ఖమ్మం

గోదావరి జలాలతో బీడు భూముల్లో బంగారు పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, జనవరి 9: ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతో టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను మళ్లించడంతో టేకులపల్లి మండలంతో పాటు రెండు జిల్లాల పరిధిలోని బీడు భూములన్నీ బంగారు పంటలు పండనున్నాయని రాష్ట్ర రహదారుల, భవనాల మంత్రి తమ్మల నాగేశ్వరావు అన్నారు. మంత్రి తుమ్మల పర్యటనలో భాగంగా సోమవారం టేకులపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సులానగర్, టేకులపల్లి, 9వ మైలుతండా గ్రామాలలో పేదలకు నిర్మించే డబుల్ బెడ్ రూం గృహాలకు శంకుస్థాపనలు చేశారు. టేకులపల్లిలో బిఎస్‌సి గ్రాంటు 1కోటి 70లక్షల రూపాయల వ్యయంతో పోస్టు మెట్రిక్ బాలుర వసతి గృహానికి శంఖుస్ధాపన చేశారు. తరువాత సహకార బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు త్వరలో పనులు మొదలవుతాయని, 20 టియంసి నీళ్లతో అతిపెద్ద రిజర్వాయర్‌గా రోళ్లపాడు ప్రాజెక్టు మారనుందన్నారు. టేకులపల్లి మండలాన్ని అనుసంధానం చేయడానికి గుండాల, కరకగూడెం, పినపాక మండలాలను రహదారులను కలుపుతూ మైదాన ప్రాంతంకు దీటుగా టేకులపల్లి మండలాన్ని అభివృద్ధి పర్చడానికి ముఖ్యమంత్రి ఆశీర్వాదం ఉందన్నారు. గత 15 ఏళ్లనుండి ఇల్లందు నియోజకవర్గం వెనుకబడి ఉండటాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యమంత్రి దృష్టికి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకువెళుతున్నాడన్నారు. రాబోయే రోజుల్లో ఇల్లందు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిని చూస్తారన్నారు. హైద్రాబాద్ నుంచి ఇల్లందు మీదుగా భద్రాచలం వరకు జాతీయ రహదారి మంజూరి అయిందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ను గిరిజన ప్రాంతం అనుభవం కలిగి, గతంలో భద్రాచలం ఐటిడిఎ పివోగా విధులు నిర్వహించిన రాజీవ్ గాంధీ హనుమంతును ప్రత్యేకంగా నియమంచారన్నారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు ప్రత్యేక బ్రాంచిలను ఏర్పాటు చేసి సకాలంలో రుణాలు అందించాలన్నారు. ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతర రైతులు పహానీలతో ఇబ్బందులు పడకుండా అందిచాలని ఆర్డీఓ, తహశీల్దార్‌లను ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా శంకుస్థాపనలు చేసిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి శాఖకు ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించిందన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, జడ్పీ చైర్ పర్సన్ గడిపెల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, డిప్యూటీ సిఇఓ భారతి, సెంట్రల్ సహకార బ్యాంక్ సిఇఓ చెన్నారావు, ఎంపిపి భూక్యా లక్ష్మీ, జడ్పీటీసి లక్కినేని సురేందర్, సర్పంచ్‌లు అజ్మీర బుజ్జి, ఇస్లావత్ పార్వతి, బానోతు పూర్ణ. ఎంపిటిసిలు, తాహశీల్దార్ నాగేశ్వరావు, ఎంపిడివో గంటావర ప్రసాద్, ఆయా శాఖాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం
కార్మిక సంఘాలతో యాజమాన్యం సమావేశం

కొత్తగూడెం, జనవరి 9: సింగరేణి సంస్థలో గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు. ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ డైరక్టర్ (పా) పవిత్రణ్ కుమార్ అధ్యక్షత వహించారు. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి కార్మిక సంఘాల అభిప్రాయాలను సేకరించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితిని నాలుగేళ్లు ఉండాలని తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం, హెచ్‌ఎంఎస్ యూనియన్‌లు కోరగా రెండేళ్ళ కాలపరిమితి ఉండాలని ప్రధాన కార్మిక సంఘాలైన ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, బిఎంఎస్, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాలు తమ అభిప్రాయాల వెల్లడించాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను సెంట్రల్ లేబర కమీషన్ పర్యవేక్షణలో నిర్వహించాలని కార్మిక సంఘాలు కోరాయి. ఈసమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అద్యక్ష, కార్యదర్శులు బి వెంకటరావు, కెంగర్ల మల్లయ్య నాయకులు మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై గట్టయ్య, వాసిరెడ్డి సీతారామయ్య, సిఐటియు నాయకులు మంద నర్శింహారావు, రాజిరెడ్డి, బిఎంఎస్ నాయకులు చింతల సూర్యనారాయణ, లట్టి జగన్‌మోహన్, ఐఎఫ్‌టియు నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, ముక్తార్ పాషా, హెచ్‌ఎంస్ నాయకులు రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.