ఖమ్మం

కాంట్రాక్టు కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 20: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం ఆరో రోజుకు చేరింది. స్థానిక కేంద్ర కార్మికశాఖ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు.
కాంట్రాక్టు కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ శాసన సభ్యుడు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల జెఎసి రాష్ట్ర నాయకులు బి మధు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయటంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరింప చేయాలని కోరారు. సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి కాంట్రాక్టు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్మికశాఖ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు కృష్ణయ్య, సంజీవ్, మల్లికార్జున్, నగేష్, చంద్రశేఖర్, రామానుజం, పరమేష్, మోహన్, రవి గౌడ్, సరోజ, నిర్మల, నాగమ్మ పాల్గొన్నారు.

మతోన్మాదానికి కొమ్ము కాస్తున్న మోడి

* సిపిఐ(ఎంఎల్)ఎన్‌డి రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు
ఖమ్మం(ఖిల్లా), మార్చి 20: కార్పొరేట్, మతోన్మాద శక్తుల గుప్పెట్లో ప్రధాని నరేంద్రమోడి కీలుబొమ్మగా మారి వారికి కొమ్ముకాస్తున్నారని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. నగరంలో జరగుతున్న పివైఎల్ కౌన్సిల్ సమావేశాల రెండవ రోజు సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు, మతోన్మాదుల గుప్పెట్లో మోడి కీలుబొమ్మగా మారి దేశ ప్రయోజనాలను కాలరాస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో మోడి, అమిత్‌షాలు నరమేధాన్ని సృష్టించారని గుర్తుచేశారు. వెంకయ్యనాయుడు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారన్నారు. వీరి ఆగడాలను ప్రశ్నించిన ముస్లిం, క్రిష్టియన్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే యూనివర్సిటీలలో విద్యార్థుల మద్య విభేధాలు అధికమయ్యాయని దీంతో దళితులు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు హానే్వష్, సివై పుల్లయ్య, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.