ఖమ్మం

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి 28: సైన్స్‌తోనే సమాజాభివృద్థి జరుగుతుందని మిలీనియం పాఠశాల డైరెక్టర్ కొలగాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మిలీనియం పాఠశాలలో ఆ పాఠశాల విద్యార్థులు పలు ప్రయోగాలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో అద్వితీయ కృషి చేసిన సివి రామన్ జన్మదినాన్ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. విజ్ఞానశాస్త్రం సమాజాభివృద్థికి ఎంతో దోహదపడుతుందన్నారు. శ్రీహరికోట నుండి ఒకేసారి 104ఉపగ్రహాలను పంపించి ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలోనే నిలిచిందన్నారు. మిలీనియం పాఠశాల విద్యార్థులకు సైన్స్ ప్రయోగాల పట్ల ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయోగాలు చేసిన విద్యార్ధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రన్సిపాల్ కె సునిల్‌కుమార్, ఇన్‌చార్జ్ డి శ్రీనివాసరావు, ఎస్ రాజేశ్వరి, కె వెంకట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖమ్మంలో...
ఖమ్మం(ఖిల్లా): జాతీయ సైన్స్‌దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మంగళవారం సైన్స్‌ఎక్స్‌పో, వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ శాంతినగర్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌దినోత్సవంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెరుకూరి కృష్ణకుమారి మాట్లాడుతూ సైన్స్‌పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు విద్య ఎంతో తోడ్పడుతుందన్నారు.వివిధ రకాల ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టిఎల్‌ఎం మేళాకు విశేష స్పందన
గార్ల:మంఢల విద్య శాఖ ఆధ్యర్యంలో మంగళవారం స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన భోధనోపకరణముల(టిఎల్‌ఎం) మేళాకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సైన్సు డే సందర్భంగా ఏర్పాటు చేసిన మేళను ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు ప్రారంభించి ప్రసంగిస్తూ మారుతున్న కాలాను గుణంగా శాస్త్ర, సాంకేతిక రంగ ఫలితాలు సామాన్యులకు చేరాలని సంకల్పంతో మేళ నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకట్‌లాల్, ఎంపిటిసి చావళి, తహశీల్దార్ రమేష్, ఎంఇఓ రాంప్రసాద్, టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.శివ, టిపిటిఎఫ్ జిల్లా నాయకుడు వజ్రంనాగేశ్వరరావు, పిఅర్‌టియు మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సహదేవ్, ఎల్.సతీష్ పాల్గొన్నారు.

దివ్యాంగుల రంజీట్రోఫీ పోటీలకు రవి
కొణిజర్ల, ఫిబ్రవరి 28 : ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్న బోయింది. తను వికలాంగుడునని అత్మన్యూనతా భావానికి లోను కాకుండ క్రికెట్‌లో రాణిస్తూవిజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు ఓ వికలాంగుడు. చిన్నతనం నుంచే తనకు ఇష్టమైన క్రికెట్‌పై ఆసక్తిని కనబరుస్తూ పలు బహుమతులను సొంత చేసుకుంటున్నాడు మండల పరిధిలోని గుబ్బగుర్తికి చెందిన దివ్యాంగుడు పత్తిపాటి రవీందర్. గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నప్ప, రాంబాయి దంపతుల రెండవ కుమారుడు రవీందర్ పుట్టుకతోనే కుడి చెయ్యి లేకపోయినప్పటికీ నిరాశ చెందకుండ పట్టుదలతో ఎంబిఎ పూర్తి చేశారు. క్రికెట్‌పై ఉన్న ఇష్టం, పట్టుదలకు తోడు సడలని ఆత్మ విశ్వాసంతో క్రికెట్‌లో రాణిస్తున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 2017లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టి-20 టోర్నమెంట్ పోటీలలో సన్‌వారియర్స్ టీమ్‌లో పాల్గొని ఉత్తమ బౌలింగ్ కనబరిచి రూ 5 వేల నగదు, షీల్డ్ అందుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెలూన్ బ్లాష్టర్స్ టీమ్స్‌లో పాల్గొని బహుమతిని సొంత చేసుకున్నాడు. మార్చి 3న కేరళ రాష్ట్రంలో జరగనున్న సౌత్ ఇండియా స్థాయి దివ్యాంగుల రంజీట్రోపీ పోటీలకు ఎంపికైయ్యాడు. వికలాంగుడైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో క్రీడలలో రాణిస్తున్న రవీందర్‌ను పలువురు అభినందిస్తున్నారు.