ఖమ్మం

భక్త రామదాసు కీర్తనలతో నృత్యాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 29: భక్త రామదాసు కీర్తనలతో పరవశించిన రామయ్య సన్నిధిలో భక్త రామదాసు కీర్తనలకు అరుదైన గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 1111 మంది చిన్నారులు భక్త రామదాసు కీర్తనలు ఇదిగో భద్రాద్రి... గౌతమి అదిగో చూడండి, నను బ్రోవమని చెప్పవే, అంతా రామమయం... అనే కీర్తనలకు ఏకధాటిగా నృత్యం చేసి రామయ్యకు నృత్యాభిషేకం చేశారు. ఇది అరుదైన ఘనతగా భావించి తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సుల్లో నమోదు చేస్తున్నట్లు బుక్ నిర్వాహకులు వెంకటాచారి వేలాది మంది భక్తుల నడుమ ప్రకటించారు. అంతేకాకుండా భద్రాద్రి నృత్యాభిషేకం నిర్వాహకులు బెక్కంటి శ్రీనివాసరావుకు గోల్డ్ మెడల్‌తో పాటు, మరో రెండు మెడల్స్ ప్రదానం చేశారు. ఉదయం భద్రాద్రి నృత్యాభిషేకం నిర్వాహకులు తాళ్లూరి పంచాక్షరయ్య, పాకాల దుర్గాప్రసాద్, బెక్కంటి శ్రీనివాసరావుతో పాటు ముఖ్య అతిథులు భద్రాచలం ఫస్ట్‌క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ బులికృష్ణ, సిఐ బాణాల శ్రీనివాసులు, పట్టణ ఎస్సై కరుణాకర్, ఏఇఓ శ్రావణ్‌కుమార్, ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథాచార్యులు తదితరులు రామదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ముందుగా భక్త రామదాసు కీర్తనలకు అనుగుణంగా నృత్య కళాకారిణులు భరత, కూచిపూడి, జానపదం, పేరిణి, గిరిజన తదితర సంప్రదాయ నృత్యాలతో అలరించారు. కీర్తనలకు అనుగుణంగా తమ అభినయాన్ని చాటారు. ఈ ప్రదర్శనను తిలకించిన భక్తులు ఆద్యంతం భావోద్వేగానికి గురయ్యారు. భద్రగిరులు వీరి నృత్యాలకు తలూపుతున్నట్లు రాజవీధి, రామాలయం ప్రాంగణం అంతా మార్మోగిపోయాయి. అనంతరం రామాయణ ఘట్టాలకు సంబంధించిన నృత్య రూపకాలు పలువురిని ఆలోచింప చేశాయి.
ఎల్‌బి స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రదర్శన
భక్త రామదాసు కీర్తనలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసేందుకు వీలుగా హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో భద్రాద్రి నృత్యాభిషేకాన్ని ఏప్రిల్ లేదా మేలో ఏర్పాటు చేస్తున్నట్లు తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, ఆటా చైర్మన్ బెక్కంటి శ్రీనివాసరావు ప్రకటించారు. ఎంఎస్ నాగరాజు, తానా, ఆటాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 5 వేల మంది నృత్య కళాకారిణులతో ఈ భక్త రామదాసు కీర్తనల నృత్యాభిషేకం ఉంటుందని తెలిపారు. భద్రాచలంలో ఆ రాముని సన్నిధిలో భక్త రామదాసు కీర్తనల భద్రాద్రి నృత్యాభిషేకం తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సుల్లోకి ఎక్కడం ఆనందంగా ఉందని వారు అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం కోసమే ఈ నృత్యాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తాళ్లూరి పంచాక్షరయ్య తెలిపారు.

