ఖమ్మం

ఖేలో ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(స్పోర్ట్స్), డిసెంబర్ 21: సమగ్ర క్రీడాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖేలోఇండియాను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఏటా అండర్-16 వయస్సు కేటగిరీలో జరిగే పోటీలను ఇప్పటి నుంచి కేంద్ర యువజన సర్వీసుల శాఖ నిర్వహించనుంది. ప్రస్తుతం ఉన్న రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్(ఆర్‌జికెఏ)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడి దాని స్థానంలో ఖేలో ఇండియాను ప్రవేశపెట్టింది. ఆయా జిల్లాలో క్రీడాకారులు లేకుంటే పోటీల ద్వారా గుర్తించి అవసరమైన వౌలిక సదుపాయాలు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్(పైతా), రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ లాంటి పథకాల స్థానంలో దీనికి కొత్తరూపు తీసుకువచ్చి సంపూర్ణ క్రీడాభివృద్దే ధ్యేయంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా జిల్లాస్థాయిలో పనిచేసే కమిటీల్లో కలెక్టర్ చైర్మన్‌గా, జడ్పీ చైర్‌పర్సన్ కో చైర్మన్‌గా, జడ్పీ సిఇఓ డిప్యూటీ చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో రాణించిన ఇద్దరు క్రీడాకారులు ఈ కమిటీలో ఉంటారు. ఒకరు మగ, ఒకరు ఆడ క్రీడాకారులు మెంబర్లుగా ఉంటారు. జిల్లా క్రీడాధికారి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. అంతే కాక కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా పార్లమెంటు సభ్యులు, ఒక ఎమ్మెల్యే మెంబర్‌గా వ్యవహరిస్తారు. కాగా ఈ పథకం 2022వరకు కొనసాగేలా ప్రణాళికలు రూపొందించారు. గతంలో కేవలం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే క్రీడలు నిర్వహించేది. ఇకనుంచి కేంద్ర యువజన శాఖ ‘సాయ్’ సహకారంతో దీనిని సమర్థవంతంగా నడిపేలా చర్యలు తీసుకుంది. రాష్టస్థ్రాయిలో ప్రతిభ కనబర్చే క్రీడాకారులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందించేలా చర్యలు తీసుకుంటుంది. గ్రామీణ క్రీడోత్సవాల తరహాలోనే ఈ పోటీలను నిర్వహించడానికి చర్యలు తీసుకోనున్నారు. అండర్-14,17 కేటగిరీలలో బాల, బాలికలను ప్రోత్సహించేలా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాస్థాయిలో జరిగే ఖేలో ఇండియా పోటీలను మూడంచెల విధానంలో జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తొలుత గ్రామస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లాస్థాయిలో జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు ప్రతి క్రీడాంశాల్లో పోటీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, టైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుడ్‌బాల్, హాకీ, వాలీబాల్ క్రీడాంశాల్లో మూడంచెల పద్దతిలో పోటీలు జరుగుతాయి. ఈ పోటీలను రాష్ట్రంలో నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారాలు అవసరమని జిల్లా క్రీడాధికారి ఎండి గౌస్ అన్నారు.

ఐఆర్‌ఎస్ అధికారిపై సిబిఐ కేసు నమోదు
* పెనుబల్లిలో అలజడి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 21: పెనుబల్లి మండలానికి చెందిన ఐఆర్‌ఎస్ అధికారి శ్రీరంగపురి మురళీమోహన్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. దీంతో పెనుబల్లిలో తీవ్ర అలజడి నెలకొంది. ప్రస్తుతం చెన్నై ఇన్‌కం ట్యాక్స్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న మురళీమోహన్‌కు హైదరాబాద్‌లో సేట్‌లింగంపల్లి, మనికొండా, హయత్‌నగర్, పుప్పాలగూడాలతో పాటు పెనుబల్లి మండలంలో ఒక లాడ్జి, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించి 3.28కోట్ల రూపాయలు ఉన్నట్లు సిబిఐ అధికారులు కనుగొన్నారు. హైదరాబాద్‌లో ఓ కళాశాల కూడా ఉండటంతో ఆమె భార్య కళపై కూడా కేసులు నమోదు చేశారు. 1999 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన మురళీమోహన్ పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామానికి చెందిన వాడు. ఇతనిపై సిబిఐ కేసు నమోదు చేయడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.