ఖమ్మం

నేటి నుండి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి 28: నేటి నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. మధిర పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, సుశీల జూనియర్ కళాశాల, మండల పరిదిలోని సిరిపురం జూనియర్ కశాశాల నందు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9,534 మంది పరీక్షలు వ్రాయలన్నారు. బుధవారం ప్రథమ పరీక్షలు ప్రారంభం కానుండగా, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...
చింతకాని: మండల పరిధిలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు ఎర్పాట్లు పూర్తయినట్లు పరీక్షల నిర్వహణ ఛీప్ సూపరిటెండెంట్ సుమంత్ తెలిపారు. నాగువంచలో ఆయన మాట్లాడుతూ మార్చి 1 నుండి 11 వరకు మొదటి సంవత్సరం, మార్చి 2 నుండి 19 వరకు రెండవ సంవత్సర పరీక్షలు జరగనున్నాయన్నారు. ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 140 మంది మొదటి సంవత్సర విద్యార్ధులలో 83మంది జనరల్, 57మంది ఓకేషనల్ విద్యార్ధులు పరీక్షలు రాయనుండగా, 76 మంది రెండవ సంవత్సర విద్యార్ధులలో జనరల్ 43మంది, 33మంది ఓకేషనల్ విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్ధులకు ఫర్నిచర్, మెడికల్, త్రాగునీరు, మరుగుదొడ్లుతో పాటు ఇతర వసతులు ఎర్పాటు చేసినట్లు తెలియజేశారు. సకాలంలో పరీక్షలకు హాజరుకావాలని విద్యార్ధులకు సూచించారు. వాహనదారులు విద్యార్ధులు అడిగితే తమ వాహనాలపై పరీక్ష కేంద్రాలకు తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ అధికారి చిన్నవీరస్వామి పాల్గొన్నారు.

రంగంలోకి రోబో కాప్స్
* మందుపాతర్ల నిర్వీర్యమే లక్ష్యం
భద్రాచలం, ఫిబ్రవరి 28: విప్లప కారిడార్ రాజధాని ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరల నుంచి తమ బలగాలను రక్షించుకునేందుకు కేంద్రం సరికొత్త వ్యూహాన్ని రచించింది. త్వరలో రోబోకాప్స్‌ను రంగంలోకి దించుతోంది. దేశంలోనే అతిపెద్ద పారా మిలటరీ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డిజీ కె.దుర్గాప్రసాద్ ఈ విషయం సూచనప్రాయంగా వెల్లడించారు. దండకారణ్యం మొత్తం మావోయిస్టులు తమ రక్షణ కవచంగా మందుపాతరలు ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగంగా కూంబింగ్‌కు వెళ్తున్న బలగాలపై మావోయిస్టులు మందుపాతరలు పేల్చి మట్టి కరిపిస్తున్నారు. ఇది కేంద్ర హోంశాఖకు పెను సవాల్‌గా మారింది. విరుగుడుగా మానవ రహిత రోబోకాప్స్ ద్వారా గుర్తించిన మందుపాతర్లను నిర్వీర్యం చేసి తొలగించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు ముంబైలోని ఐఐటితో రోబో కాప్స్ రూపకల్పనకు ఒప్పందం చేసుకుంటోంది. కూంబింగ్‌కు వెళ్లే భద్రతా బలగాలు నాలుగు చక్రాల బండిపై రోబోలను తీసుకెళ్లేందుకు వీలుగా తయారుచేస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలోని కాలిబాటలు, కంకర రోడ్లు, కచ్చా రోడ్ల ద్వారా ఈ రోబోకాప్స్‌ను రవాణా చేసే వీలుగా వాటిని రూపొందిస్తున్నారు. రహదారిలోని మందుపాతర్లను గుర్తించి, వాటిని తొలగించేందుకు వీలుగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను తయారుచేస్తున్నారు. వాటిని పరీక్షించి, ప్రయోగాత్మకంగా పరిశీలించాక సిఆర్పీఎఫ్ అంబుల పొదిలోకి దాన్ని చేర్చనున్నారు. ఇటీవల దంతెవాడ, బీజాపూర్, సుక్మా, కొండగావ్, బస్తర్ ప్రాంతాల్లో నిత్యం మందుపాతర్లు పేలి జవాన్లు గాయపడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నీటిసంపులో పడి ఐదేళ్ళ చిన్నారి మృతి
సత్తుపల్లి, ఫిబ్రవరి 28 : నీటిసంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం సత్తుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే... స్థానికంగా రాజీవ్‌నగర్ 12వ లైన్‌లో నివాసం ఉంటున్న గోళ్లముడి శ్రీను-మణి దంపతుల పెద్ద కుమార్తె మహిత(5) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడుకునేందుకు వెళ్లి ఆ ఇంటి వెనుక భాగంలో నీటినిల్వ కోసం ఏర్పాటు చేసిన సంపులోప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు రోజువారీ కూలిపనులకు వెళ్తేనే ఆ రోజు గడుస్తుంది. ఈ నేపథ్యంలోకూలి పనులకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికొచ్చిన వారికి కుమార్తె కనిపించక పోవడంతో చుట్టుపక్కల ఇళ్ళలో వెతికారు. ఆచూకి దొరకక పోవడంతో ఇంట్లో ఉన్న నీటిసంపువద్ద వచ్చారు. నీళ్ళలో చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి కర్రతో నీళ్ళ అడుగు భాగంలో కదిలించి చూశారు. చిన్నారి మృతదేహం తగలడంతో వెంటనే అందులోకి దిగి బయటకు తీశారు.అంతకు ముందే పడిపోవడంతో ఎవరూ గమనించక పోవడంతో అప్పటికే మతిచెంది ఉంది. మణి,శ్రీను దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే ఈ మధ్యనే మహితను అంగన్‌వాడీ సెంటర్‌కు పంపిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కన్నకూతురు అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎస్సారెస్పీ పనులు వేగవంతం చేయాలి
* 216 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు
* కలెక్టర్ లోకేష్‌కుమార్

ఖమ్మం, ఫిబ్రవరి 28: ఎస్సారెస్పీ కాల్వ పనులను వేగవంతం చేసి నిర్ణిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో చేపడుతున్న ఇరిగేషన్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వతీత పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇంకా కెనాల్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పనులను పూర్తి చేయాలన్నారు. మధిర నియోజకవర్గంలో చేపడుతున్న జాలిముడి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. బుగ్గవాగు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పందిళ్ళపల్లి హెడ్‌వర్క్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా లకారం చెరువులో మరో వారంరోజుల్లో నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల పునరుద్దరణ పురోగతిపై సమీక్షించారు. మూడవ విడత కింద 216చెరువుల పునరుద్దరణ కోసం ప్రతిపాదన పంపడం జరిగిందన్నారు. సమావేశంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.