సత్తుపల్లి ప్రాంత వాసులకు
నన్ను ప్రశ్నించే హక్కు ఉంది
* త్వరలో రైల్వేలైను, గోదావరి జలాలు
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి, జనవరి 29: తాను రాష్ట్రంలో మంత్రిగా ఎదిగినా, ఏ స్థాయిలో ఉన్నా అందుకు సత్తుపల్లి ప్రాంతవాసులే ముఖ్యభూమికలని మీ కోరికను తీర్చాల్సిన బాధ్యత నాపై ఉందని, మీ ప్రతి అవసరానికి నన్ను ప్రశ్నించే అధికారం మీకు ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తిశిశు సంక్షేమ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లిలోని మాధురి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. సత్తుపల్లి మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. పాలేరు ఉప ఎన్నికల్లో తన విజయం కోసం అనేక మంది రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశారని, ఎన్నికల ముందు పాలేరు చూసిన వారందరూ ఇప్పుడు పాలేరు వచ్చి చూడాలని తుమ్మల కార్యకర్తలను ఆహ్వానించారు. తాను ఎక్కడికి వెళ్ళినా సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచినట్లు తమప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆప్రాంత వాసులు తనను కోరుతున్నారని చెప్పారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను మోడల్‌గా తీసుకొని జిల్లాలో అన్ని అంతర్గత రహదారుల నిర్మాణాలతో పాటు సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తామన్నారు. జిల్లా అంతటా సస్యశ్యామలం కావాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితేనే అది సాధ్యమవుతుందని తుమ్మల పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయ్యాయని రెండో దశ టెండర్లను త్వరలో పిలువనున్నామని తెలిపారు. మొదటి దశలోనే సత్తుపల్లి ఫ్రాంతానికి గోదావరి జలాలు వస్తాయని తెలిపారు.వచ్చే ఉగాది నాటికి సీతారామ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి గోళ్ళపాడు చానల్ ద్వారా నీళ్ళిస్తామన్నారు. జిల్లా మొత్తానికి తాగు, సాగు నీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. సత్తుపల్లిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వాలని అప్పట్లోనే తాను,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పట్లోనే అనుకున్నట్లు చెప్పారు.
కెసిఆర్ సభకు భారీగా తరలండి
పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించే భక్తరామదాసు ప్రాజెక్టును మంగళవారం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించనున్నారని తుమ్మల తెలిపారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. తాను పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కార్యకర్తలు వ్యవహరించిన తీరు మాదిరిగా ఆ ప్రాంతానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎస్సీ సత్యం, మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
*విమర్శలు మాని సహకరించాలి
* మంత్రి తుమ్మల

ఖమ్మం, జనవరి 29: గత ప్రభుత్వ హయాంలో కేవలం శంకుస్థాపనలకే పరిమితమైన ప్రాజెక్టులన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై విమర్శలు మాని సహకరించాలని రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక, అటవీ, పర్యావరణ, భూసేకరణలకు సంబంధించిన అడ్డంకుల వలన ప్రాజెక్టులు అగిపోతాయని అనుకున్న వారికి సరైన సమాధానమే ఈ భక్తరామదాసు ప్రాజెక్టు అన్నారు. 30కోట్లతో పూర్తి కావల్సిన పలు ప్రాజెక్టులు 300కోట్లకు చేరిన విషయాలను గుర్తుచేశారు. దీనివల్ల రైతులతో పాటు ప్రభుత్వానికి కూడ నష్టం వాటిల్లిందన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు కోసం 170కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, మిగిలిన 160కోట్ల రూపాయల ఖర్చుతో పైపులు, మోటార్లు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల కోసం గత పాలకులు తీసుకువచ్చి పక్కన పడివేసిన వాటిని వినియోగించామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయటానికి 123జీవో ద్వారా ఏ విధంగా నష్టం జరగకుండా పూర్తి చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సీతారామ, కాళేశ్వరం, డిండి వంటి ప్రాజెక్టులను కూడ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నీరును అందించేందుకు గోదావరి జలాలను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ప్రస్తుతం గోదావరి జలాల ద్వారా 8సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. గత 12సంవత్సరాలలో ప్రాజెక్టుల నిర్మాణంలో విఫలమైన పార్టీలు భక్తరామదాసు ప్రాజెక్టుపై అడ్డంకులు వేసేందుకు ప్రయత్నించారని, అయినప్పటికి అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి నిరూపించామన్నారు. అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను సాధ్యం చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై భవిష్యత్తు లేని పార్టీలు విమర్శలు చేయటం తగదన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పనులను చూసి వారి పార్టీకి ఎక్కడ మనుగడ లేకుండా పోతుందోననే భయంతోనే టిఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధికి అడ్డంకులు వేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న పనులకు అడ్డురాకుండా సహకరించాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ కృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.
