ఖమ్మం

బోడేపూడి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, మార్చి 20: ప్రజల మనిషి, రాజకీయ పోరాట నాయకుడు బోడెపూడి రమేష్‌బాబు (66) ఆదివారం రాత్రి అకస్మికంగా మృతిచెందారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, పండితాపురం గ్రామానికి చెందిన బోడెపూడి రమేష్‌బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాన్ కాంటినెంటల్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై రమేష్‌బాబు మృతిచెందాడు. ఈయనకు భార్య అనురాధ, కుమారులు శరత్, రాహుల్‌లు ఉన్నారు. రమేష్‌బాబు మరణవార్త తెలుసుకున్న ఆయన అనుచరులు వేలాదిగా పండితాపురంకు తరలివచ్చారు. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరున్న రమేష్‌బాబు మృతికి అన్ని రాజకీయ పార్టీలు సంతాపం ప్రకటించాయి.
జననేతకు మంత్రి తుమ్మల నివాళి
బోడెపూడి రమేష్‌బాబు మృతిచెందిన వార్త మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహం హైదరాబాద్ నుండి పండితాపురం తీసుకువచ్చేలోగా వేలాదిమంది ప్రజలు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. మండలంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుండి తమ వ్యవసాయ పనులు మానుకొని తమ నాయకుడిని కడసారి చూసేందుకై వాహనాలపై తరలివచ్చారు. స్ర్తిలు, వృద్ధులు సైతం ఎండని లెక్కచేయకుండా తమ నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. భౌతికఖాయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కోరం కనకయ్య, బాణోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి అధ్యక్షులు మువ్వా విజయ్‌బాబు, కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పాపాలాల్, టిఆర్‌ఎస్ అధ్యక్షులు బేగ్, రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి, జడ్పీటిసి మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, సిపిఐ మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరు బ్రహ్మయ్య, స్వర్ణకుమారి, బోడెపూడి శివయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, దుగ్గి కృష్ణ, బాదావత్ శ్రీను, బిజెపి జిల్లా అధ్యక్షులు సనె్న ఉదయ్‌ప్రతాప్, అమిరినేని వెంకటేశ్వర్లు, పోలూరు రామచంద్రయ్య, ఎన్‌డి నేత పోటు రంగారావు, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బాణోత్ నర్సింహానాయక్, మాదవరావు, హన్మంతరావు, యలమద్ది అప్పారావు, చిదంబరరావు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, ఏపూరి బ్రహ్మం తదితర రాజకీయ ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ఘనంగా నివాళులర్పించారు.
లేబర్ ఆఫీస్ ఎదుట ఓసి కార్మికుల ధర్నా
సత్తుపల్లి, మార్చి 20: నిరవధిక సమ్మెగత 5రోజులుగా కొనసాగతున్నా చలనం లేని సింగరేణి యాజమాన్యం వెంటనే దిగిరావాలని ఇప్టూ జిల్లా అధ్యక్షులు ఎ. వెంకన్న డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో బాగంగా సోమవారం సత్తుపల్లి లేబర్ ఆఫీస్ ఎదుట కాంట్రాక్టు కార్మికులంతా ధర్నాలకు దిగారు. అధికారులు స్పదించాలంటూ నినాదాలు చేస్కూత పట్టణంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రం లేబర్ ఆఫీసర్‌కు అందజేశారు. రూ. 18వేల కనీస వేతనాన్ని నిర్ణయించి ప్రతినెలా 7వ తేదిలోపు చెల్లించాలని , పనిభద్రత కల్పిస్తూ జాతీయ సెలవు దినాలతో పాటు క్యాంటిన్ ప్రవేశం కల్పించాలని కోరారు. ఆ కార్యక్రమంలో ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి నిమ్మటూరి రామకృష్ణ, నాయకులు గద్దె సూర్యరాజు, రమేష్, దాసు, అన్వర్, బాలరాజు, రమేష్, మీరా, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.