ఖమ్మం

మనసున్న వ్యక్తి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, జనవరి 12: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కోరే మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అని ఇల్లెందు శాసన సభ్యుడు కోరం కనకయ్య అన్నారు.
గురువారం స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన వారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ అన్ని వర్గాలకు చెందిన పేదవారికి శ్రేయస్సును కోరే మొదటి ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. ఏ వర్గాన్ని తీసిరాదంటూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు చేయూతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, దీనిలో భాగంగా పేదలైన వారు వివాహం చేసుకునేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకొని వారికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. అదే విధంగా తన నియోజకవర్గంలోని కామేపల్లి మండలానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అంతర్గత రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించారని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, తహశీల్దార్ లక్ష్మణస్వామి, ఎంపిడిఓ విజయ, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, స్థానిక ఎంపిటిసిలు, సర్పంచ్ పాల్గొన్నారు.
పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టేబుల్స్ అందజేత
ఖమ్మం (ఖిల్లా), జనవరి 12: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం కోసం పువ్వాడ ఫౌండేషన్ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 200చదువుకునే టేబుల్స్‌ను ఫౌండేషన్ చైర్మన్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు బల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదప్రజలు, విద్యార్థుల అభ్యున్నతికి తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు ధర్మారావు, సాంబశివరావు, మల్లాది వాసుదేవరావు, రంగారావు, ఏఎంసి వైస్‌చైర్మన్ మందడపు నర్సింహరావు, జడ్పీటిసి వీరునాయక్, కార్పొరేటర్ కమర్తపు మురళీ, సర్పంచ్ రెంటాల ప్రసాద్, వెంకటరమణ, హరిప్రసాద్, భద్రయ్య పాల్గొన్నారు.