ఖమ్మం

దళిత మహిళ కుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి 28: మధిర నగర పంచాయతీ పరిధిలోని ఇల్లెందులపాడు గ్రామంలో ఓ దళితమహిళ కుల బహిష్కరణకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం ఇల్లెందులపాడు గ్రామంలో నండ్రు సాయి అదే గ్రామానికి చెందిన మరియమ్మను గత 30 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. కొనె్నళ్ళపాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సాయి ఓ రైతుకు చెందిన గడ్డి వామును తగలబెట్టడంతో సాయికి ఉన్న ఎకరం భూమిని గ్రామపెద్దలు రైతుకు అప్పగించారు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి 20 సంవత్సరాల నుండి అదే గ్రామంలో విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమారైలకు వివాహం కాగా, కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో దళతవాడలో కుల పంచాయతీలు చేస్తుంటారు. దీని ద్వారా వచ్చిన జరిమానా సొమ్మును ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి రోజున వేలం పాట ద్వారా అధికపాట పాడుకున్నవారికి వడ్డీకి ఇస్తుంటారు. ఆ జరిమానా కింద ఇప్పటి వరకు వచ్చిన డబ్బు సుమారు 15 లక్షలు ఉన్నాయి. అందులోని 5లక్షలు ఖర్చుచేసి పంచాయతీలు నిర్వహంచేందుకు ప్రత్యేక షెడ్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం నండ్రు సాయి వేలం పాటలో50వేల రూపాయలను వడ్డీకి తీసుకున్నాడు. ఆయనకు జమానత్‌గా తేళ్ళూరి నరేష్ (ఏసు) ఉన్నాడు. సాయి డబ్బులు చెల్లించకపోవడంతో మరుసటి సంవత్సరం శ్రీరామనవమికి జమానత్‌గా ఉన్న నరేష్ వడ్డీతో సహ 50వేలు చెల్లించాడు. రెండు సంవత్సరాలుగా సాయి డబ్బులు చెల్లించకపోవడంతో నరేష్ దళిత వాడలోని కుల పెద్దలను గత వారం రోజుల క్రితం ఆశ్రయించాడు. దీంతో సోమవారం రాత్రి పది గంటల సమయంలో కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి సాయి డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన భార్య అయిన మరియమ్మను చెల్లించాలని ఆదేశించారు. గత 20 సంవత్సరాల నుండి నేను నా భర్తతో విడిపోయి ఉంటున్నాను నేను ఎలా చెల్లిస్తానని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పెద్ద మనుషులు మరియమ్మకు చెందిన ఇంటి స్థలంను నరేష్‌కి ఇవ్వాలని కుల పెద్దలు తీర్పు ఇచ్చారు. ఇంటి స్థలం తప్ప మరేమి లేదని ప్రాధేయపడినా కులపెద్దలు వినలేదు. దీంతో తనకున్న స్థలం ఇచ్చేది లేదంటూ పెద్దల తీర్పును మరియమ్మ వ్యతిరేకించింది. దీనికి ఆగ్రహించిన కుల పెద్దలు మరియమ్మను కుల బహిష్కరణ చేస్తూ మంగళవారం ఉదయం గ్రామంలో చాటింపు వేయించారు. దళితవాడలోని ఎవరైనా మరియమ్మతో మాట్లాడినా, నీళ్ళు పట్టుకోనిచ్చినా, శుభకార్యాలకు పిలిచినా, రేషన్ సరుకులు ఇచ్చినా వారికి 5వేల రూపాయల జరిమానా విధిస్తామని బహిరంగంగా ప్రకటించారు. కనీసం కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆమెతో మాట్లాడ కూడదనే నిబంధన విధించారు. దీంతో మరియమ్మ స్థానిక టౌన్ పోలీస్‌ను ఆశ్రయించి కుల పెద్దలైన కోట రవిరాజు, తేళ్ళూరి రాధాకుమార్, మారెపోగు ఎల్లయ్య, వెల్లంకి వెంకటేశ్వర్లు, కోట నగేష్, మందా సువర్ణరాజు, మడుపల్లి దేవయ్య, నండ్రు కిరణ్‌లపై ఫిర్యాదు చేసింది. దళిత మహిళను బహిష్కరించడం పట్ల ప్రజాస్వామ్యవాదులు, సామాజిక వేత్తలు తీవ్రంగా ఖండించారు.