భక్తరామదాసు జయంతి సందర్భంగా పట్టువస్త్రాల సమర్పణ
నేలకొండపల్లి, జనవరి 29 శ్రీ్భక్తరామదాసు జయంతి సందర్భంగా కంచర్ల తరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు పట్టువస్త్రాలను గ్రామ సర్పంచ్ వంగవేటి నాగశ్వరరావుకు అందించారు. ఆదివారం నేలకొండపల్లిలోని భక్తరామదాసు జ్ఞాన మందిరం కంచర్ల శ్రీనివాసరావు పట్టవస్త్రాలు, భక్తరామదాసు రచించిన సిడిలను అందించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా కంచర్ల వారసులు భక్తరామదాసునికి పట్టువస్త్రాలు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, అర్చకులు రజినికాంత్ చార్యులు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, మల్లయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీ్భక్తరామదాసు శిలావిగ్రహానికి ఘన స్వాగతం
నేలకొండపల్లి, జనవరి 29 : శ్రీ్భక్తరామదాసు జయంతిని పురస్కరించుకోని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన శ్రీ్భక్తరామదాసు శిలావిగ్రహానికి భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం నేలకొండపల్లి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన శిలా విగ్రహం వాహనాన్ని మండల పరిషత్ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, సూపర్‌డెంట్ శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, సాధు రాధకృష్ణమూర్తి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు పూజలు నిర్వహించి ఉరేగింపును ప్రారంభించారు. కొక్కిరేణి భక్తబృదం కోలాటాలతో గ్రామంలోని పురవిధులలో ఉరేగింపుగా శ్రీ్భక్తరామదాసు జ్ఞాన మందిరంకు తీసుకోని పోయారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా నిర్వహిస్తున్న శ్రీ్భక్తరామదాసు జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన శ్రీ్భక్తరామదాసు శిలావిగ్రహంను రాష్ట్ర మంత్రి తుమ్మల ఈనెల 31న ఆవిష్కరించనున్నారు. ఈ ఉరేగింపులో సామల కోటేశ్వరరావు, మనె్న కోటేశ్వరరావు, మల్లయ్య, కైలాసపు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, నాగమూర్తి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సమరయోధులను స్మరించుకుంటూ వౌనం పాటిద్దాం
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 29: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తిని స్మరించుకుంటూ నేడు ఉదయం 10గంటలకు నగరంలోని ప్రతి ఒక్కరూ ఎక్కడవారు అక్కడే నిలుచుని తమ వంతు బాధ్యతగా రెండు నిమిషాలు వౌనం పాటించాలని నగర డిఎస్పీ సురేష్‌కుమార్ కోరారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వౌనం పాటించే సమయంలో రెండు నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేయటం జరుగుతుందని తెలిపారు. విద్యాలయాలలో, ప్రార్థన మందిరాలలో ఉదయం 10గంటలకు సైరన్ మోగించి వౌనం పాటించాలని కోరారు. ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో పాల్గొని సమరయోధుల త్యాగాల స్ఫూర్తిని మననం చేసుకోవాలన్నారు.

నేడు సత్తుపల్లి బంద్
సత్తుపల్లి, జనవరి 29: నేడు సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి జిల్లాను కాంక్షిస్తూ సత్తుపల్లి జిల్లా సాధన జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించు సత్తుపల్లి బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని జెఎసి నాయకులు కోరారు. అదే విధంగా దీక్షా శిభిరం వద్ద వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి తమ మద్దతును తెలియజేయాలని కోరారు. 93వ రోజు టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది.
