6: క్రీడలు చాలా ముఖ్యమని, గతంలో మాదిరిగా నేడు క్రీడలకు ప్రోత్సాహం లేదని స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎం శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తీగలబంజర గ్రామంలో మూడు రోజులపాటు జరగనున్న రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలను శుక్రవారం డిఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు తల్లిదండ్రులు, పాఠశాలల నుంచి ప్రోత్సాహం లేదని, పిల్లలు బాగా చదవాలని మాత్రమే ఆలోచిస్తారని ఆటలు గురించి పట్టించుకోవటం లేదన్నారు. క్రీడల వలన మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు స్నేహభావం పెరుగుతుందన్నారు. గెలుపు, ఓటములు సహజమని ఓటమి చెందిన వాళ్ళు బేషజాలకు పోకుండా ఓటమికిగల కారణాలను తెలుసుకుని తద్వారా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గ్రామంలో రాష్టస్థ్రాయి పోటీలు నిర్వహిస్తున్న గ్రామ కమిటీ, క్రీడల నిర్వహణకు ఆర్థికంగా సహకరించిన దాతలను ఈ సందర్భంగా డిఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలిపాక కమలమ్మ, ఎంపిటిసి సభ్యుడు భూక్యా మీటు, ఎస్‌ఐ కరుణాకర్, గ్రామ కమిటీ సభ్యులు షేక్ జాన్‌పాష, షేక్ నజీర్, భూక్యా నాగేశ్వరరావు, లూనావత్ వీరు, సైదుపాష, కృష్ణ పాల్గొన్నారు.

పైనంపల్లిలో రోడ్డుకు రెండు వైపులా విస్తరణ

నేలకొండపల్లి, జనవరి 6: జాతీయ రహదారి పనుల్లో భాగంగా పైనంపల్లిలో రోడ్డుకు రెండు పక్కలా సమానంగా స్థలం సేకరించి విస్తరణ పనులు చేపడుతామని జిల్లా కలెక్టర్ లోకష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఆచర్లగూడెం, ఆరెగూడెం, కొరట్లగూడెంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాన్ని, ఇంకుడు గుంటలు పరిశీలించారు. అనంతరం కొరట్లగూడెంలో ఉపాధి హామీ పథకం కింద రైతు కొమ్మినేని వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన జామతోటను ఆయన పరిశీలించారు. జామకాయల దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద 2.30 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా చేపట్టిన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ నర్సరీలలో 1.80 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. హరితహారంలో భాగంగా ఎన్‌ఎస్‌పి పరిధిలో నాటిన మొక్కలు బాగున్నాయని, నాన్ ఎన్‌ఎస్‌పి ఏరియాలో నాటిన మొక్కలు బాగు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి మురళీధర్‌రావు, నేలకొండపల్లి ఎంపిడిఓ ఆళ్ళ శ్రీనివాసరావు, తహశీల్దార్ దొడ్డారపు సైదులు, ఈఓఆర్‌డి తీర్ధాల ప్రభాకర్‌రావు, విఆర్‌ఓ చైతన్యభారతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాలు
ఖమ్మం(ఖిల్లా), జనవరి 6: కార్మిక వర్గం తమ హక్కుల కోసం నిరంతర పోరాటాలు జరపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆళ్ళ రామారావు పిలుపునిచ్చారు. స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన ఇఫ్టూ ఖమ్మం ఏరియా నిర్మాణ సభలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించివేసే కుట్ర జరుగుతుందని దీనిని ప్రతి కార్మికుడు ప్రతిఘటించాలన్నారు. నూతన ఆర్థిక విధానలతో ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ వైపు మళ్ళాయని దీంతో కాంట్రాక్ట్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. దీనికి పాలకుల విధానాలే కారణమన్నారు. కార్మికవర్గం చాలీచాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటితరంగ కార్మికులు పెంచడంతో పాటు వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ రంగాలకు అనూకూలంగా వ్యవహరిస్తున్న మోడి విధానాలపై పోరాడాలని పులుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇప్టూ జిల్లా కార్యదర్శి జి రామయ్య, నాయకులు వెంకన్న, అశోక్, శ్రీనివాస్, విప్లవ్‌కుమార్, గుర్వయ్య పాల్గొన్నారు

పెట్రోల్ ధరలను పెంచి
సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు
మధిర, జనవరి 6: ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం మధిర పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు మాట్లాడుతూ ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడి ఆ తర్వాత అన్ని వస్తువులపై ధరలను పెంచి సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ధరలను తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందా సైదులు, మండవ కృష్ణారావు, పి మురళి, వెంకట్రావు, రాజు, ఖాజా, శంకర్‌రావు, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.