ఖమ్మం

పెద్ద నోట్ల రద్దుతో పెను సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 8: పెద్దనోట్ల రద్దుతో దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇందుకు ప్రధాని నరేంద్రమోడి ఏకపక్ష నిర్ణయమే కారణమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా ధర్నాచౌక్ చేరుకొని ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ భట్టివిక్రమార్కలు మాట్లాడుతూ 500, 1000 నోట్లను రద్దు చేస్తూ నరేంద్రమోడి అర్థరాత్రి తీసుకున్న నిర్లయంతో యావత్ దేశ ప్రజలను ఇబ్బందులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్లయం వెనుక కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. నల్లధనం, దొంగనోట్లను బయటకు తీసుకువస్తానని చెప్పిన మోడి ఎంత సొమ్ము రాబట్టారో చెప్పాలన్నారు. నల్లసొత్తును వెలికి తీయకపోగా దేశ ప్రజలను కష్టాలపాలు చేశారన్నారు. 50రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన మోడి 50రోజుల్లో 65సార్లు బ్యాంక్ రూల్స్ మార్చారన్నారు. బ్యాంక్‌ల్లో దాచుకున్న డబ్బును అడుక్కునే పరిస్థితి కల్పించారని, ప్రజాసామ్య హక్కులకు విలువలేకుండా పోయిందన్నారు. ఆనాడు నోట్లను రద్దు చేస్తూ మోడి చెప్పిన మాట ఏది జరగలేదని ఇప్పుడు మాట మార్చి నగదు రహితం అంటూ ప్రజలను మభ్యపెడుతూ మోసచేస్తున్నారని దుయ్యబట్టారు. నగదు రహితం అంటే చిరు, చిల్లర వ్యాపారుల నుండి కార్పొరేట్‌కు దోచి పెట్టడమేనన్నారు. నోట్లరద్దు రోజున గగ్గోలు పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో మోడిని కలసి మాటమార్చారని దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉందన్నారు. రాష్ట్రంలో నోట్లరద్దుతో ప్రజలతోపాటు రైతాంగం అల్లాడుతుందని, 37లక్షల మంది రైతులకు రుణాలు లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రభీకి పెట్టుబడి లేక, బ్యాంక్ రుణాలు లభించక రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు విష్ణునాధ్, శ్రీ్ధర్‌బాబు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బలరాంనాయక్, వనమా వెంకటేశ్వర్లు, సంబాని చంద్రశేఖర్, రేగా కాంతారావు, వడ్డెబోయిన నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
బహిర్గతమైన కాంగ్రెస్ విభేదాలు
మోడి తీసుకున్న పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చినప్పటికీ జిల్లా కాంగ్రెస్ కమిటీ, రేణుకచౌదరి వర్గం వేర్వేరుగా ప్రదర్శనలతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఎఐసిసి పరిశీలకులు విష్ణునాధ్, జిల్లా వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ్ధర్‌బాబు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలతో జిల్లా పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తన క్యాంపు కార్యాలయం నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ చేరుకొని ఆమె అనుచరులు ఉపన్యాసాలను ప్రారంభించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎఐసిసి పరిశీలకుడు రేణుకచౌదరిని ధర్నాచౌక్ రావాలని సూచించారు. దీంతో రెండు వర్గాలు కలసి ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

నల్లనయ్యగా.. నీలమేఘశ్యాముడు
భద్రాచలం, జనవరి 7: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. దివ్యక్షేత్రంలో స్వామి శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వడంతో నల్లనయ్యకు భక్తజనం ప్రణమిల్లారు. అధ్యయనోత్సవాల్లో ఈ అవతారం అత్యంత ముఖ్యమైంది. ఈ సందర్భంగా శ్రీ కృష్ణావతారాన్ని భక్తి ప్రవత్తులతో భక్తులు దర్శించుకున్నారు. తొలుత అంత్రాలయంలో స్వామివారిని శ్రీకృష్ణావతారంలో అలంకరింపజేశారు. విష్వక్ష్షేన పూజ, పుణ్యహవచనం చేశారు. వేద పండితులు, ఆలయ అర్చకులు ద్రవిడ, దివ్య ప్రబంధం, ఇతిహాసం పఠించారు. వేదవిన్నపాలు జరిగాయి. స్వామికి మంగళ నీరాజనాలు ఇచ్చారు. అనంతరం గర్భగుడి నుంచి స్వామిని తీసుకొచ్చారు. భక్తులు శ్రీ కృష్ణావతారాన్ని దర్శించుకుని నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నల్లనయ్య శ్రీకృష్ణావతార రామయ్యకు లాలలు, జోలలు పాడారు. ఊంజల్ సేవ చేశారు. స్వామిని బంగారు ఊయలలో ఉంచి ఆస్థాన విద్వాంసులు కీర్తనలు ఆలపించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా కళ్యాణ మండపం వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఊరేగింపు ముందు భాగంలో భజనలు కోలాటాలు జరిగాయి.