ఖమ్మం

బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 20: బయో మెట్రిక్ హాజరు విధానంతో కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బిజి క్లైమెంట్, మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని సంఘ కార్యాలయంలో జరిగిన ముఖ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధానాన్ని ఖమ్మం నగరపాలకు సంస్థ అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ వంటి నగరంలోనే కార్మికుల హాజరు విషయంలో ఫోటోలు తీస్తున్నారని గుర్తుచేశారు. అదే విధానాన్ని ఖమ్మంలో కూడా అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాత్రనక, పగలనక కార్మికులు కష్టపడి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, అలాంటి కార్మికులకు బయోమెట్రిక్ లాంటి ఆంక్షలు విధించడం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జనవరి నెల వేతనాలను వెంటనే కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిని విడనాడాలని లేని పక్షంలో తాము కార్మికుల పక్షాన అండగా ఉండి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు లక్ష్మీనారాయణ, సాంబశివారెడ్డి, పాపారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలి

భద్రాచలం, ఫిబ్రవరి 20: భద్రాచలం పట్టణంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందించాలని, ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాచలం డివిజన్ వినియోగదారుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతిపత్రం అందజేశారు. చెంతనే గోదావరి ఉన్నా పట్టణ ప్రజలు దాహార్తి తీరక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజారోగ్యశాఖ చేపట్టిన పనులు నత్తనడకన సాగడంతో ప్రజలకు ఇబ్బందులు తొలగడం లేదని కలెక్టర్‌కు వివరించారు. ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించి పట్టణ ప్రజలకు సరిపడా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ను కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీనిచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో మండలి డివిజన్ అధ్యక్షుడు పీవీ కృష్ణమాచారి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాందాస్, చైతన్య, శ్రీనివాసచారి, షపీ, శ్రీను, ఒదయ్య, రాంప్రసాద్, అరుణ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.