ఖమ్మం

బ్యాంకుల విలీన ప్రకియను రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీన ప్రక్రియను రద్దు చేయడంతో పాటు జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ఆలోచనలు మానుకోవాలని ఆంధ్రబ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సందీప్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపుమేరకు మంగళవారం మధిర పట్టణంలోని అన్ని బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులను విలీనం చేయడాన్ని రద్దు చేయాలన్నారు. అంతే కాకుండా బ్యాంకుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్ ద్వారా చేస్తున్న నియామకాలను వెంటనే రద్దు చేయాలన్నారు. నోట్లరద్దు సమయంలో బ్యాంకు ఉద్యోగులు చేసిన అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని కోరారు. బ్యాంకులకు మూలధనంగా 30కోట్ల నుండి 40కోట్ల రూపాయల వరకు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉండగా కేవలం పదివేల కోట్లే కేటాయించడం వలన బ్యాంకుల్లో లావాదేవిలు నిర్వహించడం సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్యకు బ్యాంకు ఉన్నతాధికారులు బాధ్యత వహించాలనడం సమంజసం కాదన్నారు. వెంటనే తమ డిమాండ్లను అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ సమ్మెలో మధిర పట్టణంలోని ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ, ఆంధ్రబ్యాంకు, ఐఓబి, సెంట్రల్ బ్యాంకు, ఏపిజివిబి, సహకార బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో పూర్తిస్థాయిలో బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి.
నిలిచిన లావాదేవీలు
కామేపల్లి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుమేరకు మంగళవారం బ్యాంక్‌లు బంద్ పాటించాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుమేరకు మండలంలోని ఏపిజివిబి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కామేపల్లి, తాళ్ళగూడెం, పండితాపురంలోని బ్యాంక్ శాఖలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా బ్యాంక్ ఖాతాదారుల సేవలు, లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. నోట్లరద్దు సమయంలో తమకు అందించాల్సిన బృతితో పాటు అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడంతోనే ఈ బంద్ పాటించినట్లు యూనియన్‌లు పేర్కొన్నాయి. అనేక మంది బంద్ విషయం తెలియక బ్యాంక్‌ల కెళ్లి మళ్లీ వెనుదిగిరి వెళ్ళిపోయారు.

అదృశ్యమైన చిన్నారి
బావిలో శవమై తేలింది
నేలకొండపల్లి, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని చెరువుమాదారం గ్రామంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన 13 రోజుల చిన్నారి బాలిక మంగళవారం బావిలో శవవై తేలి గ్రామస్థులకు కనిపించింది. ఈ ఘాతుకానికి కన్నతల్లి, అమ్మమ్మలు పాల్పడ్డారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నకూతురి ప్రేమ వివాహం నచ్చకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అమ్మమ్మ తోళ్ళ వసంత పోలీసుల విచారణలో అంగీకరించింది. పోలీసుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెరువుమాదారం గ్రామంకు చెందిన తోళ్ళ కోటేశ్వరరావు, వసంతల కూతురు అర్పణకు అదే గ్రామానికి చెందిన నందిగామ రాంబాబుతో పదకొండు నెలల క్రితం వివాహమైంది. గత ఫిబ్రవరి 14న అర్పణకు ఆడపిల్ల జన్మించింది. కాగా రెండు రోజుల క్రితం మంచంలోని తన చిన్నారి కూతురిని పడుకోబెట్టి బాత్రూమ్‌కు వెళ్ళి వచ్చే సరికి కూతురు కన్పించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయటం గమనార్హం. కాగా మంగళవారం బాలిక మృతదేహం అమ్మమ్మ ఇంటి ప్రక్కన గల వేరొక బావిలో శవమై ఉండటం గ్రామస్ధులకు కన్పించింది. కూసుమంచి సిఐ కిరణ్‌కుమార్ ఆధ్యర్వంలో పోలీసులు విచారణ జరపగా చిన్నారి బాలికను తానే చంపినట్లు అమ్మమ్మ వసంత ఒప్పుకుంది. తండ్రి నందిగామ రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఖమ్మం ప్రభుత్వం హాస్పిటల్‌కు తరలించారు. నేలకొండపల్లి ఎస్‌ఐ కొణతం సుమన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.