ఖమ్మం

మధిర పెద్ద చెరువులో ఈతకు వెళ్ళి ఇద్దరు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర , మార్చి 21 : మత్స సొసైటీలో సభ్యత్వం కావాలంటే ఈత తప్పనిసరిగా రావాలనే నిబంధన వారి నిండు ప్రాణాలను బలిగొంది. మధిర మత్స సొసైటిలో సభ్యత్వం కావాలని అదే గ్రామానికి చెందిన యువకులు సొసైటీవారిని అడుగగా ఈత తప్పనిసరిగా రావాలన్నారు. ఈత నేర్చుకునేందుకు యువకులు సోమవారం సమీపంలోని పెద్ద చెరువుకు వెళ్ళారు. ఈ క్రమంలో కాశబోయిన పవన్‌కళ్యాణ్(19), మోదుగు రవీంద్ర (22) ఈత నేర్చుకునేందుకు చెర్వుకు వెళ్ళి ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయారు. దీంతో మధిరలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ నిబంధనలే యువకులను మృత్యువాతకు గురిచేశాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సొసైటీలో సభ్యత్వం కోసమే కల్యాణ్, రవీంద్ర ఆరాటపడ్డారని, కొంత కాలంగా సభ్యత్వ కోసం అందరి చుట్టు తిరుగుతున్నారని, నిబంధనలే వారు చనిపోయేలా చేశాయని దుయ్యబట్టారు. కాగా స్థానికులను శాంతపరిచిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మావోయిస్టుల డంపు స్వాధీనం
* చెరువు అలుగులో దాచిన మూడు తుపాకులు లభ్యం
కొత్తగూడెం, మార్చి 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ముత్తగూడెం అటవీ ప్రాంతంలోని చెరువు అలుగులో దాచి ఉంచిన మావోయిస్టు డంపును సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిమ్మవాగు చెరువు అలుగు సమీపంలో మావోయిస్టులకు చెందిన డంపు ఉన్నట్లు కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలతో ఆ ప్రాంతంలో గాలిస్తుండగా నిమ్మవాగు సమీపంలో 8 ఎంఎం ఆయుధాలు లభ్యమయ్యాయి. గుండాల సిఐ రవికుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఏజన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవటం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. గత కొంత కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆయుధాలు లభ్యం కావటంతో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను నిర్వహిస్తున్నాయి.