ఖమ్మం

గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారేపల్లి, మార్చి 6: గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అవుతాయని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గిద్దెవారిగూడెం, భల్లునగర్‌తండా, కారేపల్లి, సూర్యాతండా, టేకులగూడెం గ్రామాల్లోని సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపనలు చేశారు. కారేపల్లిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కోటి ఎకరాలకు సాగునీటి ని అందించడమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, మిషన్ భగీరధ పథకం ద్వారా త్రాగునీరు అందించటానికి జరుగుతన్న పనుల గురించి మన జిల్లాల్లో తెలియనివారు లేరని అన్నారు. సింగరేణి మండలంలో తన నిధుల ద్వారా 20లక్షల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. 40శాతం మెటీరియల్ కాంపౌండ్, 20శాతం ఇజిఎస్ కలిపి ఈ పనులు పూర్తవుతాని తెలిపారు. ఆహార భధ్రత పథకం వల్ల నేడు ప్రతి ఇంటి వరకు సిసి రోడ్లు నిర్మించే అవకాశం ఏర్పడిందన్నారు. కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలకు చేపడుతున్న అభివృధ్ది కార్యక్రమాలు చూసి కూడా ఇంకా విమర్శించాలనుకునే వారు, విమర్శలు మాని బంగారు తెలంగాణా కోసం కలిసి పనిచేయాలని సూచించారు. త్రాగు నీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ ఈ వేసవికి అందని పక్షంలో అధికారులు గ్రామాల్లో మంచినీటి ఎద్దడిని గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పాలకులు నిర్లక్ష్యం చేశారని, కెసిఆర్ ప్రభుత్వం దానిని సాధించేంత వరకు విశ్రమించదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎంపిపి బానోత్ పద్మావతి, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు జడల వెంకటేశ్వర్లు, బానోత్ దేవులా నాయక్, అడ్డగోడ అయిలయ్య, కారేపల్లి సర్పంచ్ మండెపుడి రాణి, తహశీల్దార్ వేణుగోపాల్, ఎంపిడివో ఆంబాల శ్రీనివాస రావు, గిద్దెవారిగూడెం, సూర్యాతండా సర్పంచ్‌లు, పలువురు ఎంపిటిసీలు పాల్గొన్నారు.

నివురుగప్పిన నిప్పులా ఏజెన్సీ

* పోలీసు నిఘాలో పాలెం ప్రాజెక్టు
వెంకటాపురం, మార్చి 6: ఒకపక్క మావోయిస్టులు, మరోపక్క పోలీసులు వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఏజెన్సీ ప్రాంతంలో భయాందోళన వ్యక్తమవుతోంది. మారుమూల అటవీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. తునికాకు ఫ్రూనింగ్ సమయం కావడంతో వెంకటాపురం అటవీ డివిజన్‌లోని అనేక గ్రామాల గిరిజనులు అడవిలో చెట్ల కొమ్మలు నరికే పనులకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టులు పాలెం ప్రాజెక్టు సమీపంలో మట్టిరోడ్డుపై మందుపాతర అమర్చి మూడురోజులవుతున్నా పోలీసులు మాత్రం సోమవారం సాయంత్రం వరకు నిర్వీర్యం చేయలేదు. బాంబు నిర్వీర్య టీమ్, పోలీసు జాగిలాలు సైతం వెంకటాపురం ప్రాంతానికి వస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేసి పోలీసులు వౌనముద్రను దాల్చారు. మావోయిస్టులు మాత్రం పోలీసులే లక్ష్యంగా మందుపాతర అమర్చారని ఆ శాఖ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక పోలీసు దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నట్లు సమాచారం. అడవుల్లో ఆకురాల్చు కాలం కావడంతో దూరంలో ఉన్న వ్యక్తులను కూడా కనిపెట్టేలా పోలీసులు ముందుకెళ్తున్నారు. మావోయిస్టుల భయం, పోలీసుల కూంబింగ్‌లతో గిరిజన గ్రామాలు అట్టుడుకుతున్నాయి.