ఖమ్మం

ఉత్తర ద్వార దర్శనంతో పులకించిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జనవరి 9: స్థానిక శ్రీసంతాన వేణుగోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం నిర్వహించిన ఉత్తరద్వారదర్శనంలో స్వామి వారిని దర్శించుకొని భక్తులు పులకించి పోయారు. ఈ సందర్భంగా భక్తులు వేకువఝాము నుండి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు భక్తమండలి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకతీయుల కాలంనాటి ఈ ఆలయంలో పూజలు నిర్వహించినా, ఉత్తర ద్వార దర్శనం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తమ కుటుంబాలకు మేలు జరుగుతుందని భక్తుల నమ్మకం.
దీంతో ఆలయానికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులు తరలివస్తూ స్వామి వారి దర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ఉత్సవ మూర్తులను కల్లూరులో మేళ తాళాలతో ఊరేగించారు. ఇళ్ల ముందుకు వచ్చిన మూర్తులను భక్తులు దర్శించుకొని పూజలు చేశారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత అకౌంట్లలో జమైన
నల్లధనం లెక్క చెప్పాలి

ఖమ్మం(జమ్మిబండ), జనవరి 9: పెద్ద నోట్ల రద్దు తర్వాత అకౌంట్లలో జమ అయిన నల్లధనానికి సంబంధించిన లెక్క చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద నోట్ల సమస్యపై బ్యాంక్‌ల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో మోడి తీసుకున్న ఏకపక్ష నిర్లయంతో దేశ ప్రజలు అనేక ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. నల్లడబ్బును వెలికి తీస్తానన్న మోడి ఇప్పటి వరకు ఎంత నల్లధనాన్ని రాబట్టారో ప్రజలకు చెప్పాలన్నారు. నల్లడబ్బు వెలికి తీయలేని మోడి ఇప్పుడు నగదు రహితమంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. నల్ల కుబేరులు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై తమ డబ్బును తెలుపుగా మార్చుకున్నారని, సామాన్య, మధ్య తరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో మూలుగుతున్న డబ్బును వెలికి తీసుకువచ్చి ప్రజలకు పంచుతానని చెప్పిన మోడికి అది సాధ్యం కాకపోవడంతో పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను అనేక ఇబ్బందుల పాల్జేశారని ఆరోపించారు. 50 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న మోడి కార్పొరేట్ల అండగా నిర్లయాలు తీసకుంటున్నారన్నారు. ప్లాస్టిక్ మనీ చిన్న, చిరు వ్యాపారుల ధనాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకేనన్నారు. ప్రకటనలకే పరిమితమైన మోడి ప్రభుత్వం ప్రజలకు చేసేందేమి లేదన్నారు. ఇప్పటికైనా తాను తీసుకున్న నిర్లయం ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.