ఖమ్మం

మారుమూల ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, ఏప్రిల్ 7: మారుమూల ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, ఏజెన్సీలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు బృహత్తర ప్రణాళికతో తమ ప్రభుత్వం పథకాలు మంజూరు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంత్రి సుడిగాలి పర్యటన నిర్వహించారు. పూసూరు- ఏటూరునాగారం మధ్య రూ.340 కోట్లతో నిర్మించిన గోదావరి వంతెనను గత జనవరి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీలు వరంగల్‌లోని మడికొండలో ప్రారంభించారని, నేడు పూర్తిస్థాయిలో పున ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రూ.36 నెలల్లో భారీ నిర్మాణం పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్ కె.నర్సింహారెడ్డి, బి. వెంకటరెడ్డిలను వంతెన వద్ద జరిగిన సమావేశంలో మెమొంటోలతో సత్కరించారు. ఇంజనీరింగ్ అధికారులు గణపతిరెడ్డి, వసంత, లక్ష్మయ్య, శివారెడ్డి తదితర చీఫ్ ఇంజనీర్లను, ఎస్‌ఈలు, ఈఈలు, ఏఈలను సత్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. భద్రాచలం నుంచి మహారాష్టల్రోని నాసిక్ వరకు గోదావరి నదిగుండా జల రవాణాకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికి సంబంధించిన అంశాల వద్ద పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సంబంధిత శాఖ మంత్రితో జల రవాణా అంశంపై చర్చించాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీ సీతారాంనాయక్‌ను కోరారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు గాను గిరిజన ఉప ప్రణాళికా పథకం కింద రూ.200 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఈఎంసీ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 150 వంతెనలు పూర్తి కావాల్సి ఉందన్నారు. వంతెన నిర్మాణాలను శరవేగంతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి వాజేడు మండల కేంద్రంలో ఐటీఐ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. అదే గ్రామంలో మార్కెట్‌కమిటీ ఆధ్వర్యంలో గోడౌన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామంలో రూ.80 లక్షలతో గిరిజన ఆశ్రమ పాఠశాలకు శంకుస్థాపన, వెంకటాపురం మండల కేంద్రంలో రూ.4 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గోడౌన్‌ను ప్రారంభించారు. రూ.కోటితో నిర్మించే మండల పరిషత్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని ఆలుబాక గ్రామంలో రూ.133కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్‌పర్సన్ కవిత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మండలంలోని బర్లగూడెం గ్రామం నుంచి చిరుతపల్లి గ్రామం వరకు సుమారు 3కి.మీ. దూరం మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ బాలసాని ద్విచక్రవాహనంపై శంకుస్థాపన చేసే గ్రామానికి వెళ్లారు.