ఖమ్మం

సింగరేణిలో పాగాకు బిజెపి తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 20: సింగరేణి సంస్థలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ అనుబంధ కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) తహతహలాడుతోంది. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఓపెన్ కాస్టులకు భూములు ఇచ్చిన భూ నిర్వాసితుల తరఫున పోరాడి సింగరేణిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో బిజెపి, బిఎంఎస్‌లు ముందుకు సాగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు నాలుగు రోజులు పాటు బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పర్యటనతో బలాన్ని పెంచుకునేందుకు నాయకులు ఆరాటపడుతున్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, నూతన ప్రాజెక్టుల ఏర్పాటు, సింగరేణి కార్మికుల సొంతింటి పథకం వంటి సమస్యలను ఎత్తిచూపుతూ కిషన్‌రెడ్డి ప్రసంగాలు చేస్తూ సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిజిబికెఎస్)పై విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తూ బిఎంఎస్‌కు లబ్ధి చేకూరే విధంగా ప్రసంగాలు సాగుతున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ పట్టుసాధించాలనే లక్ష్యంతో యూనియన్ నాయకులు బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి సింగరేణి వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు పర్యటించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటంతో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమకు అవకాశం కల్పించాలనే సంకేతాన్ని కార్మికులకు అందిస్తున్నారు. సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్ రద్దు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఏప్రిల్‌లో నిర్వహించే విధంగా యాజమాన్యం కసరత్తు చేస్తోంది. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి సోమవారం కొత్తగూడెం నుంచి పర్యటన ప్రారంభించారు. వారసత్వ ఉద్యోగాల నియామకాల వ్యవహారం న్యాయస్థానానికి చేరటంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇరుకున పడినట్లయింది. అన్ని కార్మిక సంఘాలు ఎన్నికల ఎజెండాతో ముందుకు పోతున్న ప్రస్తుత తరుణంలో శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పర్యటన సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది.
నిరుద్యోగ నిరసన ర్యాలీ జయప్రదం చేయాలి
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 20: జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలిని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా న్యాయవాద జెఎసి జిల్లా నాయకులు జె విశ్వ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయవాద జెఎసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఆకాంక్షలు వ్యక్త పరిచే నిరుద్యోగ నిరసన ర్యాలికి ఖమ్మం జిల్లా న్యాయవాద జెఎసి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఈ నిరసన ర్యాలికి నిరుద్యోగులు ఇంటికోకరు చొప్పున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఇంటికోక ఉద్యోగం సాధించేంతవరకు నిరుద్యోగ పోరాటం ఆగదన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన నినాదంగా సాగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం 16వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇచ్చి కేవలం 5వేల ఉద్యోగాలను మాత్రమే భర్తి చేసి 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు గ్లోబల్ ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా భారత రాజ్యాంగం ప్రసాధించిన పౌరప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుందన్నారు. శాంతియుత నిరసనలకు కూడ అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో న్యాయవాద జెఎసి జిల్లా నాయకులు కూర్మాచలం రవీందస్వామి, ఎండి లతిఫ్‌అలీ, అద్దంకి నాగేశ్వరరావు, నాగుబండి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ లీగల్ కన్వీనర్ మద్ది శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.