ఖమ్మం

కాంట్రాక్ట్ లెక్చరర్ల పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, డిసెంబర్ 21: మండలంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పోరుబాట కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రధాన రహదారిపై జూనియర్ కళాశాల నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు పోరుబాట నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా లెక్చరర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరుబాట కార్యక్రమంలో బాగంగా 23వ తేదీన సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె కిరణ్‌కుమార్, ఎం శ్రీనివాసరావు, జ్యోతి, ప్రసన్న, వీరభధ్రం తదితరులు పాల్గొన్నారు.

జానపద నృత్య కళాకారుడు బొమ్మారెడ్డికి బంగారు పతకం
సత్తుపల్లి, డిసెంబర్ 21 : ఈ నెల 13 నుంచి 16వరకు గోవా రాష్ట్రంలో 7వ జాతీయ ఆర్టిస్ట్ డ్యాన్స్ అండ్ కల్చరల్ చాంపియన్‌షిప్ 2016, ఇండియన్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 35సంవత్సరాల జానపద నృత్యపోటీ విభాగంలో అంతర్జాతీయ జానపద నృత్య కళాకారుడు డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి 16 రాష్ట్రాల కళాకారులతో పోటీపడి బంగారు పతకం సాధించారు. జానపద నృత్యంలో అమ్మలారా, అయ్యలారా అనే తెలంగాణ జానపద నృత్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు.సందర్భంగా డబ్య్లూఎడిఎప్ ప్రెసిడెంట్ నిల్స్‌హకన్ కార్జన్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి.కొండయ్య, జానపద ఇంటర్‌నేషనల్ డాన్స్ ఫెడరేషన్ మెంబర్ ఎండి, షహీద్ తదితర గోవా గవర్నమెంట్ విఐపీలు బొమ్మారెడ్డిని అభినందించి ప్రధమ బహుమతిగా బంగారు పతకాన్ని, మెమెంటోని అందజేశారు. సందర్భంగా బొమ్మారెడ్డి మాట్లాడుతూ గోవా నృత్యపోటీలలో బంగారు పతకం రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

పెద్దనోట్ల రద్దు వెనుక పెద్ద కుట్ర
కొణిజర్ల, డిసెంబర్ 21: పెద్దనోట్ల రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందని (సిపిఐఎంఎల్-ఎన్‌డి) ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఎం గిరి ఆరోపించారు. కొణిజర్లలో బుధవారం రొంటే గంగయ్య అధ్యక్షతన జరిగన సమావేశంలో గిరి మాట్లాడుతూ నోట్లరద్దు వలన భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నల్లధనం పేరుతో చేపట్టిన నోట్లరద్దు వలన పెద్దలకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పంటలు అమ్మిన రైతులకు షరతులు లేకుండా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీకారంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ఇంతవరకు సంబధిత వ్యాపారులను అరెస్టు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం వైరా సబ్‌డివిజన్ కమిటీ ఎన్నిక జరిగింది. కార్యదర్శిగా సింగరాయపాలెంకు చెందిన షేక్ ఖాశిం ఎన్నికైనట్లు గిరి ప్రకటించారు. సమావేశంలో నాయకులు కనకరాజు, వేణుబాబు, పెద్దప్రోలు వెంకటేశ్వర్లు, రాము తదితరులు పాల్గొన్నారు.