ఖమ్మం

ప్రజాక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, ఫిబ్రవరి 18: ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఅర్ పాలన సాగిస్తున్నారని ఇల్లందు నియోజక వర్గ శాసనసభ్యుడు కోరం కనకయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ఎంపికైన పేదలకు శనివారం గార్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని బృహాత్తరకమైన పధకాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని, పేదలు ప్రభుత్వ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గార్ల మండలం పరిధిలోని అయా గ్రామాల నుంచి ఎంపికైన 105మందికి 51వేల రుపాయాల చెక్కులను అయన అందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, ఎంపిపి కోనేటి సుశీల, జడ్పీటిసి ఎద్దు మాధవి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకట్‌లాల్, గార్ల, శేరిపురం, పుల్లూరు, బుద్దారం గ్రామపంచాయితీల సర్పంచులు జి.లక్ష్మణ్‌నాయక్, కిషన్, రమేష్, రాందాస్, అయా మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు ఝూన్సీ, చావళి, కిషన్, స్వరూప, గార్ల తహశీల్దార్ ఎ.రమేష్, ఎంపిడిఓ అనురాధ, ఇఓఅర్డీ బాలరాజు, మండల ఎఇ కిషోర్, ఐటిడిఏ ఎఇ తిరుమల జయపాల్‌రెడ్డి, టిఅర్‌ఎస్ మండల కమిటి అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తొలుతగా గార్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించతలపెట్టిన ఉపాధ్యాయుల మండల స్థాయి క్రీడాపోటీలను అయన ప్రారంభోత్సవం జరిపారు.

మహాజన పాదయాత్రకు అపూర్వ స్వాగతం
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 18: సామాజిక న్యాయం కోసం సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజన పాదయాత్ర ఖమ్మం నగరంలో 2వ రోజు పార్టీలకు అతీతంగా అపూర్వస్వాగతం లభించింది. శనివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన పాదయాత్ర మయూరి సెంటర్, బస్టాండ్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, కమాన్‌బజార్, పాత వెంకటగిరి గేట్, చర్చికాంపౌండ్, రైల్వేబ్రిడ్జి మీదుగా త్రీటౌన్ ప్రాంతంలోని బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకుంది. ఈ యాత్రకు ఆటోవర్కర్స్, డ్రైవర్లు, మున్సిపల్ కార్మికులు, చిరు వ్యాపారులతో పాటు విద్యార్థులు, మేధావులు, సామాజిక సంఘాల నాయకులు స్వాగతం పలికి మద్దతు తెలిపారు. యాత్రలో ముందు భాగానా కోలాట బృందాలు, ప్రజా నాట్యమండలి కళాకారులు తమ కళలను ప్రదర్శించారు.

కెసిఆర్‌ను విమర్శించే స్థాయి తమ్మినేనికి లేదు

చింతకాని, ఫిబ్రవరి 18; బంగారు తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించే స్థాయి తమ్మినేని వీరభద్రంకు లేదని టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం చింతకానిలోని పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర కాంక్షను శాంతియుత మార్గంలో సాధించి, పేదప్రజల సంక్షేమం కోసం వినూత్న పద్ధతులలో దూసుకుపోతున్న తెలంగాణ జాతిపిత కెసిఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.ఆసరా పింఛన్లు, అర్హులందరికి రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్, రైతు రుణమాఫి, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరధ, డబల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పథకాలు కంటికి కానరావడం లేదా అని ప్రశ్నించారు. విమర్శలు చేసేటప్పుడు స్థాయిని తెలుసుకోవాలని హితవుపలికారు. చందాల వసూళ్లతోప్రజలను పీక్కుతింటూ, ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకునే తోక పార్టీ సిపిఎం అని విమర్శించారు. ఉన్న ఒక్క శాసనసభ స్థానం కూడా దక్కే అవకాశం లేక చౌకబారు విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధిచెప్పే సమయం అసన్నమైందన్నారు. తమ్మినేని పాదయాత్రకు ప్రజల మద్దతులేదని, సిద్ధాంతాలను గాలికోదిన పార్టీ సిపిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో కోలేటి సూర్యప్రకాష్‌రావు, చల్లా అచ్చయ్య, కిలారు మనోహర్, నూతలపాటి వెంకటేశ్వర్లు, పొనుగోటి రత్నాకర్, విజయలక్ష్మీ పాల్గొన్నారు.