తొమ్మిది గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలి
తిరుమలాయపాలెం, జనవరి 29: శ్రీరాంసాగర్ రెండవ దశకింద తవ్విన కాలువల ద్వారా తొమ్మిది గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రఘనాధపాలెం గ్రామంలో ఆదివారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సాగునీటిపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సాగునీరు అందని గ్రామాలకు సత్వరమే సాగునీటిని అందించాలని ఈ నెల 31సిఎంను కలిసేందుకు సిద్దంకావాలన్నారు. బోదకాలు వ్యాది గ్రస్థులకవు పెన్షన్లు ఇవ్వాలని, పూర్తికాని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలన్నింటిని పూర్తిచేయాలని సిఎంకు మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎం ఇజ్రాయిల్, వి వెంకటేశ్వర్లు, పి నరేందర్, టి హనుమంతరావు, ఎ నర్సయ్య, బి రాధాకృష్ణ, ఎన్ లాజర్, జి శ్రీనివాసరెడ్డి, పి యశోద తదితరులు పాల్గొన్నారు.

విలువిద్య క్రీడాకారుడికి ఆర్థిక సహాయం
సత్తుపల్లి, జనవరి 29: విలువిద్యలో ఎంతో నైపుణ్యం ఉండి ఎన్నో పోటీలలో పాల్గొని బహుమతలు అందుకున్న దమ్మపేట మండాలనికి చెందిన కొత్తచీపురుగూడెం వాసి పెనుబల్లి లక్ష్మణరావుకు ఆదివారం స్థానిక జెవిఆర్ డిగ్రీ కళాశాలలో డిఎస్పీ బల్లా రాజేష్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. లక్ష్మణరావు ఒక నిరుపేద గిరిజన కుటుంబంలోపుట్టి ఒక వైపు జీవనం గడిచేందుకుకూలిపనులు చేసుకుంటూ మరోవైపు జెవిఆర్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ విలువిద్యలో రాణించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత నెలలో కాకతీయ యూనివర్శిటీలో జరిగిన ఎంపిక పోటీ ద్వారా వచ్చేనెల 14నుండి 20 తేదీలలో మచిలీపట్నంలో కృష్ణా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా స్థానిక జెవిఆర్ కళాశాలలో సాధన చేస్తున్నాడు. మార్నింగ్ వాకింగ్‌కు వస్తున్న కొందరు లక్ష్మణ్‌రావు వివరాలు తెలుసుకొని తమవంతు సహాయాన్ని అందజేశారు. ఒలంపిక్స్‌లో రాణించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా లక్ష్మణ్ తన ప్రతిభను ప్రదర్శించగా అక్కడ ఉన్నవారిని మంత్ర ముగ్థులను చేసింది. ఎస్సై వసంత్‌కుమర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగరపంచాయితీ వైస్ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, గ్రాండ్ వౌలాలి, వనమా వాసు, దామెర రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గండ్రోతు నర్సింహరావు, ఒగ్గు దామోదర్‌రెడ్డి, తిరుపతిరావు, తోట గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
తిరుమలాయపాలెం, జనవరి 29: ఈ నెల 31న తిరుమలాయపాలెంలో జరగనున్న సిఎం సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. సిఎం సభ జరగనున్న ప్రదేశాన్ని, స్టేజి నిర్మాణపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భహిరంగ సభకు రానున్న జనాభా దృష్ట్యా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రులు, విఐపిలు, ప్రజలు కూర్చుకునేందుకు కావల్సిన ఏర్పాట్లు చేసి, అనువుగా భారికేట్లు ఏర్పాటు చేయాలన్నారు. కిట్టుహొటల్ ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను జడ్పిసిఇఒ నగేష్, డిపిఒ శ్రీనివాస్‌రెడ్డిలు పరిశీలించారు. ఈ స్ధలాన్ని చదును చేసి అనువుగా ఉండే విదంగా సిద్దం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అనంతరం భక్తరామదాసు ఎత్తిపోతల పథకం డెలివరి సిస్టంపై ఇనుప పెపులతో సిఎం ఎక్కెవిదంగా పైపులను అమర్చుతున్నారు. వారి వెంట ఆర్డిఒ పూర్ణచందర్‌రావు, డిఎస్పీ సురేష్‌కుమార్, ఎండిఒ సన్యాసయ్య, తహశీల్ధార్ జి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

