ఖమ్మం

అణచివేత నుంచే నా పాట పుట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 4: ఈటెల్లాంటి మాటలతో జన కవిత్వ గళ గర్జనలతో తెలంగాణను ఒక కూడలికి తెచ్చారు. తెలంగాణ ఉద్యమానికి సాహిత్య, సాంస్కృతిక రంగం వెనె్నముకలా నిలిచి కదం తొక్కింది. పదం పాడించింది. పిడికిలెత్తి జై తెలంగాణ అనిపించింది. ఉవ్వెత్తున ఎగసేలా ఉద్యమానికి సైరన్ మోగించింది. ఈ ఆటా పాట మాటలే తెలంగాణ రాష్ట్రానికి బాటలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా గాయకుల పాత్ర అద్వితీయం.. అమోఘం. నాటి ఉద్యమ కెరటం, ప్రజా గాయకురాలు స్వర్ణక్క అలియాస్ కూట్ల స్వర్ణ. భద్రాద్రి కళాభారతి నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం భద్రాచలం వచ్చిన ఆమెను ఆంధ్రభూమి కదిలించింది. చిన్ననాటి నుంచి తాను పడ్డ అవమానాలు, ఉద్యమ సమయంలో తన జ్ఞాపకాలు, శ్రీకాంతాచారి ఆహుతిని దగ్గర నుంచి చూసి చలించిన క్షణాలు, పాటకు స్ఫూర్తినిచ్చిన గద్దర్, జయరాజ్ తదితర విషయాలను ఆమె వివరించింది. ఆమె మాటల్లోనే....
మాది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గ్రామం. దళితులం. ఊరి చివర మా ఇళ్లు ఉండేవి. మా నాన్నను ఊళ్లో పెద్దలు అరేయ్ అని పిలిచేవారు. ఎందుకు అంటున్నారు. ఏమిటి అనేది నాకు తెలిసేది కాదు. అలా అణచివేత నుంచే నా పాట మొదలైంది. అమ్మా గోదారమ్మ నువ్వందితేనే వజ్రాల తెలంగాణ... అంటూ గళం విప్పి పాడాను. అలా ఎన్నో పాటలు పాడాను. గద్దర్, జయరాజు రాసిన పాటలే పాడేదాన్ని. వారు రాసిన పాటలంటే ఎంతో ఇష్టం. మా అక్క అరుణోదయ ప్రజానాట్య మండలి కళాకారిణి. ఆమె ప్రభావం పడింది. జానపదం, భక్తి పాటలు సుమారు 7 నుంచి 8 వేల వరకు పాడి ఆల్బమ్స్ విడుదల చేశాను. కానీ ఏవీ తృప్తినివ్వలేదు. సామాజిక ఉద్యమ గీతాలే ప్రాణం. ఉస్మానియాలో ఉన్నప్పుడు 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ఆత్మాహుతిని దగ్గరుండి చూశాను. నన్ను కదిలించింది. గళాన్ని గర్జింప చేసింది. అదిగదిగో తెలంగాణ సమరభేరీ మ్రోగింది... అన్నలారా రండి అంటూ నేను పాడిన పాట వందలాది మందిని చైతన్యం చేసింది. అంతే అప్పుడు పాటకున్న శక్తి తెలిసింది. ఉస్మానియా గొంతుక, తెలంగాణ రగడ, తెలంగాణ సమర నాదం అనే ఆల్బమ్స్ తయారుచేసి 10 జిల్లాల్లో తెలంగాణ ఉద్యమంలో ధూంధాం నిర్వహించాను. నేను పాడుతుంటే పోలీసులు సైతం విని చేతులు కలిపి అభినందనలు తెలిపేవారు. భక్తి పాటల్లో ఆ కొండ కోనల్లో కొలువై ఉన్నావా.. రామయ్య ఓ భద్రాద్రి రామయ్య అంటూ భద్రాద్రి రాముడిపై కూడా భక్తిగీతం పాడాను. కానీ నాకు సామాజిక గీతాలంటేనే ఊపిరి, ప్రాణం.
కొలువిచ్చిండ్రు....
తెలంగాణ వచ్చాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 20 మంది కళాకారులం వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసినం. ఆయన తన ఇంటికి పిలిపించుకుని మాతో భోజనం కలిసి చేసిండు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 3 వేల మంది కళాకారులకు ఉద్యోగాలు, 500 ఎకరాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని వినతి చేసినం. మా 20 మందికి ముందుగాల సీనియర్ అసిస్టెంట్లుగా ఉపాధ్యాయుల కొలువులు ఇచ్చిండ్రు. ప్రభుత్వ పథకాలపై ప్రచార రూపాలు చేస్తున్నం. బతుకమ్మ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వేళ అమెరికా, దుబాయ్, అబుదాబీ, సింగపూర్ వెళ్లి ధూం ధాంలు నిర్వహించినం. ఉద్యమ సమయంలో కలలు కన్న తెలంగాణ అయితే ఇంకా రాలె. వస్తదన్న నమ్మకమైతే ఉంది అంటూ ఆమె తన మనస్సులోని విషయాలు చెప్పి ముగించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అధిక నిధుల కోసం
ప్రణాళికలు రూపొందించాలి
* భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
కొత్తగూడెం, ఫిబ్రవరి 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అధిక నిధులు రాబట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆరు శాఖల అధికారులు మాత్రమే పూర్తి స్థాయి నివేదికలను అందజేశారని, మిగిలిన శాఖలకు చెందిన నివేదికలను వారం రోజుల వ్యవధిలో ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో శాఖలవారీగా కేటాయించిన నిధుల నుంచి జిల్లాకు కేటాయించిన నిధుల వివరాలు అందటం లేదని కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత హెచ్‌వోడి నుంచి పథకాల వారీగా నిధుల నివేదిక తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి జయదేవ్, అబ్రహం, షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి మహేశ్వర్, ట్రైకార్ అధికారి డేవిడ్‌రాజు పాల్గొన్నారు.