ఖమ్మం

మిషన్ కాకతీయ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, ఏప్రిల్ 7: మండలంలో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే భట్టివిక్రమార్క గురువారం శంకుస్థాపనలు చేశారు. ఇనగాలిలోని చింతల చెరువుకు 37లక్షల రూపాయలతో చేపట్టనున్న మిషన్ కాకతీయ పనులకు ఎంపిపి చావా అరుణ, స్థానిక సర్పంచ్ యనమల పావని, ఎంపిటిసి అనిమిరెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఇనిద్రమ్మ చెరువు 28లక్షల రూపాయలతో చేసే పనులకు ఎంపిటిసి దేవి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. పెద్దగోపవరంలో 20లక్షల రూపాయలతో చెక్‌డ్యాం వద్ద నిర్మించే కల్వర్టుకు జడ్పిటిసి అంకశాల శ్రీనివాసరావు, సర్పంచ్ సుంకర వరలక్ష్మి, ఎంపిటిసి కృష్ణార్జనరాజులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి ఎద్దడి విలయతాండవం చేస్తుందని, నీరులేక ప్రజలు, జంతువులు పలు ఇబ్బందులు పడుతున్నారని, సాగర్ నీటితో తాగునీటికి అనువుగా ఉన్న చెరువులన్నింటిని నింపుకోవాలన్నారు.
టిఆర్‌ఎస్ పాలన గాడితప్పిందన్నారు. కింది స్థాయిలో సామాన్యుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా పనులు కావడంలేదన్నారు. జవాబుదారీ తనం ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా లేకుండా పోతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంత వరకి ఏ ఒక్కటి పూర్తికాలేదన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఎప్పుడు వస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇంత వరకు అడ్రస్సే లేదన్నారు. జిల్లాకు లక్ష ఎకరాల నీరందించే పథకం ఏమైందో తెలియదన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అమలు కాలేదన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇంత వరకు అందలేదని ఎద్దేవా చేశారు. మూడు బడ్జెట్‌లు అయిపోయినా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేరకపోవడంతో మిగిలిన రెండు బడ్జెట్‌లోనైనా అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌లపై పవర్ ప్రజంటేషన్ ఇవ్వడం కాదు ఆచరణలో చేసి చూపెట్టాలన్నారు. 70శాతం పూరె్తైన ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో మొదటి నుండి చేయడం సమంజసమా అన్నారు. కేవలం సిఎం ప్రచారం కోసమే రీడిజైనింగ్ చేస్తున్నారని, రెండులక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతాయని, దేశంలో అతిపెద్ద స్కాం ఇది అవుతుందన్నారు. దుమ్ముగూడెం, ఇంధిరాసాగర్ ప్రాజెక్టులను తీసివేయకుండా ఇప్పుడు నిర్మించేచోట వాటిని పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐబి డిఇ నారాయణ, ఎఇ రాజేశ్వర్, తహశీల్దార్ సమ్మిరెడ్డి, ఎండిఓ పి విజయ, నరేష్, నాగేశ్వరరావు, జీవన్‌రెడ్డి, నాయకులు బొగ్గుల గోవర్థన్‌రెడ్డి, అనుమోలు కృష్ణారావు, కడియం శ్రీనివాసరావు, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నర్సింహారావు, యన్నం వెంకటేశ్వరరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.