ఖమ్మం

ఇసుక అక్రమ రవాణ చేస్తే పిడి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 6: గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్ హెచ్చరించారు. తనను కలిసిన ఆంధ్రభూమి విలేఖరితో సోమవారం ఆయన మాట్లాడుతూ సహజ వనరులను అక్రమంగా తరలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాపై రెండు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సామన్యులు కట్టుకునే ఇళ్లకు, మరుగుదొడ్లకు స్థానిక అధికారుల నుంచి కూపన్లు తీసుకుని తోలుకోవచ్చని సూచించారు. మానవుల అక్రమ రవాణపై ఏమైనా ఫిర్యాదులు ఉండే నేరుగా తనను కలవొచ్చన్నారు. దీనిపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. వలస ఆదివాసీలు, అమాయక గిరిజనులను మాయమాటలు చెప్పి తరలిస్తే అటువంటి ఏజెన్సీలను గుర్తించి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తామని చెప్పారు. శ్రీరామనవమికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతే మాకు ముఖ్యమన్నారు. వారికి దర్శనం, ప్రసాదం, తలంబ్రాలు అందించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారించామన్నారు. వారికి శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం గొప్ప అనుభూతిని కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. కల్యాణ మండపం నుంచి బయటకు వచ్చే మార్గం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ కౌంటర్‌ను తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉన్నందున వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు చెప్పారు. దర్శనం టిక్కెట్‌తో పాటే లడ్డూలకు టిక్కెట్లు కూడా ఇచ్చేలా, క్యూలైన్లోనే ప్రసాదం అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్నానఘట్టాల వద్ద బారికేడ్లు పటిష్టంగా పెడుతున్నట్లు చెప్పారు. భక్తులతో పాటుగా కల్యాణానికి వచ్చే వివిఐపీలు, ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు కూడా భద్రతను చూస్తున్నట్లు చెప్పారు. హెలీప్యాడ్‌లు సిద్ధం చేశామని, వారు ప్రయాణించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటను చోటు చేసుకోకుండా, కల్యాణంలో దొంగతనాలు జరగకుండా పట్టణంలో సిసి కెమెరాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

543 కోట్లతో కార్పొరేషన్ బడ్జెట్

ఖమ్మం(ఖిల్లా), మార్చి 6: ఖమ్మం కార్పొరేషన్‌కు ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరుతుందని కార్పొరేషన్ అధికారులు బడ్జెట్ రూపకల్పన చేశారు. కానీ వాస్తవంగా కార్పొరేషన్ ఆదాయం 81 కోట్లు కాగా 2017-18 సంవత్సరాల్లో అమృత్ పథకం కింద 230కోట్లు ప్రకటించగా ఇతర గ్రాంటుల నుంచి 462 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచానాలు వేశారు. నేడు జరగనున్న బడ్జెట్ సమావేశంలో మొత్తం బడ్జెట్‌ను 543.96 కోట్లుగా చూపించబోతున్నారు. నగరంలో ఉన్న 70 వేల ఆస్తుల ద్వారా సుమారు 28 కోట్ల ఆదాయం రానుండగా 2017-18 సంవత్సరం సంబందించి 21.53 కోట్లు వసూళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రిజిస్ట్రేషన్లు, మ్యూటివేషన్ల రూపేణ 12.63 కోట్లు, దుకాణాల పన్నుల ద్వారా 3.18 కోట్లు, ట్రేడ్ లైసెన్స్‌ల నుండి 1.36 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా నగరపాలక సంస్థకు వంద కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. వివిద గ్రాంటుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల నుండి ఖమ్మం కార్పొరేషన్‌కు 462 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని అధికారులు బడ్జెట్‌లో పెట్టబోతున్నారు. అమృత్‌పథకం ద్వారా రానున్న నిధులు 230కోట్ల రూపాయలు, అలాగే వివిద రూపాలలో రానున్న ఆదాయాన్ని లెక్కగట్టనున్నారు. నాన్‌ఫ్లానింగ్ నిధుల ద్వారా వచ్చే ఆదాయం 10,20కోట్లు కాగా ప్లానింగ్ నిదుల ద్వార మరికొంత ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వాస్తవ ఆదాయం 81కోట్లు ఉండగా వివిధ గ్రాంటుల ద్వారా 462కోట్లు, భవిష్యత్‌లో రానున్న నిధులను కలిపి ఈ బడ్జెట్‌లో చూపించబోతున్నారు. గత నెల ఫిబ్రవరి 28తేదిన జరగాల్సిన బడ్జెట్ సమావేశం కొంత మంది కార్పొరేటర్లు బడ్జెట్ కూర్పులో సమతూల్యం లోపించిందని అభ్యంతరం తెలపటంతో వాయిదా పడింది. కాగా అధికారులు చేసిన మార్పులు, చేర్పులతో తిరిగి బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 10.30గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్‌హాల్ నందు బడ్జెట్ అంశంపై చర్చించనున్న సమావేశానికి కార్పొరేటర్లు, కోఆప్షన్, ఎక్స్-ఆఫిసియో మెంబర్లు, అధికారులు సకాలంలో హాజరు కావాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ పాపాలాల్ కోరారు.