కవి చిగురుమళ్లకు తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
* అభినందించిన ఎల్‌ఎఫ్ అధినేత మాగంటి సూర్యం

భద్రాచలం టౌన్, జనవరి 29: హరితహారం నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రేరణగా నిలిచే విధంగా ‘మొక్కనాటవోయి ఒక్కటైన’ అనే మకుటంతో వృక్ష శతకం రచించి, 22 మంది విద్యార్థులతో 15 నిమిషాల్లో 101 కంఠస్థ పద్యాలను గానం చేయించిన కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల అధినేత మాగంటి సూర్యం ముఖ్య అతిథిగా హాజరై చిగురుమళ్లను అభినందించారు. చిగురుమళ్లకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం భద్రాద్రికే గర్వకారణమని, తన కవితల ద్వారా సామాజిక స్పృహ కల్పించేందుకు ఆయన కృషి చేయడం అభినందనీయమన్నారు. సరళమైన పదజాలంతో, భావ స్పష్టతతో, ఆటవెలది చందస్సులో సాగే ఇతని పద్యాలు జనరంజకంగా ఉంటున్నాయని కొనియాడారు. ‘హరిత పద్యకవితార్చన’ పేరుతో ఈయన చేపట్టిన హరితోద్యమం, నారీ శతకం, చెరువు శతకం, విద్యా శతకం, బాలల శతకం, మద్యపాన శతకం అనితర సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మొక్కలను నాటటం అలవాటుగా చేసుకోవాలి
* వైసిపి జిల్లా అధ్యక్షుడు లక్కినేని
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 29: మొక్కలను నాటటాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. వవజీవి దరిపల్లి రామయ్యకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును పోందిన ఆయనకు జిల్లా వైసిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మనించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ రామయ్య ఆధ్వర్యంలో ఇప్పటికి కోటి మొక్కలను నాటటం జరిగిందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటటం అలవాటు చేసుకోవాలన్నారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అటువంటి చెట్లను మానవ తప్పిదల వల్ల తొలగిస్తున్నారన్నారు. మానవ జాతికి ఎంతో మేలు చేస్తున్న మొక్కలను పరిరక్షించుకోవాలన్నారు. మొక్కల వల్ల మనుషులు అనేక విధాలుగా లాభాలు పొందుతున్నారని అటువంటి మొక్కలు రక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అటువంటి మొక్కలను నాటినందుకే రామయ్య దంపతులకు అంతటి అదృష్టం దక్కిందన్నారు. చిన్ననాటి నుండే రామయ్యకు మొక్కలపై మక్కువ ఎక్కువ అని ఆయనను చూసి మనమందరం మొక్కలపై ప్రేమను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సైదులు, మందడపు వెంకటేశ్వరరావు, వేమిశేట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సప్తపథికి 16 అవార్డులు
పెనుబల్లి, జనవరి 29: మండలంలోని సప్తపథి లయన్స్‌క్లబ్ ఆఫ్ విఎం బంజరుకు 16 అవార్డులు దక్కాయి. ఆదివారం భద్రాచలంలో జరిగిన రీజియన్ లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఈ అవార్డులను ప్రధానం చేసారు. రీజియన్ వ్యాప్తంగా ఉత్తమ అధ్యక్షుడికి రెండవ, ప్రధానకార్యదర్శికి మొదటి స్థానం దక్కింది. నేత్రాలను సేకరించటంలో, సేవాకార్యక్రమాలలో ప్రథమస్థానాలతో పాటు పలు అంశాలలో మొత్తం 16 అవార్డులు అందజేసినట్లు రీజియన్ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు.