ఖమ్మం

రాముని సాక్షిగా ప్రమాణం చేస్తాం..మీరూ ఒట్టేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 20: భద్రాచలం డివిజన్‌ను ఛిన్నాభిన్నం చేయడంలో ప్రస్తుత కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాలదే కీలక పాత్ర అని మేము రాముని సాక్షిగా ప్రమాణం చేస్తాం, మీరూ ఒట్టేస్తారా? అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు శ్రీ్ధర్‌బాబు, వనమా వెంకటేశ్వరరావు, పోరిక బలరాంనాయక్, రేగా కాంతారావులు సవాల్ విసిరారు. భద్రాచలంలో సోమవారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడగం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జన ఆవేదన సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. 2014 ఎన్నికలకు ముందు భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలిపేందుకు, ఇక్కడి సహజ వనరులను బలవంతంగా కలుపుకునేందుకు చేసిన ప్రయత్నాలను సోనియాగాంధీకి వివరించి ఆపేస్తే, గెలిచిన వెంటనే భాజపా,తెదేపాలతో కలిసి రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం పోలవరం ఆర్డినెన్స్ పేరుతో అప్పగించింది వాస్తవం కాదా? అని నిలదీశారు. నిత్యం మోసపూరిత ప్రకటనలతో ప్రజాపాలన, ఆటవిక, అక్రమరాజ్య పాలన రాష్ట్రంలో సాగుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు పథకాలు అందాయని, వాటిని అమలు చేయకుండా నిధులు దారి మళ్లిస్తూ, బుక్కేస్తూ ప్రస్తుత తెరాస ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఎక్కడ? అని ప్రశ్నించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పథకం కింద భద్రాచలంలో నాడు 2009లో అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 3లక్షల ఎకరాలకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని ఎకరాలకు పట్టాలిచ్చారో? చెబుతారా అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని, ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి వచ్చే ఆ నిధులు సుమారు రూ.20వేల కోట్లు దారి మళ్లించిందని ఆరోపించారు. రైతులకు రుణాలు లేవని, రుణమాఫీ ఒట్టిబూటకమని, వ్యవసాయం దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. అన్ని రకాలుగా దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలను మోసం చేసిన తెరాస ప్రభుత్వం తాజాగా భద్రాచలం మన్యంలో భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ పేరిట వారి ఉసురు తీసేందుకు కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యంతో ప్రజారోగ్యానికి ప్రమాదమని సబ్‌క్రిటికల్ విధానాన్ని ప్రపంచం వ్యతిరేకిస్తుంటే కెసిఆర్‌కు మాత్రం ఇవేమీ పట్టడం లేదన్నారు. కోట్లాదిరూపాయలతో వంతెనలు, సంక్షేమ పథకాలు నాడు చేపడితే నేడు పైసా ఇవ్వలేని దుస్థితి ఇక్కడ ఉందన్నారు. అందుకే ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు.